STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పుస్తకం.. హస్తభూషణం..

పుస్తకం.. హస్తభూషణం..

1 min
615

అప్పట్లో ఎంత మంచి నవలలు వచ్చేవి అంది రాధ. యద్దనపూడి సులోచనా రాణివి, యండమూరి వీరేంద్రనాథ్ గారివి ఇలా ఎంత మంది పేర్లను ప్రతి ఇంటికీ చిరపరిచితం చేశాయి అంది సుధ.


ఇప్పుడేమైందే.. ఒక్కటీ మంచి తెలుగు నవల రావట్లేదు. అప్పట్లో తెలుగు పుస్తకాలు ఎవరింట్లో ఎక్కువ ఉంటే అది పెద్ద గొప్ప విషయం.


అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలో పుస్తకమూ తెచ్చుకునే వాళ్ళం. వంట పని అయిపోయాక అలా నడవలోనో, పెరటి ద్వారం దగ్గరో మంచం వేసుకుని, పుస్తకం చదువుతూ ఉంటే.. అంటూ ఆగింది రాధ.


అబ్బా. అదో గొప్ప అనుభూతి అంది సుధ.


మరి ఇప్పుడు మంచి తెలుగు పుస్తకాలు వేయట్లేదెందుకో? చదివే వారు లేకనా? లేక వ్రాసే వారు లేకనా అంది రాధ.


చదవడం పూర్తిగా తగ్గలేదే. కాకపోతే జనాలు మొబైల్లో ఎక్కువ చదివేస్తున్నారు. పాతవి ఫ్రీగా ఇంటర్నెట్లో దొరికేస్తున్నాయ్.

తెలుగు పుస్తకాలు కొత్తవి వాళ్ళ స్వంత ఖర్చుతో వేయించుకుని మార్కెట్ చేసుకోలేక కొంత మంది రచయితలు ఇబ్బంది పడి వెనక్కి తగ్గుతున్నారు అంది సుధ.


మళ్లీ తెలుగు పుస్తకాలకు మంచి రోజులు వస్తాయంటావా? రాధ అంది.


కాలమే సమాధానం చెప్పాలి అంది సుధ.


Rate this content
Log in

Similar telugu story from Abstract