శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

మధ్యతరగతి మగువ

మధ్యతరగతి మగువ

1 min
339


             మధ్య తరగతి మగువ

                -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

         

   అనసూయ మంచి వయసులో ఉంది. పిటపిట లాడే ఒళ్లూ...ఒడ్డూ పొడుగుతో...చక్కటి పసిమి ఛాయలో  వుండే ఆమె నిండైన యవ్వనం చూపరులను కవ్విస్తూ ఉంటుంది. దానికి తోడు...ఆమె ఒత్తైన తలకట్టు... నుదుటిన దిద్దే సింధూరం ఆమెలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ తళుక్కుమంటూ ఉంటుంది.


   అలాంటి అనసూయకు అనుకోని కష్టం ఎదురయ్యింది. 

భర్త తన సాన్నిధ్యంలో వున్నా....ఎన్నో వెన్నెల రాత్రులు అడవి కాచిన వెన్నెలవుతూ....మత్తెక్కించే మల్లెలు కూడా పరిమళించకుండా వాడిపోతున్నాయి. భర్తతో ముచ్చట్లాడకుండానే తన బ్రతుకు తెల్లారిపోతూనే ఉంది.


  అనసూయ వైవాహిక జీవితంలోకి తొంగిచూస్తే....


   మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరాడపిల్లల తర్వాత మూడవ దానిగా పుట్టడం వల్లే ముప్పై ఏళ్లు వచ్చాకా... ముదిరిపోయిన బెండకాయ లాంటి నలభై ఏళ్ల రాజారావుతో పెళ్లి కుదిరింది.


   అయినా...సంతోషంగా పెళ్లిచేసుకుంది. కానీ...ఒక తాగుబోతుకి భార్య అవుతుందని ఊహించనైనా లేదు. ఎప్పటినుంచో తాగుడుకు భానిసైన రాజారావుని తాను భరించక తప్పలేదు. ఆలూమగల మధ్య వుండే సరసానికి మాత్రం తమ మధ్య యే లోటూ రాలేదు. ఒక ఏడాది పాటూ ఆనందంగా పంచుకున్నారు. ఆతర్వాత అలా కలిసి అనుభవిస్తున్న తమ దాంపత్యంలో అనుకోని మలుపు తిరిగింది. విధి అనసూయ బ్రతుకును చిదిమేసింది.


  ఒకరోజు తాగుడు మైకంతో ఇంటికొస్తున్న రాజారావు బండి మీద నుంచి వస్తూ రాళ్ళగుట్ట మీద పడ్డాడు. దానితో వెన్నుముకకు దెబ్బతగిలి కోలుకోలేని స్థితికొచ్చాడు. దాంపత్యానికి పనికిరాని అవిటివాడయ్యాడు. ఆ వేధనతో పాటూ... అనసూయలో విరహవేధన కూడా తోడయ్యింది. ఇది చాలదూ....ఓ మధ్యతరగతి మగువకు ఆవయసులో జరిగిన నష్టం....ఎప్పటికీ భరించాల్సిందే.

   

    అంత జరిగినా...తనను చూసుకోడానికి కట్టుకున్న పెళ్ళాం ఉందనే ధీమాలోనే వుంటాడేమో ప్రతిమగాడు. రాజారావుది తాగుడికి భానిసైన శరీరం. వైద్యుడిచ్చిన మందులు ఏం పనిచేస్తాయి...?  ప్రతిరోజూ తనను మైకంలో ముంచడానికి మందుపోసిన గ్లాసును తనకు అందుబాటులోనే ఉంచమంటాడు. భార్య ఎంత చెప్పినా వినడు. చెవిటోడి చెవిలో శంఖం ఊదితే ఏం లాభం.....? మధ్యమధ్యలో తీర్థంలా పుచ్చుకుంటూనే ఉంటాడు. 


   అనారోగ్యం పాలైన భర్తకు ఆవిధంగా కూడా సపర్యలు చేయడం ఒక్క మధ్య తరగతి భార్యలకే సాధ్యం. భర్తే దైవంగా భావించే సగటు స్త్రీలా...తన పసుపు కుంకుమల్ని నిలుపుకోవాలనే ఆశతో.... మంచానికి పరిమితమైపోయిన భర్త కాళ్లకానుకుని...అతని కళ్ళలోకి ధైన్యంగా చూస్తూ గడుపుతుంటే....విరబూసిన వెన్నెల వెక్కిరిస్తున్నట్టే ఉంటుంది....కోరికను అదిమిపెట్టుకుంటున్న అనసూయను...!!*


            



Rate this content
Log in

Similar telugu story from Tragedy