పాత సామాన్లు కొంటాం
పాత సామాన్లు కొంటాం
సుజాతా! అదిగో ఆ వీధిలోకి వెళ్ళు. తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది అని మనసు చెబుతోంది. పాత రేకులు, ఇనుప సామాన్లు వీధుల్లోని చెత్తలో ఏరుకుని షెడ్డులో ఇస్తుంది సుజాత.
పన్నెండేళ్ళ సుజాతకు నా అన్నవాళ్లు లేరు. చిన్నప్పుడు ఎవరో ఇలా చేస్తే కొన్ని డబ్బులు వస్తాయి. దాంతో పూట గడుస్తుంది అని నేర్పించగానే ఇలా చెత్తలో వెతుకుతూ ఉండిపోయింది.
ఆరోజు సుజాత ఓ వీధిలోకి వెళ్ళింది. మకిలి పట్టిన ఓ ప్లేటు లాంటి వస్తువు దొరికింది. అది తీసుకెళ్లి షెడ్డులో ఇచ్చింది.
దాన్ని కడిగి చూస్తే తళతళా మెరుస్తోంది. ఈ వింత ఏమిటి అని షెడ్డు నడిపే అతను ఓ పెద్ద మనిషికి చూపించాడు.
ఆ పెద్ద మనిషి గతంలో మ్యూజియం లో పని చేసిన అనుభవంతో ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం వస్తువు అయి ఉండవచ్చు అనీ, మ్యూజియం వాళ్ళకి అమ్మకం పెడితే లక్షల రూపాయలు వస్తాయని చెబుతాడు.
పేదరికంలో ఉన్న సుజాతకు సాయం చేయడానికి షెడ్డు నడిపే అతను, ఆ పెద్ద మనిషి కలిసి మ్యూజియం కి వెళ్ళారు.
ఇక సుజాత స్కూలుకు వెళుతుంది. చెత్త ఏరుకోవడానికి కాదు.
( 52 weeks challenge edition 5 రెండవ వారం ఇచ్చిన అంశం ఆధారంగా వ్రాసిన కథ)
