Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

స్ఫూర్తి కందివనం

Drama Romance

4  

స్ఫూర్తి కందివనం

Drama Romance

ఒక మజ్ను కోసం

ఒక మజ్ను కోసం

4 mins
22.7K


తెల్లవారుజామున ఐదున్నర అవుతుంది... వినీ కి నిద్రపట్టడంలేదు... లేచి టెర్రెస్ పైకి వెళ్ళింది. తను ఎప్పుడూ కూర్చునే ప్లేస్ లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది వినీ. చేతిలో ఉన్న తన మొబైల్ ని చూసి తన పక్కనే ఉన్న ఎర్ర గులాబి మొక్కని చూసింది. ఒక్కసారిగా తన జ్ఞాపకాలన్నీ తన చుట్టూ గిర్రున తిరిగాయి. తన గుండెలోంచీ వస్తున్న దుఃఖం కన్నీటిలా మారి అప్పుడే విచ్చుకున్న ఎర్ర గులాబీ రెక్కల పై పడింది.


ఆకాశం ఎర్రబడింది.....సూర్యుడు ఉదయిస్తున్నాడు.....కాని వినీ కి మాత్రం తన జీవితం ఇంకా చీకటిగానే ఉంది.


"వినీ.... ఎక్కడున్నావ్...."


ఆ పిలుపు వినగానే ఉలికిపాటుగా వెంటనే తన కన్నీళ్లని తుడుచుకుని నార్మలయింది వినీ.


"హ్మ్.... ఇక్కడున్నావా.....! నీకోసం ఇల్లంతా వెతికాను..." అంది పార్వతి.


వినీ చప్పున వెనక్కి తిరిగి, "నీకు తెలుసుకదమ్మా అప్పుడప్పుడు ఎర్లీమార్నింగ్ టెర్రెస్ పై ఇలా ఈ పూలమొక్కల మధ్య కూర్చుని నేచర్ తో గడపడం నాకు ఇష్టమని...", అని చెప్పింది.


అలా చెప్పిందే కానీ అసలు కారణం తన మనసులో ఉన్న బాధను ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేక ఇలా వంటరిగా కూర్చుంటుంది.


పార్వతి ఒక నిట్టూర్పు వదిలి, "ఏంటో నీ లోకం.... సరేగాని... స్టవ్ మీద చారు పెట్టాను..ఓ పది నిమిషాలు మరిగాక దించి పోపు వేసేయ్.... నాకు టైం అవుతుంది... పనిమనిషి కూడా ఇంకా రాలేదు..ఇల్లు క్లీన్ చేసి రెడి అవ్వాలి...." అంది.


"నువ్వు వెళ్లి రెడి అవ్వమ్మా...నేను క్లీన్ చేస్తాలే..." అంది వినీ.


"సరే పదా...." అని పార్వతి, వినీ కిందకి వెళ్తున్నారు...


వినీ మెట్లు దిగుతూ..."అమ్మా... నాన్న లేచారా", అని అడిగింది.


"మీ నాన్న సంగతి తెలిసిందేకదా....ఆయన ఇంత త్వరగా ఎప్పుడు లేవాలి... రాత్రుళ్ళు లేటుగా రావడం..పొద్దున తొమ్మిదైతే కానీ తెల్లారదు ఆయనకు...." అంటూ గబగబా కబోర్డులో తన బట్టలు తీసుకొని స్నానానికి వెళుతూ...."అన్నట్టు మరచిపోయా... వంటింట్లో నీకు కాఫీ కలిపి ఉంచాను... చల్లారకముందే తొందరగా ఫ్రెషయి తాగేసేయ్" అని చెప్పి వెళ్ళింది పార్వతి.


సరే అన్నట్టుగా తల ఊపి బ్రష్ చేసుకోడానికి వెళ్ళింది వినీ. బ్రష్ చేసుకుంటూ మళ్ళీ ఏవో ఆలోచనల్లోకి వెళ్ళింది.


సడన్ గా అమ్మ చెప్పిన పని గుర్తొచ్చి ఫాస్ట్ గా బ్రష్ చేసుకొని వంటింట్లోకి వెళ్ళింది. మరిగిన చారు దించేసి పోపు వేసి, కాఫీ కప్పు తీసుకుని అక్కడే ఉన్న డైనింగ్ చైర్ లో కూర్చుంది. కప్పు డైనింగ్ టేబుల్ పై పెట్టి శూన్యంలోకి చూస్తూ మళ్ళీ తన ఆలోచనల్లో మునిగితేలుతూ ఉంది.


సడన్ గా తన ఫోన్ మోగడం తో ఉలిక్కిపడి లేచి ఆతృతగా షెల్ఫ్ లో ఉన్న తన మొబైల్ తీసుకుంది. కానీ అది తను ఎదురుచూస్తున్న కాల్ కాకుండా తన ఫ్రెండ్ కావ్యది అని తెలుసుకుని నిరుత్సాహపడింది.


కాల్ రిసీవ్ చేసుకుని, "హలో..." అంది వినీ డల్ గా.


అవతలనుంచి, "హలో...నన్ను కావ్య అంటారండి...కర్మకాలి మీ బెస్ట్ ఫ్రెండ్నయ్యానండీ..." అంది కావ్య చిరుకోపంగా.


కావ్య, వినీ కాలేజీ నుండి బెస్ట్ ఫ్రెండ్స్. వినీ తనకి సంబంధించిన ఏ విషయమైనా సరే షేర్ చేసుకునే ఒకే ఒక వ్యక్తి కావ్య.


"అబ్బా.... ఏంటే... పొదునపోదున్నే మొదలు పెట్టావు..." అంది వినీ కాస్త విసుగ్గా.


"లేకపోతే ఏంటి మరి....ఇవ్వాళ నా బర్త్డే... ఈ ఇయర్ కూడా మర్చిపోయావ్..." అంది కావ్య డిస్సప్పాయింటెడ్ గా.


"ఓహ్... వెరీ సోరి కావ్య... హ్యాపీ బీర్త్డే...", గిల్టీగా చెప్పింది వినీ.


"నాకిది కొత్తేమి కాదుగా....అలవాటైంది లీవ్ ఇట్.... లంచ్ పార్టీ ఇస్తున్న షార్ప్ 1:30 కి మా ఇంటి దగ్గరున్న రెస్టారెంట్ అదే మన ప్లేస్ కి వచ్చేయి. మన గ్యాంగ్ ని కూడా ఇన్వైట్ చేస్తున్న...అందరం గెట్ టుగెదర్ అయినట్టుంటుందని ప్లాన్ చేశా"


"ఒకే... ష్యుర్... వస్తా కావ్య.."


"సరే బాయ్ వినీ .... మిగతా వాళ్ళకి కూడా కాల్ చేయాలి"


"బాయ్ కావ్య..." అంటూ వినీ ఫోన్ పెట్టేసి, టేబుల్ పై ఉన్న కాఫీ తాగబోతు మూడ్ లేక పక్కన పెట్టేసింది.


ఇంతలో..."వినీ...! నేను వెళ్ళొస్తా...! మీ నాన్న లేస్తే టీ చేసి పెట్టాను వేడి చేసివ్వు..." అంటూ పార్వతి హడావిడి గా తన హ్యాండ్ బ్యాగ్ ని భుజానికి తగిలించుకుని వెళ్తుంటే...


"అమ్మా... టిఫిన్ చేయవా...!", అంది వినీ.


"బాక్స్ లో పెట్టుకున్నాలే టైం లేదు..బస్ మిస్ అవుతుంది..వెళ్ళాక తింటాలే...బాయ్", అని చెప్పి వెళ్ళింది పార్వతి.


పార్వతి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. వృత్తి పట్ల గౌరవం శ్రద్ధ ఎక్కువ. అలాగని కుటుంబాన్ని ఎప్పుడు నెగ్లేక్ట్ చేయదు, రెండు బాలన్స్ చేస్తుంది.


పార్వతి వెళ్ళాక వినీ ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయింది.


"వినీ...మీ అమ్మ వెళ్లిందా..." , అని అడిగాడు రఘు నిద్రలేచి.


"వెళ్ళింది నాన్న..."


"టిఫిన్ చేసిందా..."


"లేదు నాన్న....టైం లేదు వెళ్ళాక తింటానంది..."


"మీ అమ్మకి ఎప్పుడూ హడావిడే. సరే నాకు పది గంటలకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను కూడా రెడి అవుతా...రిషి కాల్ చేశాడా...?"


"చేయలేదు నాన్న ...వాడికి ఎగ్జామ్స్ కదా నిన్న నైటవుట్ చేసుంటాడు నిద్ర లేసుండడు...సాయంత్రం చేస్తాడేమోలే...", అని చెప్పి తండ్రి కోసం చల్లారిపోయిన టీ ని మళ్ళీ వేడి చేసివ్వడానికి వంటింట్లోకి వెళ్ళింది వినీ.

రిషి వినీకి తమ్ముడు. హైదరాబాద్ లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు.


రఘు ఫ్రెషయ్యాక వినీ ఇచ్చిన టీ తాగి, టిఫిన్ తిని ఆఫీస్ కి రెడి అయ్యాడు కానీ తన పాత స్కూటీర్ ని ఇంటి బయటికి తీసుకెళ్లాలంటే ప్రతిరోజు ఇంకొకరి సాయం కావాల్సిందే.


"వినీ..బండి బయటికి పెట్టాలిగా కొంచం సాయంపట్టమ్మా...", గుమ్మంలోంచి కేకేసాడు రఘు.


వినీ పరుగున వచ్చి, "ఎందుకు నాన్న...ఈ డొక్కు స్కూటర్ తో ఇన్ని తంటాలు...కొత్తది కొనుక్కోవచుకదా...", అంది చిరుకోపంగా.


స్కూటర్ సీటుని మమకారంగా తడుముతూ "ఇది మా పెళ్ళైన కొత్తలో కొన్నది...సెంటిమెంట్...అందుకే దీన్ని మార్చలేను...", అన్నాడు రఘు.


వినీ చిన్నగా నవ్వి, "ఆ...నాన్నా... ఇవ్వాళ్ళ కావ్య బర్త్డే ...లంచ్ కి ఇన్వైట్ చేసింది...నేను వెళ్తున్న... కీస్ పక్కన పిన్ని వాలింట్లో ఇచ్చేసి వెళ్తా...", అని చెప్పింది.


రఘు స్కూటర్ కిక్ కొడుతూ, "సరే..తొందరగా వచ్చేయి..." అని చెప్పి ఆఫీస్ దారి పట్టాడు.


******


వినీ రెడీ అయ్యి కావ్య వాలింటికి వెళ్ళింది. అక్కడినుంచి వాళ్లిద్దరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్లారు. వాళ్ళ గ్యాంగ్ రాజీ, సిరి, గీత, సుప్రియా, రాధా కూడా అక్కడికి చేరుకొన్నారు. అందరూ వాళ్ళ కాలేజ్ మేమోరీస్ గుర్తుచేసుకుని ఒకటే ఇక ఇకలు పక పకలు.


మాటల మధ్యలో వినీ అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి, "ఎస్క్యూస్ మీ...!", అని చెప్పి లేచి అక్కడినుంచి వడివడిగా ముందుకు నడిచింది.


అలా ఉన్నట్టుండి లేచి వెళుతున్న వినీ వైపు బృకుటి ముడిచి చూస్తూ, "మళ్లీ ఏమైంది దీనికి...ఎక్కడికెళ్తుంది...", అని కావ్య తన మనసులో అనుకుని, మిగతా వాళ్ళ వైపు చూసి, "ఇప్పుడే వస్తా...మీరు క్యారీ ఆన్..." అంటూ వినీ ని అనుసరిస్తూ నడిచింది.


ఆ వ్యక్తి ఎక్సిట్ వైపు వెళ్లడంతో వినీ కూడా అటే వెళుతుంటే, "వినీ ఎక్కడికెళ్తున్నావు...?" అని ఆపింది కావ్య.


ముఖంలో గందరగోళాన్ని నింపుకుని, "తను....తను...నేను తనని చూసాను...", అంటూ వేగంగా రెస్టారెంట్ బయటికి నడిచింది వినీ.


ఆ వ్యక్తి బైక్ పై వెళ్లిపోగా వినీ వెనకాలే పరిగెత్తింది.


అది చూసిన కావ్య విస్తుపోయి, "ఆగు వినీ..." అంటూ తన వేనకాలే వెళ్ళింది.


అలా కొద్ది దూరం వెళ్ళాక వినీ సడన్ గా ఆగి ధీర్ఘంగా శ్వాస తోసుకుని బాధగా నిట్టూర్చింది.


"వినీ...ఏమైంది... ఎందుకలా పరిగెత్తావు...?", ఆతృతగా అడిగింది కావ్య.


వినీ ఉద్వేగంగా కావ్య ముఖంలోకి చూసి, "నేను తనని చూసాను...!", అంది.


కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, "వాట్!!!... డోంట్ బీ సో స్టుపిడ్ వినీ. అది ఇంపోసిబిల్ అని నీక్కూడా తెలుసు. తెలిసి ఎందుకిలా.... ఎనఫ్...! ఇంకెన్నాళ్లు ఇలా ఉంటావ్? అనవసరంగా నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావ్... చాలు ఇంక... అసలు నిన్ను వదిలేసి వెళ్లిన వాడి గురించి నువ్వెందుకింతలా ఎదురుచూస్తున్నావో అర్థంకావట్లేదు. మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నావ్ తన కోసం...నిజంగా నువ్వు కావాలి అనుకుంటే నీకోసం ఎప్పుడో వచ్చేవాడు. మూడు రోజుల్లో కాంటాక్ట్ చేస్తానన్నవాడు మూడేళ్లయినా అడ్రస్ లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని లైఫ్ లో ముందుకెళ్లు...మర్చిపో గతాన్ని...మర్చిపో అతన్ని...", అంది కాస్త అవేశంగా.


వినీ కి కన్నీళ్లు ఆగలేదు.


"అంత ఈజీ గా మర్చిపోలేను కావ్య...నేను చాలా దగ్గరైపోయాను తనకి..." అంటూ కావ్య ని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసింది వినీ.


"వినీ..కంట్రోల్ యువర్ సెల్ఫ్, ముందు ఇక్కడినుండి పదా... అందరూ మననే చూస్తున్నారు..." అంది కావ్య స్నేహితురాలిని ఓదారుస్తూ.


ఇద్దరూ రెస్టారెంట్ వైపుగా నడుస్తుండగా...


"కావ్య...ఐ యామ్ వెరీ సారి.... బట్ నా వల్ల కావట్లేదు... నా మూడ్ ఎమ్ బాగోలేదు...నేను ఇంటికి వెళ్లిపోతా ప్లీజ్ బాయ్...", అని చెప్పి అటుగా వెళుతున్న ఖాళీ ఆటోని ఆపి, అందులో ఎక్కేసి అక్కడినుండి వెళ్లిపోయింది వినీ.


(ఇంకా వుంది....)Rate this content
Log in

More telugu story from స్ఫూర్తి కందివనం

Similar telugu story from Drama