ప్లాస్టిక్ చేసిన అపాయం
ప్లాస్టిక్ చేసిన అపాయం
శివపురం గ్రామ ప్రజలందరూ ఎక్కువ శాతం ప్లాస్టిక్ వస్తువులు వాడేవారు మరియు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు. దానివల్ల ఆ ఊరిలో ఉన్న చెరువులు,నదులు మరియు పంట పొలాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువులు దొరికాయి.ఆ ఊర్లో ఉన్న చెరువులు మరియు భూముల్లో ఉన్న నీరు రోజు రోజుకి ప్లాస్టిక్ వల్ల అడుగంటి పోయాయి దానితో ఆ ఊర్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పోయాయి.
ఆ ఊర్లో ఉన్న పంట పొలాల్లో కూడా ప్లాస్టిక్ ఉండడం వల్ల పంటలు పండే కాదు దాని వల్ల ఆ ఊరి ప్రజలకు తినడానికి తిండి కూడాదు దానితో ఆ ఊరి ప్రజలందరూ ఒకరి తర్వాత ఒకరు ఊరు వదిలి వెళ్ళిపోయారు అలా ఊర్లో ఉన్న ప్రజలందరూ ఆ ఊరిని వదిలి వెళ్లారు.ఆ ఊర్లో ఉన్న ఒక పత్రిక వాడు తన ఊరికి జరిగిన దారుణమైన సంఘటన పత్రిక లో ప్రచురించింది.ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 50 ప్లాస్టిక్ తయారుచేసే కంపెనీలను బంద్ చేసింది.