Kishore Semalla

Action Crime Thriller

4.6  

Kishore Semalla

Action Crime Thriller

ఫింగర్ ప్రింట్స్. ఎపిసోడ్-1

ఫింగర్ ప్రింట్స్. ఎపిసోడ్-1

4 mins
771


నగరంలో జరుగుతున్న హత్యలకు కారణం ఇంకా తెలుసుకోలేకపోతున్నారు పోలీసులు. ఇది పోలీసుల అసమర్థత అనుకోవాలా?? లేకుంటే హత్యల పట్ల అశ్రద్ధ అనుకోవాలా? అర్ధం కావడం లేదు..

ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్రమేమిటంటే హంతకుడు హత్య జరిగిన ప్రతీ చోట ఫింగర్ ప్రింట్స్ వదిలి వెళ్తున్నాడు. అది ఎవరివో కూడా ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు పోలీస్ శాఖ వారు. ఇప్పటికైనా ఆ హాంతకుడ్ని పట్టుకోకపోతే ఇంకా ఎన్నో దారుణాలు చూడవలసి వస్తుంది భాగ్యనగరం అని వార్తల్లో చెప్పేది విన్న తరువాత శ్వేతాకి నిద్రపట్టడం లేదు.

హాంతకుడ్ని తలచుకునే పడుకుంది. ఒక పక్క కరోనా విలయతాండవం ఆడుతుంటే మరో పక్క ఈ సైకో వరుస హత్యలతో కలకలం రేపుతున్నాడు. కొన్నాళ్ళు బయటకి వెళ్ళకపోతేనే సరి. ఏదన్నా కావాలి అంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాం. కాసేపు పసుపు నీళ్లల్లో నానబెడితే కరోనా ని ఆపొచ్చు. అదే బయటకి వెళ్లి ఈ నిర్మానుష్యమైన నగరం లో వాడికి చిక్కితే చావుని కొనితెచుకున్నట్టే. వామ్మో నేను వెళ్లను అనుకుంది.

బాగా ఆకలిగా వుంది మాంచి బిరియాని ఆర్డర్ చేసుకుందాం అని జోమాటో ఓపెన్ చేసింది. షరీఫ్ హోటల్ నుంచి బిరియాని ఆర్డర్ పెట్టుకుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా??? అవురావురుమని తిందామా అన్నట్టు ఎదురుచూస్తుంది శ్వేత.

ఆర్డర్ పెట్టి ఇరవై నిమిషాలు అయ్యింది ఇంకా రాడు ఏంటి వీడు అనుకుని యాప్ ఓపెన్ చేసి ఫోన్ చేసింది డెలివరీ బాయ్ కి. కాల్ లిఫ్ట్ చేసి డోర్ బయటే వున్నా తెరవండి అని చెప్పాడు.

ఏంటయ్యా!!! ఆకలి తో ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి నువ్వెంట్రా అంటే ఖాళీ గా ఉన్నాయి రోడ్డులన్నీ కానీ ఇంత లేట్ చేసావు. బైక్ మీద వచ్చావా??? నడిచి వచ్చావా?? ఆ మొఖం చూడు లేట్ గా తెచ్చిందే కాకుండా ఎలా చూస్తున్నాడో వేస్ట్ ఫెల్లో అని తిట్టుకుంది.

మేడమ్ డబ్బులు ఇస్తే బయల్దేరుతాను ఎక్కువ మాట్లాడకండి అని కోప్పడ్డాడు.

లేట్ గా వచ్చిందే కాకుండా ఎంత పొగరు వీడికి తిరిగి సమాధానం చెప్తున్నాడు అనుకుని "నీ డబ్బులు నాకెందుకు ఎంత అయ్యిందో చెప్పు పడేస్తా'' అని చిరాకు పడింది.

మేడమ్ మీరు పడేస్తే ఇక్కడ ఎరుకోడానికి ఎవరు లేరు, చేతికి ఇవ్వండి చాలు అని చెప్పాడు. రెండు వందలు అయ్యింది ఇచ్చేస్తే నేను వెళ్తాను అని చేయి చాపాడు.

ఏంటి!!! చేతులు చాపి దగ్గరకి వస్తున్నావ్ దూరం జరుగు, అబ్బా!! ఎక్కడెక్కడ తిరిగావో కరోనా అంటించడానికి వచ్చావా??? బిరియాని ఇవ్వడానికి వచ్చావా?? ముందు దూరం జరుగు నీ డబ్బులు నీకు పడేస్తా అని ఒక అడుగు వెనక్కి జరిపింది వాడ్ని.

ఇదెక్కడ గోల రా బాబు అని తలపట్టుకున్నాడు.

ఏంటి??? విసుకుంటున్నావా నన్ను. హా! ఎంత పొగరు. వచ్చిందే లేట్ బిరియాని అంతా చల్లారిపోయింది. నేను కదా కోప్పడాలి, నేను కదా చిరాకు పడాలి నువ్వెందుకు అంత బాధ పడిపోతున్నావ్.

సరే మేడమ్ బిరియాని తిరిగిచ్చేయండి నేను వెళ్లిపోతా అని ఇక ఉండలేక అడిగేసాడు.

మళ్ళీ మొదలు పెట్టింది పురాణం....

వచ్చిందే లేట్.... ఆకలి తో వున్నాను.... మళ్ళీ ఆర్డర్ పెట్టి బిరియాని వచ్చే లోపు నా పరిస్థితి ఏం కావాలి. మళ్ళీ ఆ ఆర్డర్ నువ్వే తీసుకుని లేకుంటే నీలాంటి తింగరోడు ఎవడో తీసుకుని వాడు ఇంకో గంట లేట్ వస్తే అప్పుడు ఆకలి కాదు నేను పోతా.

మేడమ్ మీకు దండం పెడతా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే బయల్దేరుతాను. ఏంటి నాకీ టార్చర్. పొద్దున్నే మీరే తగలలా. ఈసారికి వదిలేయండి నన్ను, జన్మ లో మీకు మళ్ళీ కనిపించను అని ఓపిక నశించి పోయి బ్రతిమలాడు.

తను పురాణం మొదలుపెట్టి అరగంట పైన అయిపోయింది అప్పటికే.

ఆకలి అంటుందే కానీ అస్సలు తిట్టడానికి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఆమెకి అనుకున్నాడు మనసులో.

ఏంటయ్యా నా మాటలు నీకు టార్చర్ లా అనిపిస్తున్నాయా అని మళ్ళీ మొదలుపెట్టింది పురాణం.

వామ్మో!! ఇక్కడే పోయేలా వున్నాను నీ మాటలకి. చెవులలో రక్తం కూడా వస్తుంది. నీకు దండం తల్లో🙏 నీ డబ్బులు వద్దు నాకు. ఇక్కడే ఇంకో ఐదు నిమిషాలు వున్నా నాకు పిచ్చి పడుతుంది. నేను పోతా అనుకుంటూ బయల్దేరాడు.

ఆ సైకో ఎవడో దీన్ని వేసేస్తే బాగుణ్ణు. పీడా విరిగిపోద్ది అని వెళ్లిపోయాడు.

పో... పో.. నాకింత లేట్ చేశావ్ గా దానికి ఇది పనిష్మెంట్ అనుకో మళ్ళీ లేట్ చెయ్యకు ఎవరికి కూడా అని హెచ్చరిస్తోంది డోర్ దగ్గర నిలబడి.

వెళ్లి ముందు పిచ్చి ఆసుపత్రి లో చూపించుకోవమ్మ.. నీ పిచ్చి అందరికి అంటించకు అని గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు.

వెధవ!!! ఏం కుసావ్. ఆగరా అక్కడే అని అరిచింది. వాడు తుర్రుమన్నాడు. నన్ను అలా ఎలా అంటాడు. ఛ! వాడు దొరికి ఉంటేనా??? చెప్పేవాడ్ని వాడి సంగతి అనుకుంటూ తలుపు గడి పెట్టి వెనక్కి తిరిగింది.

చూస్తే సైకో..... మొత్తం బ్లాక్ ముసుగు తో చేతిలో పొడవాటి కత్తి తో ఒకటే సారి నరికేసాడు తన తలని.........

నిద్దట్లో నుంచి లేచింది ఒక్కసారి. ఇదెక్కడి పాడు కల రా బాబు అనుకుంది. వామ్మో!!! నా నోటి దూల కి వాడు పెట్టిన శాపానికి సరిపోయింది. నా తల అనుకుంటూ మొత్తం ముఖాన్ని దేవుకుంది.

హమ్మయ్య!!! ఏం కాలేదు. ఈ సైకో గాడు ఇలా తగులుకున్నాడు ఏంటి ఈ టైం లో. లాక్డౌన్ లో అందరూ ఇంటికి వెళ్తే నాకు అవసరమా??? ఇక్కడే వుండి ఇలా భయపడడం. లాక్డౌన్ పుణ్యమా అని ఎప్పుడు పడుకుంటున్నానో ఎప్పుడు లేస్తున్నానో కూడా తెలియట్లేదు.

ఉదయం 10 గంటలు అయింది. ఆకలిగా ఉంది. లేచిందే లేట్ ఏముంటుంది ఇంట్లో చేసుకోడానికి. బయటకి మరి వెళ్లలేం టైం కూడా అయిపోయింది. ఆన్లైన్ ఏ దిక్కు మనకి. అది కూడా ఆపేస్తే దిక్కు లేని దానిలా పొద్దున్నే లేచి మార్కెట్ కి వెళ్తా. అదే కరెక్ట్ నాకు అనుకుని ఇప్పటికి ఆన్లైన్ నే నమ్ముకుందాం అని జోమటో ఓపెన్ చేసింది.

పొద్దున్న కల ఒకసారి గుర్తు వచ్చింది తనకి. వామ్మో!!! కల ని మార్చి ఆర్డర్ చేద్దాం. బిరియాని వద్దు, పిజ్జా ఆర్డర్ చేద్దాం. కొంచెం నోటి దూల తగ్గించుకుని మాట్లాడదం సరిపోతుంది అనుకుంది.

అనుకున్నట్టే ఆర్డర్ పెట్టుకుంది. కలలో వచ్చినట్టే ఆలస్యంగా వచ్చాడు.

ఏమయ్యా ఏంటి ఈ లేట్ అని వెంటనే కల గుర్తు తెచ్చుకుంది. ఈ ఎదవ తో మనకెందుకు గోల ఇప్పుడు. మళ్ళీ శపించాడు అంటే కల నిజమైపోద్ది అనుకుని.............. త్వరగానే వచ్చేసావే, బాగా టైమింగ్ పాటిస్తున్నావ్. ఇదిగో ఎక్స్ట్రా ఈ ఇరవై రూపాయిలు తీసుకో అని చేతిలో పెట్టింది.

హమ్మయ్య!!! ఒక గండం నుంచి తప్పించుకున్నాం. లోపలికి వచ్చి డోర్ మూసేసి వెంటనే గడి పెట్టేసింది. అటు ఇటు మొత్తం చూసింది. ఎవరూ లేరు అక్కడ.

హమ్మయ్య!!! కల నిజం కాలేదు. మనం సేఫ్ ఈరోజుకి అనుకుంది. వెంటనే కాలింగ్ బెల్ బయట మోగింది. ఎవడు అయ్యి ఉంటాడు. ఇదెక్కడి తలనొప్పిరా సామి!!!! భయం ఇలా పట్టుకుంది అనుకుని డోర్ తియ్యడానికి వెనక్కి బయల్దేరింది.

మిగతా కథ తరువాయి భాగం లో చూద్దాం.

         ****************************

   

                                               ఇట్లు

                                          కిషోర్ శమళ్ల


Rate this content
Log in

Similar telugu story from Action