రిపేరు షాపు
రిపేరు షాపు


రమేష్! ఇదిగో ఈ మొబైల్ మీద స్క్రీన్ గార్డు వేసివ్వు అని అడిగాడు భాస్కర్.
రమేష్ సోల్డరింగ్ మెషిన్ పట్టుకుని ఇంకో కస్టమర్ ఫోన్ లోపలి ఎలక్ట్రానిక్ చిప్ ని రిపేరు చేస్తున్నాడు.రమేష్ దుకాణం చాలా రద్దీగా ఉంది. ఆ ఏరియాలో ఎవ్వరి ఫోన్ పాడయినా దాన్ని బాగు చేసేది రమేష్ ఒక్కడే.
భాస్కర్ కి రమేష్ తో బాగా పరిచయం ఉండడం వల్ల రమేష్ చేస్తున్న పని ఆపి భాస్కర్ మొబైల్ కి కొత్త స్క్రీన్ గార్డ్ వేసిచ్చాడు.భాస్కర్ డబ్బు ఇస్తూ ఏమోయ్ రమేషూ! మా చిన్నబ్బాయి పది పూర్తి చేసి ఇంట్లో ఉన్నాడు.
ఓ నెల రోజులు నీ దగ్గర రిపేరు పని నేర్
పించకూడదూ అని.
అన్నా! నేనూ ఇలాగే పది పూర్తి చేసి పని నేర్చుకుందామని వచ్చి ఇందులో ఓ పది రూపాయలు కనపడగానే ఇంక చదువు మీద ధ్యాస తగ్గి ఇలాగే ఉండిపోయాను.
అబ్బాయిని మంచిగా చదివి డిగ్రీ తెచ్చుకోనీ. ఆ తరువాత ఇలాంటి ఫోన్లు తయారు చేసే కంపెనీలో పని చేసి కొత్త ఫోన్లే తెస్తాడేమో.చదువు మీద ధ్యాస మరల్చనీయద్దు అన్నా.అని చెప్పాడు రమేష్.కావాలంటే కాలేజీ మొదలయ్యాక తీరిక ఉంటే అప్పుడు నేర్చుకుంటాడు అని సలహా ఇచ్చాడు.
నువ్వు ఫోన్లే కాదయ్యా మనుషుల ఆలోచనలు కూడా రిపేరు చెయ్యగలవు అంటూ భాస్కర్ తన మొబైల్ తీసుకుని బయలుదేరాడు.