Ambica Lakshmi

Romance Action Classics

3.5  

Ambica Lakshmi

Romance Action Classics

ఒక్క ముద్దు

ఒక్క ముద్దు

1 min
584


ఆ రోజు రాత్రి ఎదో మిటింగ్ ఉంది ఇంటికి రాను అని కాల్ చేసి చెప్పారు ప్రణయ్

ఎప్పుడూ భర్త లేకుండా ఒంటరిగా ఉండడం అలవాటు లేదు శ్యామలకి , అలాంటిది భర్త రాత్రికి రాను అని అనడంతో ఆమెలో కాస్త భయం అయితే మొదలు అయింది... ఏం అంటుంది రమ్మని చెప్పలేదు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి రమ్మని అడగడం తప్పు చాలా పనులు ఉంటాయి ఇబ్బంది పెట్టకూడదు అని తనకు తను దైర్యం చెప్పుకుంటూ అక్కడే లైట్స్ ఆన్ చేసుకొని కూర్చుంది

సరే ఇంకా నిద్ర రావడం లేదు కదా అని టీవీ ఆన్ చేసుకొని చూస్తుంది టీవీ ఒక దెయ్యం సినిమా వస్తుంది భయం ఎంటి లే అన్నట్టు అలానే చూస్తుంది అంతే ఈలోగా కరెంట్ పోయింది

ప్రాణం పోయినంత పని అయింది

కవ్వొత్తి కోసం అంతా వేతుకుంతుంది కానీ ఈలోగా ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది

ఈ టైం లో ఎవరు ? ఆయన రాను అన్నారు కదా పక్కింటి సుజాత గారు అనుకుంట వెళ్ళి చూద్దాం అని తలుపు దగ్గరకి వెళ్తుంది తలుపుని ఇంకా గట్టిగా కొడుతున్నారు

అంత గట్టిగా కొట్టడంతో భయం వేసింది

ఎవరు ఎవరు అని పిలిచింది

తను పిలవడంతో తలుపుని ఇంకా గట్టిగా కొడుతున్నారు

గుటకలు మింగుతూ కళ్ళు మూసుకొని తలుపు తెరవడానికి వెళ్ళింది

తలుపు తెరవగానే ఒక వ్యక్తి ఆమె నుదుట మీద ముద్దు పెట్టారు

ఆ ముద్దులోని స్పర్శ ఆమెకు అర్థం అయి అతన్ని కౌగిలించుకొని ఎంటి రాను అన్నారు అని నవ్వుతుంది

" రాత్రి సమయంలో నిన్ను ఒక్కదాన్నే వదిలేస్తానా చెప్పు " అంటూ బయట ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసాడు

నిన్ను అల్లరి పట్టిదాం అని ఇలా చేశాను అంతే అని తన భుజం మీద చెయ్యి వేసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు



Rate this content
Log in

Similar telugu story from Romance