Harianiketh M

Comedy Inspirational Children

4.5  

Harianiketh M

Comedy Inspirational Children

రాజమౌళిగారి చీమలు

రాజమౌళిగారి చీమలు

2 mins
1.5K


మనం చాలా అప్రమత్తంగా ఉండాలి.మనకి ఇంత తిండి పడేసి,అంత పుణ్యం కొట్టేసేవాళ్ళకి రెండేళ్లుగా కొరొనా అని,ఎదో కష్టం వచ్చిందట.పుణ్యానికో,ఖర్మకో పంచదార పలుకులు నుంచి,యూరియా గుళికలు వరకూ నిద్రపోతున్నాయి గోడౌన్లలో.ఇక్కడ ఉండొద్దు ! అంతా సనీటైసెర్ల కంపు,తడిగుడ్డల దాడులు.బేగా రండి అంటూ...ఓ కిలోమీటర్ పొడుగు లైనున్న ఆ చీమలన్నింటికి ఓ కండ చీమ వార్త అందిస్తఉంటే ,చూసి అదిరిపోయాను.

ఇవి రాత్రిపగలూ లేకుండా ఇలా ఎంగిలిముద్దులు పెట్టుకుంటూ,మన రహస్యాలను చేరవేస్తుంది..ఈ లైను లైనులో ఉండవు కదా!దేని బుద్దన్నా మారి,లేదా నా ఖర్మ కాలి తినేవస్తువులపై దాడి చేస్తే!?అపుడు ఎవరెవరి ఎంగిలి కూడో,నేను ఇంటిల్లిపాదీ తినాలన్న ఆలోచనకు భయం వేసి ,ఘాటుగా ఉంటుందని బ్లీచింగ్ పౌడర్ తినేవాటి చుట్టూ చల్లేను..

తిప్పండ్రా బళ్ళు అన్నట్టు, మార్చండిరా లైను అని పోరుబాటగా సింకు పైపునుంచి స్టవ్ దగ్గరకి వచ్చినియ్యి.

ఏముంది అక్కడా!బట్టలు ఉతికే మధ్యలో ఓ మాటు వంటగదికి విచ్చేస్తే...పాలు పొంగినియ్యి..ఆ తొరక తాట తీస్తున్నాయి చీమలు..

వామ్మో!ఎం తింటున్నాయివి!నన్ను మించినియ్యి అనుకుని హిట్ డబ్బా తీసి కొట్టబోతున్నాను,

ఎక్కడినుంచి వచ్చిందో!రాజమౌళి గారి ఈగ మొహం చుట్టూ గయ్యిమని ప్రదక్షిణలు చేసి,సైన్యాన్ని కాపాడిన మహారాజులా నా నెత్తిమీద వాలింది..

హిట్ డబ్బా చేతిలో ఉందని మర్చిపోయి అరిచేత్తో కొట్టుకున్నాను నెత్తిమీద..మా ఊరులో ఉన్న అమ్మ గుర్తొచ్చి,అమ్మా!అన్నాను..

అంతే!కితకితల్లో స్విమ్మింగ్ ఫూల్ సునామీకి చెదిరిన జనల్లాగా చీమలన్నీ గజిబిజి అయిపోయి....బా....గా నవ్వుకున్నాయి..నాకు తెలిసి ఈగ కి ధన్యవాదాలు చెప్పుకున్నాయని అనుమానం..

ఈగ దొరకలేదు కానీ ఇంట్లోనే ఉంటుంది..మనం ముదురులం కదా!ఇంట్లోకి గాలి వస్తుందని వాస్తుజ్ఞాని పెట్టించిన ప్రతి చిన్నాపెద్దా ఖాళీల్ని దోమచిక్కాలతో బిగించేసేమ్..దెబ్బకి బయటి గాలే లోపలికి రాదు.ఇంట్లో ఈగ ఎక్కడికి పోతుంది?అనుకుని,..బట్టలుతికి స్నానం చేసి,పెళ పెళలాడిపోయే కాటన్ చీర కట్టుకుని,

జడేసుకుంటుంటే గడప వారగా వామ్మో!ఎంత పెద్ద లైనని!?

ఈ సారి హిట్ తేదల్చుకోలేదు..పొద్దున్న తలనొప్పి అలానే ఉంది..నీళ్లు పోస్తే చచ్చి ఊరుకుంటాయని,లోపలికి వెళ్ళి మగ్గుతో నీళ్లు తెచ్చేను..ఈసారి వంశీగారి తేనెటీగ ,ఎక్కడినుంచి వచ్చిందో మాయదారి సంత!కుడిచేతి మీద వాలింది అనుకున్నాను,కానీ ఓ నిమిషం పోయాక మంట మొదలైంది.నల్లగా చిన్న ముళ్ళు.దీని కన్నూగాలూపడా!అనుకుంటూ మగ్గు పైకెత్తి నీళ్లు పోద్దునా!?అసలు చేతిలో మగ్గే లేదు..మెయిన్ గేట్ అవతలకి పీటర్ హెయిన్స్ లా ఎగిరి వెళ్ళిపోయింది..

నీకేమైందమ్మా!నన్ను రోడ్డుకి ఈడ్చేవ్ అన్నట్టు రెండు తిరుగుళ్లు తిరిగి ఆగిపోయింది..

ఈ దొంగముక్క చీమలు మళ్ళీ బళ్లు తిప్పినియ్యి..మెట్లు పైకి దారేసుకుంటూ ఓనర్ ఇంటికి బేదెల్లినియ్యి..

అమ్మయ్యా!అనుకుని లోపలికి వచ్చి,భోజనాలు చేద్దాం అంటూ పిల్లల్ని పిలిచేను.చిన్నోడు అమ్మో!అమ్మో!అని భయంకరంగా ఏడుస్తున్నాడు..

మెట్లు మీద నుంచి రైలింగ్ మీదుగా మళ్ళీ ,మా వంటగది కిటికీ తలుపు అంచు అందుకుని,తలుపు సందులోంచి ధైర్యంగా వచ్చేస్తున్నాయి...అప్పటికే అన్నం గిన్నె చుట్టూ రౌండ్ అప్ చేసినియ్యి..ఆ గిన్నె వీడు పట్టుకున్నాడు..దాని చీమలు వీడిని పట్టుకున్నాయి..గిన్నె వదిలేసేడు..

మురుగప్ప గారి థాంక్యూ ఫార్మర్ పాటకి సూపర్ ఫ్యాన్ అయిన నేను,ఏ రైతు కష్టాన్నో,మా ఆయన శ్రమపడ్డ డబ్బులు వెచ్చించి కొని తెస్తే,

సబ్స్క్రిప్షన్ లేకుండానే వండిన అన్నాన్ని ,చొరబడి తినేస్తున్న చీమల్ని చూసి ఈసారి మణిరత్నం సినిమాలో హీరోయిన్లలా గట్టిగా అరిచేను..

పాపం అనుకున్నాయేమో!?నిమిషాల్లో పెరేడ్ సావ్ధాన్ అయిపోయినియ్యి..పాపమ్ నోరులేని జీవాలు,పైగా కార్తీకమాసం అని పౌర్ణమికి తయారుచేసిన చలివిడి ముద్దని,ఫ్రిజ్ లోంచి తీసి ,ఏలాగో కిటికీలో తిష్టవేసినియ్యి కదా!అని ఓముద్ద అక్కడ పెట్టేను..

Tvs ఎక్సెల్ బండిలా సాగుతూనే ఉంది ఇప్పటికి..వాటి వంక చూస్తుంటే అనిపిస్తుంది.దీని అభిమానం మండ!ఇంత ముద్దని ఒకేసారి పట్టికెళ్లలేము,అలా అని

వదిలేయలేము.2జీ స్కాం లో దొంగల్లా రోజూ కనిపిస్తూనే ఉండాలి దీనికి,కానీ శిక్షించదు,భలే తీర్పు... అని నవ్వుకుంటున్నాయని..



Rate this content
Log in

Similar telugu story from Comedy