నిన్ను చూసిన క్షణం
నిన్ను చూసిన క్షణం


నిన్ను చూసిన మొదటి క్షణం నాలోని ప్రేమ చిగురించింది..,
నిన్ను తలచిన ప్రతిక్షణం నా లోకమంతా స్వర్గంలా మారిపోయింది ...,
నువ్వు నవ్విన మరుక్షణం సృష్టిలోని అందాలన్నీ నా కళ్ళముందు వాలినట్లుంది..,
నీతో ఉన్న ఆ క్షణం నాకే తెలియకుండా నా మనసు నీ వసమైపోతుంది..,
చిమ్మ చీకటి అమావాస్య సైతం పండు వెన్నెలలా అనిపిస్తుంది ..,
నీతో గడిపిన ప్రతి క్షణము నా మదిలో మెదిలే కోరిక ఒక్కటే.. ,
నా ప్రాణంలో ప్రాణమై నా ఆలోచనలకి రూపమై ఎప్పుడూ నాలోనే నాతోనే ఉండిపోవాలని...
ఉంటావా!! ప్రాణమా...!!