Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

ప్రేమ గీతం

ప్రేమ గీతం

1 min
203


అర్జున్! ఒక మంచి ఆఫర్ వచ్చింది. నాకు తెలిసిన నిర్మాత ఒకరు కొత్త సినిమా ఒకటి అనుకుంటున్నారు. అందులో ఒక పాట నీ చేత వ్రాయిద్దాం అని నేను ఒప్పించాను.


నేను ఏదో వ్రాసుకుంటూ ఉన్నాను. ప్రణవ్ చెప్పుకుంటూ పోతున్నాడు. డివోషనల్ సాంగేనా అని నేను అడిగాను.


కాదు.తాపీగా చెప్పాడు ప్రణవ్. 

అయినా రచయిత అంటే ఏ ఎమోషన్ అయినా తన వాక్యాలతో పలికించగలగాలి. ఒకే రకం వ్రాస్తాను. వేరే ఏదీ వ్రాయలేను అంటే ఎలా. ఒకసారి ఆలోచించు అని సలహా ఇచ్చాడు.


నాలుగేళ్లుగా కవితలు వ్రాస్తున్నాను నేను.కొన్ని పేపర్లలో కూడా వచ్చాయి. ఆధ్యాత్మిక విషయాలే నా కవితలకు మూలం.


ఇప్పుడు సినిమా పాటంటే ..అని ఆలోచిస్తూ కూర్చున్నాను.


ప్రణవ్ ఒక సినిమా స్టూడియోలో ఫోటోగ్రఫీ డిపార్టుమెంటులో పని చేస్తున్నాడు. అతనికి ఉన్న పరిచయాలు ఉపయోగించి నాకు ఇలా ప్రేమ గీతం వ్రాసే అవకాశం పట్టుకు వచ్చాడు.


సరేరా. నేను ఏ విషయం రాత్రికల్లా చెబుతాను అని ప్రణవ్ కి చెప్పి బయటకు వచ్చాను.


సాయంత్రం వ్యాహ్యాళికి వెళుతూ ఉంటే గుడి దగ్గర ఎవరో అమ్మాయి కూర్చుని ఏదో చదువుతూ ఉంది. కాస్త దగ్గరగా వెళ్ళి విన్నాను. శకుంతల దుష్యంతుల కథ అది. కాళిదాస మహా కవి రచించిన ఆ అభిజ్ఞాన శాకుంతలం గొప్ప కావ్యంగా పేరు గాంచింది.


ప్రేమ. అవును. శకుంతల దుష్యంతుల ప్రేమ కథ. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కాళిదాసు రచించిన ప్రతి రచనలో నిగూఢంగా ప్రేమ ఉంది. నాకే ప్రేమ కథా లేదు. నేను ప్రేమ గురించి వ్రాయలేను అనుకున్నాను.


ప్రేమ గురించి వ్రాయాలని అనుకుంటే చాలు. ఎక్కడ చూసినా ప్రేమే కనిపిస్తుంది. అదిగో పూవులు. వాటి మీద వాలి మకరందాన్ని స్వీకరించే సీతాకోకచిలుకలు. అదిగో ఆకాశం. భూమి మీద ప్రేమతో చిరు జల్లులు కురిపిస్తుంది.


ప్రేమ గురించి నేను వ్రాయగలను. దైవికంగా వ్రాయగలను అనుకుని నేను వడివడిగా అడుగులు వేస్తూ ఆ అమ్మాయికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ గది వైపుకు వెళ్లసాగాను. శుభ సూచకంగా గుడి గంటలు మ్రోగిన శబ్దం వినిపించింది వెనుకనే.



Rate this content
Log in

Similar telugu story from Abstract