శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics


4  

శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics


💗నా చెలి "జాబిలికి"🌷

💗నా చెలి "జాబిలికి"🌷

2 mins 313 2 mins 313


నా చెలి "జాబిలికి",

   ఎప్పుడు నువ్వు నన్ను అడుగుతావు నీ భావాలు చెప్పు అని . అందమైన భావాలను అక్షరాలుగా పోగుచేసి చుక్కలతో జతచేసి నీ మెడలో అలంకరించాలని నాకు ఉంది కాని నేను నీలా భావకవిని కాదు.. అయినా నీ కోసం ఈ చిరు ప్రయత్నం చెలి..

   చల్లని వెన్నెల రాత్రిలో.. నీ జ్ఞాపకాల హాయిలో.. సన్నజాజి పరిమలాలను ఆస్వాదిస్తూ నా చెలి జాబిలికి... వెన్నెలతో సందేశం పంపిస్తున్న.. 

 నువు చెంత లేకపోతే పండువెన్నెల కూడా నిశీధిలా ఉంది.. చందమామ నన్ను చూసి నీ చెలి ఏది అని నవ్వుకుంటుంది..

ఎప్పుడు వస్తావు. నువ్వు వస్తే మళ్ళీ కొత్తగా నీ ప్రేమ లో బాల్యాన్ని ఆస్వాదించాలని ఉంది. పిల్లకాలువలో పడవలు చేసి ఆడుకుందాం.వేప చెట్టుకి ఊయల కట్టి ఊగుదాం..

దాగుడు మూతలు ఆడుకుందాం..తోటలో జామకాయలు కోసుకొని తిందాం..

   రాత్రి జాబిలి వచ్చే సమయానికి మల్లెపందిరి కింద మంచే వేసుకొని కబుర్లు చెప్పుకుందాం.వెన్నెల్లో నీ కళ్ళలోకి చూస్తూ.. ఎరుపెక్కిన నీ బుగ్గలు తాకాలని.సిగ్గుతో నువు ముడుచుకుపోతుంటే నా కౌగిలిలో నిన్ను బందించాలని.. నీ జడలోని సన్నజాజి పరిమళాలు మత్తుగా నన్ను ఏదో లోకంలో విహరింపచేస్తుంటే వణికే నీ ఆధరాలపై నేనొక చిలిపి సంతకం చేయాలని.. ఎన్ని ఊహలు చెలి..

 తొలి కోడి కూతకు నువ్వు నిద్రలేచి.. నేను కళ్లు తెరిచే సమయానికి నా ఎదురుగా కనిపిస్తే నీ నుదుటి సిందూరం లో సూర్యోదయాన్ని చూస్తాను. నువు ఇల్లంతా తిరుగుతున్నప్పుడు నీ అందెలశబ్దం నా గుండెల్లో మధురమైన సంగీతాన్ని నింపుతుంది. ఓరచూపుతో నువు నన్ను చూస్తే నా హృదయం లయ తప్పి నీ నీ నడుంఓంపులో గిల గిల కొట్టుకుంటుంది చెలి..

 ఎన్నని చెప్పను.. ఏమని చెప్పను.. నీకు నాకు మధ్య ఈ వియోగం ఇంకెన్నాళ్లు..

  నువ్వు వస్తే నా హృదయపు కోవెలలో నిన్ను కొలువుంచుతా...నా ప్రేమ సామ్రాజ్యానికి నిన్ను పట్టపు రాణిని చేస్తాను. నా మనసు పుస్తకంలో నిన్నొక కమ్మని కావ్యంగా లిఖించుకుంటాను.. నా ప్రేమ అంత రంగరించి నీ నుదుటి మీద సిందూరం దిద్దుతాను..

 నువ్వు వస్తావని..నీ ప్రేమ కోసం కలలు కనే ఈ స్వప్నికుని కలలు నిజం చేస్తావని...

 నీ కోసం... నీ ప్రేమ కోసం.. ఎదురుచూస్తూ...

ఇట్లు..,

నిరంతరం నిన్నే ధ్యానించే

నీ ప్రియ సఖుడు..

శ్రీ..

హృదయ స్పందన..

 

 

 

   Rate this content
Log in

More telugu story from శ్రీలత "హృదయ స్పందన"

Similar telugu story from Romance