Midhun babu

Romance Inspirational Others

4.3  

Midhun babu

Romance Inspirational Others

నాలుగు గదులే

నాలుగు గదులే

1 min
350


నాలుగు గదులే ఏ గుండెకైనా

గుండె లోతుల్లో సంఘర్షణ మోస్తున్న స్త్రీకైనా...

అతనంటాడు నాలుగదుల్లో అతనే ఉండాలని

ప్రతి గదిలో అస్తిత్వాన్ని కాపాడుకొనే ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ఉండొద్దని...

ఆమె ఎంత నడుస్తున్నా మట్టి అంటదు

ఆమె నడిచేది నేలన కాదు అతని ఆంక్షల్లో


రాసుకునేందుకు డైరీ, పేజీ ఉంది కానీ సమయమే లేదు

పెన్ను ,సిరా కొలిమై వెంటే ఉంటాయి

వాటితో పాటుగా ఎవరికీ తెలియని బానిసత్వం కూడా నడుము కట్టుకొని కదులుతుంటుంది


నాలుగే నాలుగు మాటలు మనసు దాటి

గొంతు దాటి పెదవి దాటి చేయి జారి 

ఏ పుస్తకంలో వాక్యాలుగా మారిన వెంటనే 

కొట్టివేతలు

కొట్టేసిన పేజీలు

చిరిగిపోయిన దాఖలాలు

చింపేసిన వేళ్ళ పిడికిలి ముద్రలు...

ఇది కదా బానిసత్వం అంటే....


నచ్చినట్టు ఉండకూడదు

నచ్చకపోయినా ఉండాల్సిందే

ఎన్ని విరోదాబాసలో జీవితాన


ఆమె ఒళ్ళంతా వేడి సెగలు

అంతా అతని చలువే

అది తాపంతోనా

కోపంతోనా

జ్వరంతోనా

ఎవ్వరికీ తెలియదు...

చెప్పినా 

అబద్దం ఇప్పుడు నాలుక మీద రుచి మొగ్గ

నిజం నాలుకే లేని మూగ బాస...


మాటలు ఎన్నైనా ఉంటాయి

వాటిని వాడిన తీరునే

చెవిన కాకుండా 

మనసుకు తగిలి రాత్రి పగలౌతుంది

నిద్దుర మెలకువని తట్టి లేపుతుంది...

మనుషులం కదా అందునా స్త్రీలం

రాటుతేలినట్టు కనపడతాం

రాయిలా మారినా చెమ్మ మాత్రం తరగదు...



Rate this content
Log in

Similar telugu story from Romance