ఓ కొత్త కల(మిణుగురులు)
ఓ కొత్త కల(మిణుగురులు)
ఓ.. కొత్తబ్బాయి నువ్వేనా. మైనా అడిగింది రాజు చెయ్యి పట్టుకుని. అవును అన్నాడు రాజు.
తను ఎలా ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిందీ చెప్పాడు రాజు. మైనా అతడి ముఖాన్ని తడిమి, కలలు కాలిపోయాయని బాధపడకు. ఓ కొత్త కల ఇక్కడ నీకు దొరుకుతుందేమో అంది.
అక్కడికి బాచి వచ్చాడు. మైనా! రాజుతో మాట్లాడకు. వాడు ఇక్కడ ఉండకూడదు అన్నాడు.
ఏం. ఎందుకు? అంది మైనా.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నీకు తెలుసు కదా. ఆ ముక్కిపోయిన ఉప్మా వీడు తినగలడా అన్నాడు. మనతో వీడు ఉండలేడు అన్నాడు.
రాజు ఏడ్వాలని ప్రయత్నించాడు. కానీ అతనికి ఏడుపు రాలేదు. సినిమా గుర్తుకు వచ్చింది.
ఎక్కడికి వెళతాడు బాచీ! ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? తనని మనతో ఉండనీ అని రాజు చెయ్యి పట్టుకుని ముందుకు నడిపింది.
చిన్నారి కోయిలమ్మ అంటూ ఆమె పాట పాడుతుంటే రాజు ముందుకు నడిచాడు.
