రాజుల్ రాజ్యాల్ గతించిపోయినవి
రాజుల్ రాజ్యాల్ గతించిపోయినవి
ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ....
అబ్బా పొద్దున పొద్దున ఆ కాటికాపరి పద్యాలు ఏంది సామీ అని భర్త పద్యాలు పాడుతుంటే అంది కస్తూరి.
కస్తూరి భర్త రంగయ్య నాటకాల్లో పాత్రలు వేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అందుకే ఈ ప్రాక్టీసు.
కస్తూరీ! నీకు హరిశ్చంద్రుని పాత్ర తెలుసు గదనే. ఆ మహానుభావుడిలాంటోడు పెపెంచకం మొత్తం మింద ఎవ్వరైనా ఉంటారంటావా.
అంత రాజ్యం ఇస్వామిత్రుడు అడగంగానే ఇడిసేసి, భార్యను అమ్ముకోని, బిడ్డను వదిలి వల్లకాట్లో పని చేసినాడు. ఏది శాశ్వతం సెప్పు అన్నాడు.
ఓబ్బా. ఆయన రాజ్యం వొదులుకున్న ధర్మాత్ముడే. ఉంది కాబట్టి వదులుకున్యాడు. మనట్టాంటోళ్లు ఏదాంతం పట్టుకుని కూసుంటే పొయ్యిలో పిల్లి కదులుతుందా. డబ్బు సంపాదించుకోవాల. మల్ల కావాలంటే ఏదాంతం సెప్పుకుందాం అంది కస్తూరి.
