ప్రైవసీ భారతం
ప్రైవసీ భారతం
ఎక్కడ అప్లోడ్ చేసిన కంటెంట్ అక్కడ ఉండట్లేదు. ఒకవేళ అప్లోడ్ చేయకపోయినా మన ఫోన్లలో, కంప్యూటర్లో ఉన్న సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఎక్కడికో చేరుతోంది.
ఇది సమాజం ఆలోచించాల్సిన విషయం.
సాధన ఇంటర్నెట్ లోని సమాచారం గురించి పరిశోధన చేస్తోంది. అయినా ఇంటర్నెట్ లో ఉన్న సమాచారానికి కూడా సెన్సార్ కావాలని వ్రాస్తున్నావా? అదేమన్నా అయ్యే పనేనా? అంది శ్రీలత.
నేను చెప్పేది విను. నువ్వు ఓ రోజు ఫేస్బుక్ లో ఏదో పోస్ట్ చేస్తావు. నీ ఫొటోనో. లేకుంటే వీడియోనో. అది ఎక్కడికి షేర్ కాబడుతోందో తెలుసా? అసలు ప్రైవసీ అనేది ఉందా? అంది సాధన.
నీకు అంత ఇబ్బందిగా ఉంటే అసలు పోస్ట్ చేయకపోతే సరిపోతుంది కదా. సెట్టింగ్స్ ఉంటాయి కదా అంది శ్రీలత.
నీ మొహం. ప్రతి దానికీ పరిష్కారం వదిలెయ్యడం కాదు.
అసలు మన కంటెంట్ ఎవడు పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు. ఏ కంటెంట్ పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదు అనే బేసిక్ సెన్స్ లేకుండా పోయింది. ఏది పడితే అది పోస్ట్ చేయడం. దాన్ని వైరల్ అయిందని మురిసిపోవడం. ఇదే పనయిపోయింది అంది సాధన.
ఏమోనే! ఇంటర్నెట్ లోని ప్రైవసీ కావాలనుకోవడం అత్యాశే అనిపిస్తోంది అంది శ్రీలత.
