రచయిత
రచయిత
నేనో పుస్తకం కొన్నాను
హెడ్డింగ్ అంతు పట్టని మనిషి
అందులో మొదటి పేజీ తెరిచాను
ఇలా రాసి ఉంది నన్ను అర్ధం చేసుకోవాలంటే
కథ స్కిప్ చేయకుండా చదవండి అని
ఆ బుక్ లో తను రాసిన అంశం
తన ప్రియురాలి గురించి చాలా ప్రేమించాను దక్కలేదు అని
అంతలో ఓ పాఠకురాలినుంచి ఓ ఉత్తరం అందిది
రచయిత గారు మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని రాసి ఉంది
కుదరదమ్మా అన్నాడు బుక్ ప్రేమ గురించి గొప్పగా రాశారు
మీ ప్రేమని పొందాలని ఉంది అంది పాఠకురాలు
సరే అన్నాడు..
ఇద్దరూ కలిశారు కబుర్లు అన్నీ తన గురించే గొప్పగా చెప్పాడు
రచయిత అప్పుడు పాఠాకరాలు నేను చాలా అదృష్టవంతురాలిని మీ ప్రేమని పొందడం అంది
కానీ మల్లీ పాఠాకురాలి ప్రేమ గురించి రాయడం మొదలు పెట్టాడు మళ్ళీ కథ చదివి ఇంకో పాఠాకురాలు ఇలా ఓ ఒంద
పరిచయాలు అతని గురించి తెలుసుకున్న కొద్ది మంది
అందరిని ఇలా ఎందుకు మోసం చేస్తున్నావు ప్రేమ పేరుతో
ఓ మంచి రచయిత అనుకున్నాము అన్నారు
అయితే ఏంటి నేనింతే మారను ఎవరితో చెప్పుకుంటారు
మీ శీలాలు పోగొట్టుకున్న సంగతి అని ఘాటుగా సమాధానం
ఇచ్చాడు
ఇదంతా చదవకుండానే మధ్యలో ఆపేశాను
అప్పుడు అర్ధం అయింది అతను రాసే కథలు
వలల లాంటివి అని అందులో చిక్కుకునే పాఠకులెందరో...
ఇలాంటి దొంగ రచయితను ఏమి చెయ్యాలి
ఏమి చెయ్యలేక కొన్న బుక్ ని పాడు బడ్డ బావిలోకి
విసిరాను
కథలో ఉన్న రచయిత కళ్ళ ముందు ఉంటే
కాల్చి బూడిద చేయాలని ఉండదా ఏ పాఠకు రాలికైనా....
కానీ అక్కడ చివర పేజీ లో రచయిత పూర్తి చిరునామాతో
మీకు త్వరలో ఇంకో బుక్ వచ్చే మాసం లో అందజేస్తాను
అని రాసి ఉంది...
అయినా ఇది సాధ్యమేనా.... కథే కదా ఎలా అయినా రాయొచ్చు.
... సిరి ✍️❤️

