స్ఫూర్తి కందివనం

Drama Romance

4  

స్ఫూర్తి కందివనం

Drama Romance

ఒక మజ్ను కోసం-3

ఒక మజ్ను కోసం-3

4 mins
23.6K


సాయంత్రం ఆరు గంటలకు పార్వతి స్కూలు నుంచి తిరిగి ఇంటికి చేరుకుంది. వినీ చేసిచ్చిన వేడి వేడి కాఫీ తాగి ఫ్రెషయి పూజ చేసి లివింగ్ రూమ్ లో రిలాక్స్డ్ గా న్యూస్ పేపర్ చదువుతుంది. వినీ కూడా అక్కడే సోఫాలో కూర్చుని మొబైల్ లో మెయిల్ చెక్ చేసుకుంటుంది.


పార్వతి పేపర్ చదవడం ఆపి, "వినీ..నాన్న ఎపుడొస్తానన్నారు...ఏమైనా చెప్పారా..", అని అడిగింది.


వినీ తల్లి వైపు చూడకుండా మెయిల్ చూస్తూనే "మధ్యాహ్నం వచ్చారమ్మా...మళ్ళీ సాయంత్రం వర్క్ ఉందని వెళ్లారు...లేట్ అవుతుంది డిన్నర్ కి నా కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పి వెళ్లారమ్మా..." అని చెప్పింది.


"మరి ఆడిగేదాక చెప్పవేం..", చిరుకోపంగా అంది పార్వతి.


వినీ చప్పున పార్వతి వైపు చూసి "అదీ...మరచిపోయానమ్మా సోరి..." అని చెప్పి మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంది.


పార్వతి కాసేపు న్యూస్ పేపర్ చదివాక డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. వినీ కూడా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి వెళ్ళింది. ఇద్దరూ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేశారు. వినీ, పార్వతి తెచ్చిన కూరగాయలు ఫ్రిడ్జ్ లో సర్దింది. తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తుండగా పార్వతి సెల్ కి కాల్ వచ్చింది.


"హలో రిషి ఎలా ఉన్నావ్ రా...?" అంది పార్వతి కాల్ రిసీవ్ చేసుకొని.


"బాగున్నానమ్మ... మీరందరూ ఎలా ఉన్నారు..?"


"మేము బాగానే ఉన్నాము...నువ్వు టైం కి తింటున్నావా..ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావ్...?"


"ఆ...తింటున్నా ఎగ్జామ్స్ కూడా బాగానే రాస్తున్న..."


"ఏం తింటున్నావో ఏమో ఎగ్జామ్స్ టెన్షన్ లో పడి.."


"అబ్బా...అమ్మా...నువ్వు స్టార్ట్ చేస్తే ఆపవులేకానీ...నాన్న వచ్చారా ఆఫీస్ నుండి..."


"ఇంకా లేదురా...లేటవుతుందన్నారు..."


"సరే నాన్నని రేపు మర్చిపోకుండా అమౌంట్ వేయమను..ఎల్లుండే లాస్ట్ డేట్ ఫీస్ కట్టడానికి..."


"సరే చెప్తాలే..."


"ఇంతకీ ఆ మంకీ ఎం చేస్తుంది...?"


పార్వతి భోజనం చేస్తుండడంతో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. అందువల్ల వినీకి రిషి అన్న మాటలు వినపడి చిర్రుబుర్రులాడుతూ...


"మంకీ గింకీ అన్నవంటే పళ్ళు రాల్తాయి", అని రిషిని కోప్పడింది.


"మంకీని మంకీ అనే కదా పిలవాలి", అన్నాడు రిషి వ్యంగ్యంగా నవ్వుతూ వినీ ని మరింత ఉడికిస్తూ...


"ఆహా...అయితే మంకీ వాళ్ళ తమ్ముడు కూడా మంకీ నే తెలుసా..."


ఇద్దరూ ఫోనులో అలా పొట్లాడుతుంటే, "అబ్బాబ్బా... ఆపండి...స్టార్ట్ అయిందా మళ్ళీ...కనీసం దూరంగా ఉనపుడైన గొడవ పడకుండా ఉండలేరా..." అంటూ పార్వతి కోపంగా స్పీకర్ ఆఫ్ చేసి రిషితో మాట్లాడి ఫోన్ పెట్టేసింది.


రిషి, వినీ కి నిమిషం కూడా పడదు. ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. అలా గొడవలు పడతారేగాని ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరిలో ఎవరికి ఏమైనా ఇంకొకరు తట్టుకోలేరు.


డిన్నర్ చేయడం అయిపోయాక వినీ తన గదిలోకి వెళ్లి కాసేపు బుక్ చదివి పడుకుంది. పార్వతి రఘు కోసం ఎదురుచూసి ఇంకా రాకపోయేసరికి రఘుకి ఫోను చేయగా తనకి ఇంకొంచం టైం పడుతుందని చెప్పడంతో అప్పటికే బాగా అలసటగా ఉన్న పార్వతి ఇక ఎదురుచూసే ఓపిక లేనట్లుగా వెళ్లి పడుకుంది.


*************


మరుసటి రోజు సాయంత్రం కావ్య, వినీ వాళ్ళింటికి వెళ్ళింది. వెళ్ళగానే పార్వతి ఎదురుపడటంతో


"హై ఆంటీ...", అని చిరునవ్వుతో ఆవిడని పలకరించి, "వినీ ఎక్కడుంది...?", అని అడిగింది.


పార్వతి పలకరింపుగా చిరునవ్వు నవ్వి, "

టెర్రెస్ పై ఉంది...పిలుస్తానుండమ్మా...", అని వెళ్లబోతుంటే..


"ఇట్స్ ఓకే ఆంటీ... నేనే వెళ్తా...", అంది కావ్య.


పార్వతి సరే అన్నట్లుగా తలూపింది.


కావ్య టెర్రెస్ పైకి వెళ్ళగా, మొక్కలకి నీళ్లు పోస్తూ సడెన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య రావడం చూసి షాకయ్యింది వినీ.


"హేయ్ కావ్య....ఏంటీ సడెన్ సర్ప్రైజ్... ఫోన్ కూడా చేయకుండా ఇలా ఊడిపడ్డావు...", అంది ఆతృతగా.


"అదీ... నీతో ఒక విషయం మాట్లాడాలి...అందుకే..."


"ఏంటదీ..."


"మన గ్యాంగ్ అంతా కలిసి వచ్చేవారం బెంగళూర్ కి టూర్ ప్లాన్ చేసాం. నువ్వు కూడా వస్తున్నావ్ అది చెప్పడానికే వచ్చాను..."


అసలైతే కావ్య మిగతవాళ్ళతో టూర్ విషయం మాట్లాడనేలేదు. కానీ అలా చెప్తేనే వినీ ని ఒప్పించడానికి సులువుగా ఉంటుందని అలా చెప్పింది.


"టూర్ ఆ...నాకు ఇంటరెస్ట్ లేదు ...మీరు వెళ్ళండి...", అంది వినీ వెంటనే అయిష్టంగ ఆసక్తి లేనట్లు చూసి.


"నో ఎస్క్యూసెస్...నువ్వు కూడా రావాలి...వస్తున్నావ్ అంతే...అసలు ఈ టూర్ ప్లాన్ చేసిందే నీకోసం...అలా అయినా నీకు కొంచం చేంజ్ ఉంటుందని...", ఖచ్చితంగా చెప్పింది కావ్య.


"కావ్య.....ప్లీస్..."


"చెప్పాను కదా నో ఎస్క్యూసెస్ అని...నువ్వు రాకపోతే మాత్రం నేను ఇదే లాస్ట్ నీతో మాట్లాడడం....తర్వాత నీ ఇష్టం..."


"రాక్షసి..." కావ్యని కోపంగా చూస్తు అంది వినీ.


"ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మనం హయ్యర్ స్టడీస్ లేదా జాబ్ లో జాయిన్ అవుతాం...ఒకరిద్దరి పెళ్ళిళ్ళు సెటిల్ అయ్యాయి...సో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు...హ్యాపీ గా వన్ వీక్ ఎంజాయ్ చేసొద్దాం..." అంది కావ్య బతిమాలనగా ముఖం పెట్టి.


వినీ ఇంక కాదనలేక ఓకే చెప్పింది.


"బట్....అంత దూరం అంటే మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో కావ్య... అదీ అందరం అమ్మాయిలమే... ఎలా ఒప్పుకుంటారు..."


"మై...హు..నా... అది నాకు వదిలేయ్...నేను ఒప్పిస్తా కదా అంకల్, ఆంటీ ని.."


"సరే నీ ఇష్టం.."


"పద మీ నాన్న తో మాట్లాడదాం...ఇంట్లోనే ఉన్నారు కదా..."


కావ్య, వినీ టెర్రెస్ పై నుండి కిందకి వెళ్లి లివింగ్ రూమ్ లో టీవీ లో న్యూస్ చూస్తున్న రఘు దగ్గరికి వెళ్లి కావ్య, "అంకల్ మీతో కొంచం మాట్లాడాలి" అని చెప్పి, వాళ్ళ టూర్ విషయం చెప్పింది.


ఆయన కొన్ని సెకండ్లు ఆలోచించి 

"కానీ అందరూ ఆడపిల్లలే కదమ్మా... అక్కడ ఎక్కడుంటారు....ఉంటే ఏదన్నా హోటల్లో ఉండాలి..మీరొక్కరే ఎలా ఉంటారు" అన్నాడు.


"అసలే రోజులు బాలేవు...మీరొక్కరే వెళ్లడం...ఇప్పుడు ఈ టూర్ అవసరమా కావ్య..." అంది పార్వతి కాస్త కంగారుగా.


"డోంట్ వర్రీ అంకల్..ఆంటీ... మీకు ఆ భయమే అవసరంలేదు. మా మామయ్య వాళ్ళు ఉండేది అక్కడే...సో మేము ఆ వరం అంతా వాళ్ళింట్లోనే ఉంటాము. నేను ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేసాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక అక్కడ ప్లేసెస్ చూడడానికి మాతో పాటు మా మామయ్య ఫ్యామిలీ కూడా వస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి భయం లేదు, వినీ ని సేఫ్ గా తీసుకెళ్లి మళ్ళీ సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది...", అని కావ్య గ్యారెంటీ ఇవ్వడంతో వినీ వాళ్ళ అమ్మ నాన్న మొదట కాస్త సంకోచించినా తర్వాత ఆలోచించి వినీ ని టూర్ కి పంపడానికి ఒప్పుకున్నారు.


ఫైనల్లీ వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకి థాంక్స్ చెప్పి, "ఓకే వినీ నేను ఇక వెళ్తా బాయ్", అని చెప్పి ఇంటికెళ్లింది కావ్య. తర్వాత మిగతా వాళ్ళకి గ్రూప్ కాల్ చేసి టూర్ విషయం చెప్పగా అందరూ ఎక్సైట్ అవుతారు, టూర్ కి వెళ్లడానికి వాళ్ళ అంగీకారాన్ని కూడా తెలిపారు.


************


వారం రోజుల తరువాత....


రాత్రి ఎనిమిది గంటలవుతుంది......వినీ, కావ్య, రాజీ, గీత, సుప్రియ, రాధ, సిరి అందరూ గద్వాల్ రైల్వే స్టేషన్లో బెంగళూరుకి వెళ్లే బెంగళూర్ ఎక్స్ప్రెస్ కోసం వేయిట్ చేస్తున్నారు. అరగంట తరువాత ట్రైన్ స్టేషనుకి చేరుకుంది. అందరూ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ కి బాయ్ చెప్పి ట్రైన్ ఎక్కారు. గద్వాల్ స్టేషన్ లో ఆ ట్రైన్ కేవలం నిమిషమే ఆగుతుండడంతో ట్రైన్ వెంటనే కదిలింది. లగేజెస్ అన్ని సెట్ చేసుకుని అందరూ వాళ్ళ సీట్స్ లో సెటిల్ అయ్యారు. కాసేపు కబుర్లు, జోక్స్ చెప్పుకుని ఇంటి నుంచి తెచ్చుకున్న డిన్నర్ అందరూ షేర్ చేసుకుంటూ తమ కాలేజీ రోజులు గుర్తుచేసుకుంటు భోజనం చేశారు.


మధ్యలో ఒక స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు...దిగేవాళ్ళు దిగుతున్నారు... అందులోంచి ఒక జంట వినీ వాళ్ళ పక్క సీట్స్ లో కూర్చున్నారు. 

ట్రైన్ కదిలింది. 

వాళ్ళని చూస్తుంటే వినీకి తన గతం గుర్తొచ్చి ఒక్కసారిగా మనసంతా అతలాకుతలం అయ్యి అక్కడినుండి లేచి డోర్ దగ్గరకి వెళ్ళి నిల్చుంది. ఉన్నట్టుండి లేచి వెళ్ళిన వినీని గమనించిన కావ్య, వెంటనే తన దగ్గరికి వెళ్లి


"వినీ..ఎందుకలా వచ్చేసావ్...", అని అడిగింది ఆతృతగా.


వినీ ముభావంగా చూసి, 

"ఏం లేదు...కాసేపు ఒంటరిగా ఉండాలనుంది...నువ్వు వేళ్ళు కావ్య నేను కాసేపాగి వస్తాను" అని చెప్పింది.


వినీని అర్థంచేసుకుని, 

"సరే...టేక్ కేర్...బట్...ఎక్కువసేపు ఉండకు తొందరగా వచ్చేయి...", అంది కావ్య.


సరే అన్నట్లుగా తలాడించింది వినీ.కావ్య అక్కడినుండి వెళ్ళి తిరిగి తన సీటులో కూర్చుని మిగతావాళ్ళ కబుర్లలో తనూ దూరింది. 

వినీ బయటికి చూస్తూ డోర్ దగ్గరే నిలబడింది. ట్రైన్ ఎంత వేగంగా ముందుకు కదులుతుంతో బయటి పరిసరాలు కూడా అంతే వేగంగా వెనక్కి వెళుతున్నట్టు.....వినీకి కూడా తన జ్ఞాపకాలు అంతే వేగంగా వెనక్కి వెళ్లాయి...


(ఇంకా ఉంది....)
Rate this content
Log in

Similar telugu story from Drama