Harianiketh M

Comedy Drama Inspirational

4  

Harianiketh M

Comedy Drama Inspirational

ప్రేమకానుక....

ప్రేమకానుక....

3 mins
249


Iసుబ్బయ్య తాత తన సైకిల్ని కడిగినట్టు,బెంజ్ కంపెనీ కూడా తన కార్లని కడగలేదు..?నాలుగు తరాల్ని చూసిన సుబ్బాయ్య తాత.... అన్ని తరాలకు తాతే!తన ఈడువాళ్ళు కూడా...ఏరా!సుబ్బయ్యతాతా అనే పలకరిస్తూఉంటారు..... దానికి చాలా దర్జాగా మురిసిపోతాడు సుబ్బయ్య....ఎవరైనా ఒక్క మాట తూలినా,వాడికి ఎం కాదు.....చిన్ని కృష్ణుడుగా మారి,సైకిల్ పార్టులు లేపేస్తూంటాడు..... అలాంటివి వాళ్ళ ఇంటి కొట్టుగదిలో స్టాకడిపోయి ఉంటాయి....సుబ్బయ్య భార్య ఇనప వస్తువుని,అలా దొబ్బేసి తీసుకురాకూడదు....శని పట్టుకుంటుంది...అన్నా.... పట్టించుకోడు...

ఊళ్ళో ఎవరి సైకిల్ పార్ట్ అయిన కనిపించకపోతే....

మనం ఇంతకుమునుపు సుబ్బయ్య తాతని ఏమైనా అన్నామ?అని ,చాలా పరిశోధనలు అయ్యాక....కాదు!అనుకుంటే సైకిల్ షాప్ కి,లేదంటే సుబ్బయ్యతాత ఇంటికే...!

సైకిల్ షాప్వాడు కూడా....రిపేర్ కి తీసుకెళ్ళిన సైకిల్ యజమానిని అడిగేవాడు....బాగా గుర్తు చేసుకుని, సైకిల్ నాదగ్గర రిపేర్ కి ఇవ్వండి....మీరు సుబ్బయ్య తాత బాధితులు ఆయన ఇంటికే పోండి! అని సలహా చెప్పేవాడు...

గుర్తు లేదయ్యా బాబో!టౌన్ కి ఎల్లాలి..కూత చూసి పెట్టు అంటే...

సుబ్బయ్యతాత ఖాతా అనుకో నీది,అప్పుడు నా కొట్టే ఎత్తేస్తాడు..పోయి కనుక్కుని రా!నీ చిట్టా తాతదగ్గర ఉంటదిలే అంటాడు షాప్ వాఁడు..

ఒక ఏడు నవరాత్రులకి నా సైకిల్ ,అమ్మతో పోటీగా మెరవాల్సిందే! అని ....నల్ల కాలువలో కడగడానికి వెళ్ళేడు...పొద్దున్నే కావడంతో చాలా గేదెలు,వాటిని తోమడానికి యజమానులు కూడా ఉన్నారు....దాంతో! నల్ల కాలువ ఒకటే కళకళలాడిపోతుంది....

నా సైకిల్ ఒకటే జలకాలు ఆడాలి అని,జారుడుగట్టు మీద... సైకిల్ వెనక్కి తిప్పి ... స్టాండ్ వేసి,ఎక్కి స్పీడ్ గా తొక్కడం మొదలుపెట్టేడు....ఒడ్డున ఉన్న నీళ్లు జైన్ట్వీల్ అంత పైకి లేచినియ్యు...వెనక ఉన్న అందరిమీదా చిమ్మినియ్యి ,వాళ్ళ తిట్లు కూడా సుబ్బాయ్యతాతని తాకినియ్యి....

ఎం పర్లేదు....ఒక్కక్కడి సైకిల్ పార్టులు ఊడిపోతాయి అన్నాడు....

మాకు సైకిళ్ళు లేవుగా తాత...ఏందిసంగతి అంది చాకలి నర్సమ్మ..

సుబ్బయ్య ఇపుడు తాతగానీ,వయసులో కిష్ణుడ్ని అన్నాడు మీసం తిప్పుతూ..

గంజెట్టిన బట్టలకి ఎం ఎసరు పెడతాడో గోల అనుకుని

ఓలేయ్!పోయి ఒడ్డున కూసుందాం పాండి..

ముసలోడుతో ఎందుకు!?నవ్వుకుంటూ విశ్రాంతి కి కూర్చున్నారు..

ఓ గంట స్నానాలు చేయించేడు సైకిల్ కి.గట్టురాయి మీది కూర్చున్న ప్రెసిడెంట్ ఖద్దరు కoడువాని,పర్రున చించేడు..

ముందు ఆ సౌండ్ అర్థం అవ్వని ప్రెసిడెంట్కి,విషయం బోధపడ్డాక ..మీ అక్క నాకు వాతలెట్టేద్ది బావా అంటూ ఏడుపు మొదలెట్టేడు.

చీ!అల్లుడు చితగ్గొట్టి బైటికి తోసేస్తే..నా కూతురే ఏడవడం చూడలేదు..గుడ్డ ముక్కకి, మగాడివయుండి శోకండాలేటిరా బావా గట్టిగా నవ్వేడు.

నీ కూతురు ఏడవడం లేదంటే,నేను మీ అప్పా బాగా చూసుకుంటాం..మాకు ఆడపిల్ల అదే కదా!,అయినా సుబ్బయ్యా!పెళ్లికి ఎదిగిన పిల్లలు వచ్చినా కూతురు అలా ఇంటికి వచ్చేత్తూoటే నీకు బాధేయదూ?

ఎందుకు వేయదు?అల్లుడిని కుడితిలో దొర్లించి,చిట్టు తౌడు ఏసీ,దాయిలు ఏయాలి అనుకుంటాను.అన్నీ జరుగుతాయేటి!?నీకూ ఒక్కడే కదా !?

ఆడికి నేను బుద్ది సెప్తాను కానీ,ఈ కండువా తీసుకుని,నీ కండువా ఇయ్యి బా..నాకు ముద్దెట్టదు మీ అప్ప..కండువా లాక్కుని వడివడిగా వెళ్ళిపోయాడు.

పిరికిపందా!మళ్లీ ఈ ఇయ్యంకుడు మనూరికి ప్రెసిడెంటు..

హో లెస్సో..హోలెస్సా..ఏటయిందే గోదారమ్మా ఎందుకీ ఉలికిపాటు...పాడుతుంటే

ఆడంగులు ఆడిగేరు..ఇది కాలవ మావయ్యా!గోదారి అంటావేటీ!?

అవునవును!గోదారి అంటే నేను...ఇది మన ప్రెసిడెoటూ,నీ మొగుడు,నీమొగుడులాటి మగోళ్లు.....

వద్దులే మావయ్యా!గోదారి పాయే కదా!పాడుకో!పాడుకో!ఎందుకేబాబూ ఈడీతో గోల అనుకున్నారు.

ఇంటికెళ్లాక పొడిగుడ్డతో తుడిచి,కొబ్బరినూనె రాసేడు.నల్లగా చెన్నపట్నం పెద్దరోడ్డులా లేదూ!అన్నాడు భార్యతో.

అమ్మాయి వచ్చింది అందామె నీరసంగా...

పాతికేళ్లుగా వచ్చిపోతుంది..ఇంకా చెప్పాలా..ఇయ్యాలేటి నీరసంగా ఉన్నావ్ అన్నాడు భార్యని.

మిమ్మల్ని ఎక్కడెక్కడి ఇనపముక్కల్ని పోగేయిద్దని మొత్తుకుంటూనే ఉన్నాను.చివరికి వియ్యంకుడు సైకిల్ బెల్ కూడా వదల్లేదు మీరు..వదినా శుభ్రంగా తిట్టిపోసి పంపింది..

మొహం బాధగా మారి,కూతురు తల నిమురుతూ అల్లుడు బెల్టు దెబ్బలు కాసినదానివి,తిట్లుకి కూడా వచ్చేస్తున్నవా ఇపుడు...నాకూతురంటే అలా ఉండాలి.ఆయింటి తిక్క నువ్వే కుదర్చాలి అన్నాడు.

తాతయ్యా!మనవరాలు ఏడుస్తూ వచ్చింది..

చూశావుటే!నా మనవరాలు కూతురు గుణాన్ని ఎలా పుణికి పుచ్చుకుందో!అన్నాడు కానీ,నీకు పెళ్లి కాలేదు కదమ్మా అన్నాడు సంశయంగా.

కానీ కావాలి కదా తాతయ్యా!మన మునసుబు గారి మనవడు నేను ప్రేమించుకున్నాం అంది.

అబ్బో!మన ఖాతాలో మరో పెద్ద చేప అన్నాడు నవ్వుతూ..

ఎం ఖాతా!ఇది ఆ పిల్లాడిని ఇష్టపడింది..వాళ్ళ అత్త దీనికి ఓ షరతు పెట్టింది..మీ చేత ఈ దొంగతనం మార్పించమందట..ఇనుప ముక్క దరిద్రం అంటే నా మాట వినలేదు.ఇపుడు అదే మనవరాలి పెళ్లికి అడ్డు.

నా సరదా,దీని అత్తింటికి అడ్డా!?తిక్కమాటలు మాటాడకండి కోపంగా అన్నాడు.

బుద్దున్దా మీకు ఆ మాట అనడానికి!?కట్నాలు,ఇచ్చిపుచ్చుకోవడాలు దగ్గర పెళ్లి ఆగిపోయిందంటే గొప్పగా చెప్పుకోవచ్చు.మీ దిక్కుమాలిన అలవాటుకు పెళ్లి ఆగిందంటే సిగ్గు కదూ అంది భార్య.

నువ్వు ఊరుకున్నవేమ్మా!ఏదోటి అను అంటూ కొట్టుగాదిలోకి పోయి బస్తాని బరువుగా తెచ్చేడు బయటకి..

అబ్బ దయిద్రమోయ్!ఇంట్లో బస్తాడు సైకిల్ సామానా!?నా కూతురుకి అల్లుడు వస్తున్నా,తన్నులు తిని ఇంటికొస్తుందంటే రాదా!ఏంటీ చండాలం...నోరు నొక్కుకుంది.

అమ్మా!ఇందులో ప్రతి బెల్,డైనమో,చైను,పెడల్,లైటుకి ఒకో కధ ఉంది.కానీ అవన్నీ నీతోనే ముడిపడిఉన్నాయి.తలపాగా తీసి,అరుగు దులిపి కూర్చున్నాడు..

అదేంటి నాన్నా!అంది కూతురు.

నీ కోడలికం గురించి కూసిన ప్రతివాడు బెల్లు,ఆ వార్తలు చెప్పుకోవడానికి నడిచిన ప్రతి పెడలూ,నీమీద పడ్డ దెబ్బలకి నేను చేతగాని వాడిని అన్న ప్రతిచైను,నా లచ్చిందేవికి దరిద్రం అన్న ప్రతి దీపాన్ని,బ్రేకులు లేకుండా కథలుగా చెప్పుకున్న ప్రతిడైనమోని...ఈ సంచీలో ఏసి,శిక్ష వేసేనమ్మా వాళ్ళకి.నాకు ఇది సరదా కాదు.ఓ బాధ తీరే దారి..నా ఇంటి విషయాలు వాళ్ళకి కథలుగా కావాలి అనుకున్న ప్రతివాడు ప్రయాణాన్ని నేను ఆపాలంటే..ఇదే దారి..

ఏమీ ఉపయోగం లేకపోగా గోల పెరిగింది.బయటకు వెళ్తే మాటలు వింలేకపోతున్నాం.

అయితే ఎం చేయమంటావ్!మనవరాలి పెళ్లి కదాని మనసు మెత్తబడింది.

ఓ మాసం తరువాత పెళ్లిలో పందిరికి ఓ దరి సుబ్బయ్య నాలుగు బస్తాలు వేసుకు కూర్చున్నాడు.అవతల ఆడవారు జాకిట్టుముక్కతో తాంబూలం అందుకుంటుంటే...ఇవతల నోటు పుస్తకంలో పేరు చూసుకుని,తమ పార్థుల్ని క్షమించాలి ,వారి సైకిల్ పార్థుల్ని తీసుకెళ్తున్నారు..

పొరుగూరు పేరంటం ఒకడు ఆశపడ్డాడు.బాబూ!నా సైకిల్ చైను అని పేరు చెప్పేడు.

ఈ ఇంటిపేరు మా ఊరిది కాదే!అనుకుంటూ...ఏ ఊరు మీది అన్నాడు.

హైద్రాబాదు అన్నాడు తలెగరేస్తూ..

మా ఊరి పొలిమేర దాటిందిలేదు.హైదరాబాద్ సైకిల్ చైన్ మా ఊర్లో పోగొట్టుకున్నవ?చొక్కా పుచ్చుకున్నాడు.

ఏదోటి ఇప్పించండి బాబూ!పొద్దున్నుంచి చుక్క పడక నాలిక వొణికిపోతుంది..బే..చూడండి అన్నాడు నోరు తెరిచి.

చీ!లోకంలో దరిద్రం కనిపిస్తుంది అందులో..చటుక్కున ఐడియా వచ్చింది.నీకు బైక్...బైకు నడపడం వచ్చా!?అన్నాడు.

ఓ...పులసారు (పల్సర్)నాది అన్నాడు.

దా!అంటూ తాళం అందించేడు..నీ ఇంటికి మనవరాలు కావాలిగానీ,దానికి నేను మారాల్సిన పనుందా మునసుబు పెళ్ళామా!ఇపుడు చూస్కో ఉంటుంది నీకు

రయ్యిన దూసుకుపోయింది బైకు..తరువాతి రోజే కాదు,ఏటికి కూడా రాలేదు.మునసుబు భార్య,నిప్పులు కక్కేలా సుబ్బయ్యని చూస్తుంది తప్ప,సాక్ష్యం లేని నేరానికి ఎం శిక్ష వేస్తుంది....



Rate this content
Log in

Similar telugu story from Comedy