ఒక రచయితగా..
ఒక రచయితగా..
బుక్కులు వ్రాస్తున్నావట.. కొన్ని సార్లు ఆశ్చర్యం, కొన్ని సార్లు వెటకారం ధ్వనిస్తుంది. నేను నవ్వేస్తాను. ఫోన్లో అయినా. ఎదురుగా ఉన్నా.
బుక్కులు కాదు. ఒకటే. వ్రాసింది ఈ మధ్యే సెల్ఫ్ పబ్లిష్ చేశాను అని చెప్తాను.
లక్ష్యం ఏంటి అంటే చెప్పలేను. ఇంకా వ్రాయాలి. జీవితాన్ని మరింత చూడాలి. అలా చూసే కొద్దీ నాకు వ్రాయడం మీద ఆసక్తి కలుగుతుంది అనుకుంటున్నాను.
ప్రతి రచయితకూ ఒకే విధమైన పాపులారిటీ రాదు. కానీ కొంత మంది రచయితల కథలు చదివితే అది మనల్ని కొన్నేళ్ల వరకూ వెంటాడతాయి. మనం ఏ పనిలో ఉన్నా ఆ రచనల్లోని పాత్రలు వెతుక్కుంటూ వచ్చి పలకరించినట్లు ఉంటాయి.
అలాంటి కథల్ని చెప్పగలగాలి. మన మనసుల్లో ఎక్కడో మానింది అనుకున్న గాయం మళ్లీ ఎలా ఇబ్బంది పెడుతుందో, అసలు ఆ గాయాలు కాలం మాన్పుతుంది అనే నమ్మకంతో సగటు మనిషి ఎలా ప్రయాణం చేస్తాడో కూడా వ్రాయాలని ఉంది.
పాఠకుల హృదయాల్లో పదిలంగా ఉండే పాత్రలు సృష్టించాలి. అవి కేవలం హీరో హీరోయిన్ల పాత్రలు కాదు. వాళ్ళను వాళ్ళు చూసుకునే విధంగా వ్రాయాలి.
ఏ భావంతో వ్రాసినా సకారాత్మకత వైపు తీసుకుని వెళ్ళే కవిత్వం వ్రాయాలి.
వ్రాసి ఊరుకోకుండా వాటిని పుస్తకాలుగా తీసుకువచ్చి ప్రేక్షకులకు దగ్గర చేయాలి.
Ofcourse, పాపులారిటీ వద్దని ఎవరంటారు! అది కూడా మీలాంటి పాఠకులు ఆదరిస్తామంటే.. ఇస్తారుగా.. అంటే ఆదరిస్తారుగా..
