ప్రవర్తన - శిక్షణ - పునరావృతం
ప్రవర్తన - శిక్షణ - పునరావృతం
అబ్బాయిలు అలా ఏడుస్తారా? మొగోడంటే ఎంత గట్టిగా ఉండాలి?
మొగోడన్నాక తిరగాలి. ఆడదాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి.
ధైర్యంగా కొట్లాటకు పోవా.. అసలు నువ్వు మగాడివేనా. మరీ అంత సుకుమారం పనికిరాదు.
సంపాదించాలి. ఏదో ఒకటి చేసి సంపాదించాలి. మగాడు సంపాదించాలి.
ఇవే విన్నాడతను. అలానే పెరిగాడు. ఇదంతా సహజమే కదా అనుకున్నాడు. అదే నేర్చాడు. అదే నేర్పాడు.
ఉన్నట్టుండి ఇప్పుడు అణిగిమణిగి ఉండాలి అని అందరూ చెప్తుంటే వింతగా తోస్తోంది. ఏమైంది. తనకు పెళ్లయ్యింది. అంతే కదా. మరిప్పుడు ఇలా ఉండాలంటే ముందంతా ఎందుకు అలా ఉండాలని చెప్పడం?
అతనికేమీ అర్థం కాలేదు..
