శ్రీలత "హృదయ స్పందన"

Tragedy Classics

4.3  

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy Classics

🌷నా పయనం ఏ తీరానికో?⛵️

🌷నా పయనం ఏ తీరానికో?⛵️

2 mins
280



  ప్రియమైన నీకు ,


 ఈ రోజు చాలా సుదీర్ఘమైన లేఖ రాయాలి అనుకున్న .

ఎన్నో భావాలు మదిలో . చెప్పలేని అలజడి మనసులో ఒక్కోసారి ఆనందంతో తన్మయత్వం . వెంటనే నిరాశ తో మోయలేని భారం .అవన్నీ ఇప్పుడు నీతో పంచుకోవాలి అని ఇంకోసారి ఇలా ని ముందు నా హృదయ స్పందన వినిపిస్తున్నా .


ముందుగా నేను అనుభవించిన ఆనంద క్షణాలు .

ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా.. నీ కౌగిలిలో.. నీ గుండె చప్పుడు నా హృదయానికి వినిపిస్తుంది.. కళ్ళు మూసుకొని ఆ ఆనందం అనుభవిస్తున్న.. నాలోని ప్రతి అణువు నీ స్పర్శ తాకి పులకరించి పోతుంది.. నా మనసు..ఎదో తెలియని తన్మయత్వాన్ని ఆస్వాదిస్తుంది.


నువ్వు నా ఎదురుగా ఉంటే ఇంత ఆనందం అనుభవిస్తానో లేదో తెలియదు.. ఊహల్లో మాత్రం అంతులేని ఆనందం అనుభవిస్తున్న..ఇలాంటి ఆనంద క్షణాలు ఎన్నో అనుభవించాను నీ ఊహల్లో ..నీ ప్రేమ లో ...


ముందు నాలో ప్రేమ మొదలయింది . ఆ ప్రేమ అంతులేని ఆరాధనగా మారింది . ఇప్పుడు స్వార్థం మొదలైంది . అంతటి తో ఆగకుండా నువు నన్ను మాత్రమే ప్రేమించాలి ..నీ మనసులో నాకు మాత్రమే ప్రత్యేక స్థానం ఉండాలి అనిపిస్తుంది .

  

ఇప్పుడు నన్ను వెంటాడుతున్న భయం ఏంటో తెలుసా 

నువ్వు నన్ను దూరం చేస్తున్నావ్ ఏమో అనిపిస్తుంది ఎందుకో ఈ మధ్య.. ఇంకా...ఎదో భయం కూడా.. 

అది భయం.. ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆ.. ఏమో..

నువ్వు నన్ను కాకుండా ఇంకెవరినైనా ప్రేమిస్తావేమో అని.. ఎంత విచిత్రం అయిన భయం.. అసలు నాకు ఎం హక్కు.. అధికారం ఉన్నాయి.. నీ నుండి ఏదైనా ఎక్సపెక్ట్ చేయటానికి కానీ.. నీకు నచ్చింది చేయకుండా ఆపటానికి కానీ.. 

నిన్ను ఒక మాట అడగాలి అనుకున్న నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించను నీ ప్రేమ నాకు మాత్రమే కావాలి అని ప్రామిస్ చెయ్ అని ఎంత స్వార్థం . నాకు నేనే నచ్చటం లేదు ..


ఒకవేళ నువు నాకు మాట ఇవ్వలేకపొతే అలా ఊహించుకోలేను ఊహ నే ఇంత భయంకరంగా ఉంటే అదే నిజం ఐతే .నా మనసులో సంఘర్షణ మొదలవుతుంది .

నా హృదయ స్పందన లయ తప్పి సునామి సృష్టిస్తుంది 

నీ గుండె గూటికి చేరలేక  ఆశల తీరం దాటి శూన్యంలోకి ప్రయాణం మెదలుఅవుతుంది .


నాకు అబద్దాలు కానీ .నటించడం కానీ తెలియదు ఇష్టం కూడా ఉండదు . బాధ పెట్టినా నిజమే కావాలి నిజాయితీగా ఉండాలి . 

అయినా నీ విషయం లో ఒక అబద్దం చెప్పు అని నేనే అడుగుతున్నా . ఏంటో తెలుసా 

నీకు నా మీద ప్రేమ లేకపోయినా సరే . ఎప్పుడు ఆ విషయం నాకు చెప్పకు . ఆ ఊహనే భరించలేను అదే నిజం అయితే నా హృదయ స్పందన ఆగిపోతుందేమో ?

ఎప్పటికి నన్ను ఇలా నీ ప్రేమ లోకంలో స్వేచ్ఛగా ..అలుపులేకుండా ..నా చివరి శ్వాస వరకు విహరించనివ్వు ...


మనం ప్రేమిస్తే ఏది ఎక్సపెక్ట్ చేయొద్దు అని నా బుద్ది కి తెలుసు మనసే మాట వినటంలేదు.


ఏదైనా సరే నేను ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే నాకు నేనే దూరం అవుతాను..రోజు రోజు కి మాట మౌనం అయిపోతుంది .మనసు భారం అయిపోతుంది 


నీ జ్ఞాపకాలు వెంటాడని సుదీర తీరాలకు పయనం అవ్వాలని కోరుకుంటున్నాను .


ఇట్లు ,


నిరంతరం నీ జ్ఞాపకాలతో 

నిన్ను చేరలేని నేనుగా. 



శ్రీ ...

హృదయ స్పందన ..



Rate this content
Log in

Similar telugu story from Tragedy