ఒక నిరుద్యోగి కొడుకు కదా!
ఒక నిరుద్యోగి కొడుకు కదా!


శివ అనే వ్యక్తి టౌన్ లో రోజువారి శ్రామికుడుగా పని చేస్తున్నాడు.అతనితో పాటు వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు,వాళ్ళ కొడుకు బిటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు మరియు వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే మరణించారు అందుకే వాళ్ళ నాన్న గారే అతన్ని పెంచిపోషించి పెద్దవారు చేశారు.కొన్నాళ్ళకి శివ వాళ్ళ కొడుక్కి ఉద్యోగం రావాలంటే పది లక్షలు కట్టాలి అని వాళ్ళ నాన్న గారితో అన్నాడు.అంత డబ్బు నా దగ్గర లేదు రా అని శివ అన్నాడు నా కోసం ఇంత డబ్బు కూడా ఖర్చు పెట్టలేవా నాన్న అయితే నువ్వు ఎందుకు నా భవిష్యత్తు గురించిఆలోచించావా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉద్యోగం రావాలంటే ఎలా వస్తుందిి అలాంటప్పుడు నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ బిగ్గరగా అరిచి కుంటూ బయటకు వెళ్లిపోయాడుు. 10 లక్షలు నా కొడుక్కి ఇవ్వాలంటే నేను మరణించాలని అని లారీ కింద పడి మరణిస్తాడుు,శివ వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ నాన్నగారు మరణించి ఉన్నారు.నా వల్లనే మా నాన్న చచ్చిపోయాడు అనుకుంటూ కుమిలిపోయాడు,మా నాన్న ఆత్మ శాంతించాలని అంటే ఎల్ఐసీలో వచ్చిన డబ్బంతా ట్రస్టుకు అప్పజెప్పి నా సొంతం గా ఉద్యోగం సంపాదించు కోవాలి అనుకున్నాడు.అలా అనుకున్నట్టు ఉద్యోగాన్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సంపాదించాడు,ఉద్యోగంలో వచ్చిన డబ్బుతోవాళ్ళ నాన్న పేరు మీద అందరికీ సహాయం చేస్తున్నాడు. నేను చేసిన తప్పుకు గుర్తుకొచ్చినప్పుడల్లా కుమిలి పోతున్నాను నేను చేసే తప్పు ఎవరు చేయకూడదని ఈ డైరీ ని ఇక్కడితో ముగించాడు.