ఒక మంచి సలహా
ఒక మంచి సలహా
ఏమైంది మోక్షా! అటూ ఇటూ పొర్లుతూ ఉంటే అడిగాడు శ్రీకర్.
నిద్ర పట్టట్లేదు అన్నాను.
షిఫ్టులో వర్క్ ఎక్కువ ఉందా అన్నాడు శ్రీకర్. లేదు.నాకు ఈ ఫీల్డ్ జాబ్ నచ్చట్లేదు అన్నాను.
అసలు మేటర్ ఏంటి అన్నాడు ఇటు వైపు ఒత్తిగిలి పడుకుని బెడ్ షీట్ లాక్కుంటూ. అతను నా సీనియర్.
ఒక మారుమూల ప్రాంతంలో నడిచే పవన విద్యుత్ ప్రాజెక్టులో మేము పని చేస్తున్నాము. ఒక్కో రూం లో ఇద్దరు ఉండేట్లు కంపెనీ గెస్ట్ హౌస్ ఇచ్చింది. ఒక టీవీ, ఏసీ, రెండు మంచాలు, అటాచ్డ్ బాత్రూం. అన్ని వసతులూ ఉన్నాయి. కానీ..
ఇంటికి దూరం అనా? అన్నాడు.
అదొక్కటే కాదు. ఎన్నాళ్లీ ఫీల్డ్ జాబ్ అనిపిస్తోంది. ఈ జాబ్ తో నేను లక్ష రూపాయల జీతం చూస్తానా. సిటీ లైఫ్ స్టైల్ దొరుకుతుందా. ఇవన్నీ నా ఆలోచనలు. సాఫ్ట్ వేర్ జాబ్ ట్రై చెయ్యకుండా ఫ్రెషర్ గా ఉండీ ఇటు వచ్చేశాను అని అనిపిస్తోంది అన్నాను.
శ్రీకర్ దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు. చూడు మోక్షా! నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను. ఈ ఫీల్డ్ జాబ్స్ ఎక్కువ శాతం ఇలాంటి రిమోట్ ప్రాంతాల్లో ఉంటాయి. శాలరీ సాఫ్టు వేర్ లో ఉన్నంత రావడం కష్టమే. చాలా experience ఉంటే తప్ప అంత శాలరీ ఇవ్వరు. సిటీ లైఫ్ స్టైల్ అనేది మరచిపోవాలి.
సాఫ్టు వేర్ జాబ్ మాత్రమే గొప్పది అని నేను చెప్పను. హార్డ్ వేర్, ఫీల్డ్ జాబ్స్ ఇవి తక్కువని నేను అనలేను. నేనూ ఇదే ఉద్యోగం చేస్తున్నాను కదా. ఎందులో ఉండే సాధక బాధకాలు అందులో ఉంటాయి. నువ్వు నీ లైఫ్ నుంచి ఏం కావాలనుకుంటున్నావు, ఎలా ఉండాలని అనుకుంటున్నావు అనే దాని మీదే వాటిల్లో డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పాడు.
సర్లే ఇక నిద్రపో అని తనూ పడుకున్నాడు.
ఆ తరువాత నేను ఆ జాబ్ మానేసి, ఆరు నెలల తరువాత మంచి శాలరీతో సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడం, రెండేళ్లలో ఫారిన్ ట్రిప్ వెళ్లి రావడం కూడా జరిగాయి.
ఇప్పటికీ శ్రీకర్ తో కాంటాక్ట్ లో ఉంటాను నేను. మనం మనది కాని ఒక ప్లేస్ లో , అయోమయంలో ఉన్నప్పుడు మనకు దొరికే ఒక మంచి సలహా జీవితాన్ని మార్చేస్తుంది.
అలా శ్రీకర్ నాకు ఒక మెంటార్ లా గైడ్ చేశాడు అనిపిస్తుంది. అతను చేసిన సాయం ఎప్పటికీ మరచిపోలేనిది.
