STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ప్రియా మహేష్

ప్రియా మహేష్

3 mins
17


మహేష్, తల్లితండ్రి లేక, బాబాయ్ పెంపకంలో పెరిగాడు. పిన్ని ఉండీలేని ఆదరణలో పెరిగి పెద్దయ్యాడు. 


ఒక టీచర్ గా మల్లేపల్లి అనే ఊరిలో నివాసం ఉంటున్నాడు. 


మల్లేశం ఇంటిలో, రెండు గదుల ఇంట్లో, అద్దెకు ఉంటున్నాడు మహేష్.


ప్రియ ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడి మధ్యన పుట్టిన అమ్మాయి. చాలా మొహమాటం, సిగ్గు ఉన్న మనిషి. ఇంటర్ వరకూ చదివి , ఇంట్లోనే పూలమాలలు కట్టి సంతలో ఇవ్వడం , సున్నుండలు, మిక్సర్, జంతికలు తయారు చేసి పట్టణాలకు షాపులకు పంపడం చేస్తుంది. 


మల్లేశం కూతురు ఫంక్షన్ కి, ప్రియ పసుపు వోణీ నీలం పట్టులంగా జాకెట్టులో తల నిండా మల్లెలు కనకాంబరాలు కలిపి నిండుగా కట్టిన మాలను ధరించి వెళ్ళింది. 


అంతటి పదహారణాల అచ్చ తెలుగందాన్ని చూసిన మహేష్, ప్రియ నుంచీ చూపుని తిప్పుకోలేకపోయాడు. 


పైగా ప్రియ మద్యమధ్యలో తన సిగ్గు వలన తల దించుకునే కళ్ళు పైకెత్తి చూసే చూపులు, మరింత అందంగా కనిపించి, మహేష్ ని మరీ కట్టిపడేసాయి...


ఫంక్షన్ పూర్తి అయ్యి ప్రియ ఎనిమిదింటికి, తన ఇంటికి బయలుదేరింది.. 


కాసేపటికి వెనకాలే సైకిల్ మీద మహేష్ వచ్చి


" మీరు బావున్నారండీ. మీ అమ్మానాన్నగారితో మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకుంటానని చెబుతాను " అనేసాడు..


ప్రియ మరింత సిగ్గులమొగ్గయ్యి ముడుచుకుపోయి పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళిపోయింది.


మల్లేశం మహేష్ ప్రియల వరస గమనించాడు. మర్రోజు పొద్దున్నే మహేష్ మల్లేశంని, ప్రియ కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 


మల్లేశంని పెద్దమనిషిగా, తనతో పాటూ తోడు రమ్మని కూడా అడిగాడు. 


ప్రియ తండ్రి శంకరయ్యకి, కులం పట్టింపు ఉంది, అందుకే ఒప్పుకోలేదు, పైగా ప్రియ జోలికి వస్తే ఊరుకోనని కూడా మహేష్ కి హెచ్చరిక చేసాడు. 


మహేష్ కి బాధగా అనిపించింది. ప్రియ వైపు చూసాడు. ప్రియ మహేష్ వైపు నిరాశగానూ, ప్రేమగానూ కలగలిపి చూసింది. ఆ చూపులో చూపు కలిపిన మహేష్ కి ప్రియని వదులుకోలేనని బలంగా అనిపించింది.. 


శంకరయ్యకు చెప్పాడు మహేష్ " ప్రియకు ప్రేమను పంచి ఇచ్చేది ఒక మనిషి కానీ కులం కాదండీ. ప్రియ మీద నా మనసులో తరగని ప్రేమ ఏర్పడింది. నా ప్రేమకు ప్రియని దూరం చేసి మా ఇద్దరికీ అన్యాయం చేయకండీ ప్లీజ్ " అన్నాడు అభ్యర్ధనగా మాట్లాడుతూ ...


మల్లేశం కూడా శంకరయ్యకు నచ్చ చెప్పాడు 


" ఈ రోజుల్లో కులం జాతకాలు ఆస్ధులు చూసుకోవటమే కానీ, మనమందరమూ ప్రేమలను పట్టించుకోము, అందుకే పది కుటుంబాలలో ఏ ఒక్కటో రెండో కుటుంబాలలో తప్ప, మిగిలిన కుటుంబాలలో, సర్దుబాటుతో ఈడ్చుకుంటూ నడుపుతున్న జీవితాలే, ఇలా మనసులు కలుపుకున్న అబ్బాయ్ అమ్మాయ్ లను ఒక్కటి చేసామంటే వీరిద్దరిదీ పచ్చటి కాపురం కాగలదురా శంకరం " అని....


శంకరం భార్య పార్వతి కూడా " నిజమే అన్నయ్యా మా పెద్ద అమ్మాయిలు ఇద్దరూ మా అల్లుళ్ళు ప్రేమగా చూసుకోవట్లేదని ఒకటే బాధ పడుతుంటారు. ఆర్ధికంగా అవసరాలకు మేము సర్దగలము కానీ కూతురు అల్లుడు మధ్య సఖ్యత కోసం మేం ఏమి చెయ్యగలం చెప్పండి. నాకైతే అబ్బాయి గుణగణాలు, ఉద్యోగం మంచివైతే మా ప్రియనిచ్చి చేయటానికి సమ్మతమే " అనేసింది...


కాస్తంత సమయం తరువాతే నిర్ణయం చెబుతానని శంకరం, అప్పటికి విషయం దాటేసాడు.


నెల తరువాత, ఓ రోజు, స్కూలు పని మీద మహేష్ బస్సు ఎక్కి కూర్చున్నాడు. 


సిటీలో పెరిగిన వాడు కదా అతను అని, మహేష్ కి నచ్చుతుంది అనుకుని, ప్రియ, మల్లేశం కూతురిని అడిగి, ఆమె పంజాబీ డ్రస్ తీసుకుని, తను వేసుకుని, తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకున్నాడన్న శుభవార్త చెప్పేందుకు , సిగ్గుల చేమంతిలా నడిచివస్తోంది. 


దూరంనుంచే ప్రియను చూసి ఆమె మోములోని భావంతో, ఆమె చెప్పబోయే విషయం దాదాపుగా తెలిసిపోతుండగా, అవునో కాదో అన్న చిన్న సందేహంతో గబగబా బస్ మెట్ల మీదకి వచ్చి త్వరగా రా అని ప్రియను పిలుస్తున్నాడు మహేష్. 


ప్రియ నోటి నుంచీ మంచివిషయమే వస్తుంది కదా అనే చిరు కంగారుతో ఉన్నాడు మహేష్...


ప్రియ మరింత సిగ్గుగా మారిపోయి మొహం ఎర్రబడగా చున్నీని చేత్తో తిప్పుతూ " మా నాన్న మన పెళ్ళి కి ఒప్పుకున్నారు "అంది చిలుకలా మధురంగా పలుకుతూ.. 


" హమ్మయ్యా " అనుకున్న మహేష్ బస్సు దిగి సంబరంగా ప్రియ చేతిని తన చేతితో బంధించి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా కరచాలనం చేసి ప్రియ కళ్ళ ల్లోకి చూస్తూ ప్రేమగా చెప్పాడు " రాబోయే మాఘమాసంలో మనం భార్యాభర్తలం అవుదామా " అన్నాడు చిలిపిగా... 


ప్రియ సిగ్గుతో మరీ ఇంకా ముడుచుకుపోయింది. 

" నీ సిగ్గు సింగారం కానూ " అని మురిపెంగా అంటూ ప్రియ తల మీద సరదాగా తట్టి బస్ ఎక్కాడు మహేష్, " పని అవగానే త్వరగా నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తా బంగారం " అని అంటూ....


Rate this content
Log in

Similar telugu story from Romance