Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

పక్షి ప్రేమికా!

పక్షి ప్రేమికా!

1 min
388


మనుషులంతా ఒకటేలా ఉండరు రిషీ! నీకు తగిలిన వాళ్ళు రాడ్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటారు. నీలేష్ చెబుతూ ఉన్నాడు.


రిషీ దగ్గరికి ఒక నెమలి వచ్చి నిల్చుంది. అయినా పెరట్లో నెమళ్ళు ఎవడైనా పెంచుతాడ్రా? అసలు ఇది ఇల్లా లేక పక్షుల సంరక్షణా స్థలమా? నీలేష్ అంటూ ఉండగా వీధి వాకిలి చప్పుడయ్యింది.


ప్రీతి ఇంకా ఆమె టీం పెరట్లోకి చేరుకున్నారు.


నా పేరు ప్రీతి అండీ. మీ గురించి చాలా విన్నాను. మా మేగజైన్ కవర్ కోసం ఫోటో షూట్ చేయడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకుంటూ పోతోంది. ఆమెతో పాటు కెమెరామెన్ అతని అసిస్టెంట్ రావడంతో అయిన చప్పుడుకు నెమలి రిషి వెనుకకు వెళ్లి నిల్చుంది.


ఆ నెమలి పింఛాలు అన్నీ అతడిని తాకుతున్నట్లు అనిపించగానే కెమెరామెన్ క్లిక్ అనిపించకుండా 

ఉండలేకపోయాడు.


రిషి నెమలిని తీసుకుని దూరంగా విడిచి వచ్చాడు. అక్కడ మరెన్నో నెమళ్ళు ఉన్నాయి.


ఇంటర్వ్యూ తీసుకున్న తరువాత ప్రీతి వెళుతూ మళ్లీ మిమ్మల్ని కలవాలి అంది.

నేనిక్కడే ఉంటాను అన్నాడు రిషి. ఒక రామచిలుక అతడి భుజం పైన వాలింది.


మీలో ఎంత కరుణ, సహృదయత ఉన్నాయో ఈ పక్షులకీ బాగా తెలిసిపోయింది. అందుకే అవి మిమ్మల్ని వదలట్లేదు అంది ప్రీతి.


ప్రేమలో వైఫల్యం పొందాను అని నలుగురిలో కలవడం మానేసి ఎప్పుడూ పక్షులతో గడిపేస్తున్న రిషిని చూస్తే అతని స్నేహితుడు నీలేష్ కి ఒక వైపు బాధగా ఉంటుంది. 


కానీ పక్షి ప్రేమికుడిగా ఎందరో అతణ్ణి కలవాడానికి రావడం చూసి కాసేపు సంతోషంగా ఉంటుంది.


ఒక్కోసారి ఒక అనుభవం, ఒక అనుభూతి మనిషి ఆలోచనా విధానాన్ని ఎంతలా మారుస్తాయి అంటే చెప్పలేం. అది పూర్తిగా మంచీ చెడూ అని ఒడ్డున కూర్చుని అనలేం.


ఇదీ అలాంటి పరిస్థితే అని మనసులో అనుకున్నాడు నీలేష్. దూరంగా చెయ్యి ఊపుతూ ప్రీతి. ఆమె వైపు చూస్తూ నవ్వుతున్న రిషి. అతని భుజం మీద రామ చిలుక చెవిలో ఏదో గుసగుసలాడుతున్నట్లు కనిపిస్తోంది.



Rate this content
Log in

Similar telugu story from Abstract