STORYMIRROR

Midhun babu

Romance Classics Others

4  

Midhun babu

Romance Classics Others

ఓ గులాబీ

ఓ గులాబీ

1 min
3


అస్సలు తెలీదు..ఓ పట్టాన తోచదు..మాటలేమో గులాబీ రెక్కలవుతున్నాయి. ఉన్నట్టుండి చెవికింద సుతిమెత్తగ తాకీ తాకకుండానే ఊసులాడే నెమలీకలవుతున్నాయి. నీ పెదవులేమో కనుపాపల కాననంత పారదర్శకాలుగా మారి గాలితో మమేకమై నా శ్వాసలను ముద్దాడుతున్నాయి. నమ్మడానికి అవకాశమేలేని ఒక పారవశ్యత క్షమార్హం కాలేక సిగ్గుల వానగా పరివర్తితం చెందుతోంది కళ్ళారా చూస్తున్నాను. వీధిమలుపు నాగది కిటికీ తలుపులమీదికి ఏవో అక్షరాస్త్రాలను సంధించిన అనుభూతి మనసుపొరల్లో చిందాడుతోంది.

మూడునాళ్ళ క్రితం.. 

నా కళ్ళల్లోకి సూటిగా చూడకుండా అరకన్నుల్తో చిన్నినవ్వు రువ్వేసి నువ్వటుతిరిగి మాయమైన ఆరోజు మిట్టమధ్యాహ్నం నుండి నాలో జరుగుతున్న యుద్ధానికి మాటలెలా పేర్చడం. స్వరాలెలా కూర్చడం.గుండెల్లో ఇంత ప్రేమచిచ్చు పెట్టిన నీకేమివ్వాలి. 

ఇదుగో వింటున్నావా. నీ కోసమే పుట్టాను. నీకోసం ఏమైనా అయిపోతాను. నువ్వు మాట్లాడుతుంటే స్వచ్ఛమైన ప్రేమనదిలో దాహం తీర్చుకుంటున్నట్లుగా ఉంటుందంతే. నువు నమ్ముతావో లేదో అనను. నా అనుభూతిని మాటల్లో పెట్టడం మాత్రం నావల్ల కావట్లేదు. ప్రణయగీతమై మనసుండటానికి ఓ కవే కానవసరం లేదుగా. ఏ పాటనో గుర్తుచేసుకోవాల్సిన అగత్యమూ లేదుగా.. 

ఓ గాలీ..కాస్త ఆగాలి..నువ్విటుగా దయచేసి రావాలి.నన్నల్లేసుకు ఉక్కిరిబిక్కిరి చేసేయాలిక.


Rate this content
Log in

Similar telugu story from Romance