స్ఫూర్తి కందివనం

Drama Romance

4  

స్ఫూర్తి కందివనం

Drama Romance

ఒక మజ్ను కోసం-2

ఒక మజ్ను కోసం-2

3 mins
23.4K


వినీ ని అలా చూస్తుంటే కావ్యకి చాలా బాధగా అనిపించింది. ఆటో వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయింది.


*************


వినీ, కావ్య ఎంతసేపటికి రాకపోవడంతో మిగతావాళ్ళంతా కొంచెం కంగారు పడతారు.


"ఏంటీ.... ఇప్పుడే వస్తామని చెప్పి ఇద్దరూ అటే వెళ్లారు....??", అంది గీత కొంచం విసుగ్గా.


గీత కి కాస్త ఆత్రుత ఎక్కువ ఓపిక తక్కువ.


"ఉండండి... కావ్య కి కాల్ చేస్తే తెలుస్తుంది కదా..." అంటూ కావ్యకి కాల్ చేసింది సిరి.


సిరి కాల్ రావడంతో కావ్య వినీ ఆలోచనల్లోంచి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసి "సోరి గర్ల్స్...టూ మినిట్స్....వస్తున్నా..." అని చెప్పి తిరిగి రెస్టారెంట్ వైపు అడుగులు వేసింది.


కావ్య రాగానే "అదేంటే నువ్వొక్కదానివే వచ్చావు....వినీ ఏదీ..??" అడిగింది రాజీ.


కావ్యకి ఎం చెప్పాలో అర్థంకాలేదు. ఎందుకంటే వినీ మేటర్ తనకి తప్ప మిగతావాళ్ళకి తెలీదు.


"ఆ...ఆ... ఊరినుండి వాళ్ళ నానమ్మ, తాతయ్య వచ్చారంట.... ఇంటి కీస్ తన దగ్గరే ఉన్నాయి....సో అంకల్ కాల్ చేసి అర్జెంటుగా ఇంటికెళ్లమన్నారు... అందుకే అలా సుడెన్ గా వెళ్లాల్సొచ్చింది...", తత్తరపాటుగా చెప్పింది కావ్య.


"ఛా... నమ్మమంటావా... అలా అనిపించట్లేదే... సంథింగ్ ఈజ్ రాంగ్...", అంది సిరి అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి.


సిరి కొంచం అనుమానపక్షి టైప్.


కావ్య ఉలిక్కిపడి, "ఎందుకలా అన్నావ్...?", అంది.


"మరి మాక్కూడా చెప్పి వెళ్ళొచ్చుకదా....అంత సీక్రెట్ గా పక్కకెళ్లి నీతో మాత్రమే చెప్పి అటునుండి అటే ఎందుకు వెళ్ళింది..", అంది సిరి.


కావ్య అసహనంగా సిరి వైపు చూసి, "ఒసేయ్...! నీ సీ.ఐ.డి బుద్ధి ఇంకా మారలేదా! ప్రతీదీ అనుమానమే. అక్కడ ఆల్రెడీ వాళ్ళ నానమ్మ, తాతయ్య ఇంటి దగ్గర వెయిటింగ్ అంట, సో హడావిడిగా వెళ్ళిపోయింది. మీ అందరికి సోరి చెప్పమంది ఇంకొరోజు కలుస్తానంది. సో...నువ్వు ఎక్కువగా థింక్ చేయడం ఆపితే ముందు ఏం కావాలో ఆర్డర్ చెయ్యొచ్చు..." అని అనేసరికి అందరూ ఒక్కసారిగా సిరిని చూసి నవ్వారు.


"చాల్లే...ఆపండే ఇంక...." అంటూ ఉడికిపోయింది సిరి.


*************


ఇంటికి చేరుకున్న వినీ డైరెక్టుగా తన రూమ్ కి వెళ్లి కబోర్డు లో ఉన్న తన డైరీని తీసుకుని బెడ్ పై కూర్చుని ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఫోటో చూడగానే తన కళ్ల వెంట వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ....


"ఎందుకిలా చేసావు...? చాలా గుర్తొస్తున్నావ్...ఎటుచూసినా నువ్వే కనిపిస్తున్నావు... ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావు...ఎక్కడికెళ్లినా నీ జ్ఞాపకాలే నన్ను తరుముతున్నాయి...నువ్వొస్తావని మూడేళ్ళుగా నీకోసం ఎదురుచూస్తున్న... ఐ యాం మిస్సింగ్ యూ సో మచ్...ప్లీస్ నాకోసం మళ్ళీ వచ్చేయవా... నాకు నువ్వు కావాలి...", అంటూ తన ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని బోరున ఏడ్చేసింది వినీ.


ఆ డైరీని తన రెండు చేతులతో గట్టిగా హత్తుకుని ఏడుస్తూ కళ్ళుమూసుకుంది. తనకి తెలీకుండానే నిద్రలోకి జారుకుంది.


కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. ఆ సౌండ్ కి ఉలిక్కిపడి లేచి తన చేతిలో ఉన్న డైరీని మళ్ళీ కబోర్డు లో పెట్టి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.


వచ్చింది వినీ వాళ్ళ నాన్న.


రఘు లోపలికి వస్తూ..."లంచ్ పార్టీ ఉందన్నావ్ కదా...", అని అడిగాడు.


"హా... వెళ్ళొచ్చాను నాన్న...", చెప్పింది వినీ.


ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు.


"నాన్న ..లంచ్ చేసారా..?"


"చేసాను. మీటింగ్ అయిపోయాక అక్కడే అరేంజ్ చేశారు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా సాయంత్రం ముఖ్యమైన మీటింగ్ కి వెళ్ళాలి", అని చెప్పి రఘు డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ పై అలా ఒరిగి "ఆ ఫ్యాను కాస్త స్పీడ్ పెంచమ్మ..", అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు.


రఘు అడ్వకేట్, ఎప్పుడూ మీటింగులు, కేసులు అంటూ బిజీగా ఉంటాడు.


వినీ ఫ్యాను స్పీడ్ పెంచి, తిరిగి తన రూంకి వెళ్ళింది. తను వెళ్లేసరికి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది, అది కావ్య కాల్.


వినీ కాల్ రిసీవ్ చేసుకుని, "హా...కావ్య చెప్పు..", అంది.


"వినీ...అర్ యూ ఓకే నౌ...", కంగారుగా అడిగింది కావ్య.


"యా కావ్య...ఆమ్ ఫైన్"


"మనవాళ్లు నీ గురించి అడిగారు. మీ నానమ్మ, తాతయ్య వచ్చారని కవర్ చేసా. ఎప్పుడైనా కలిసినప్పుడు అడిగితే నువ్వూ అదే చెప్పు, లేకపోతే నేను బుక్ అవుతా. అసలే ఆ సిరి...తెలుసుగా దాని సీ.ఐ.డి బ్రెయిన్ తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది..."


కావ్య అలా అనేసరికి వినీ చిన్నగా నవ్వింది. ఇద్దరూ సిరిని గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నారు.


"హమ్మయ్యా నవ్వావా... థాంక్యూ వినీ..." అంది కావ్య రిలాక్స్డ్ గా...


"ఐ యాం వెరీ సోరి కావ్య....బర్త్డే రోజు నిన్ను అప్సెట్ చేసాను...", కొంచం గిల్టీగా అంది వినీ.


"పర్లేదు వినీ ...నేను నీగురించి ఆలోచిస్తున్నా...ప్లీజ్ కం ఔట్ ఆఫ్ ఇట్...ఇంకెన్నిరోజులు ఇలా ఉంటావు...?"


"కావ్య ప్లీస్...అన్నీ తెలిసి నువ్వే ఇలా అంటే..."


"అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నా.... అసలు ఫ్రెండ్షిప్ పేరుతో పరిచయం చేసుకుని రెండ్రోజుల్లో ప్రేమికులుగా మారి, కలిసి తిరిగి, నెల రోజులు తిరక్కుండానే బ్రేకప్ చెప్పేసుకుని ఇంకొకరిని చూసుకునే ఈ రోజుల్లో...నీలాంటి ట్రూ లవర్స్ కూడా ఉన్నారంటే గ్రేట్...ఐ హోప్..దేవుడు నీకు అన్యాయం చేయకుండా ఉండాలని..."


వినీ మౌనంగా ఉండిపోతుంది....


"వినీ...!" పిలిచింది కావ్య తన నుండి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి.


"హ్మ్....", అంది వినీ డల్ గా.


"నేను ఇవన్నీ మాట్లాడి నిన్ను ఇంకా బాధపెట్టాలనుకోవడంలేదు... ఓకే థెన్ టేక్ కేర్...బాయ్ వినీ..."


"బాయ్ కావ్య .."


ఫోన్ పెట్టేసాక కావ్య వినీ గురించే ఆలోచిస్తుండగా తనకి ఒక ఐడియా వచ్చింది.


ఒక నిర్ణయానికి వచ్చినదానిలా కళ్ళు చిన్నవి చేసి చిన్నగా తలూపి, 

"యెస్...అదే కరెక్ట్...రేపే అందరితో డిస్కస్ చేసి ఫైనల్ చేయాలి...అలా అయినా వినీ కొంచెం డైవర్ట్ అవుతుందేమో చూడాలి..." అని తనలోతానే మాట్లాడుకుంది కావ్య.


(ఇంకా వుంది...)Rate this content
Log in

Similar telugu story from Drama