మౌనరాగం
మౌనరాగం
అమ్మా! నాకు ఈరోజు వకృత్త్వ పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చిందమ్మా! అంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు కావేరి కొడుకు ప్రశాంత్.
ఔనా! చాలా సంతోషంగా ఉంది రా! అని అంటుంటే,ప్రశాంత్ మాత్రం కనీసం అమ్మా!వారం రోజుల నుంచి మంచి టాపిక్ సేకరించి ,నాతో బాగా ప్రాక్టీస్ చేయబట్టే ఈ బహుమతి వచ్చిందమ్మా! థాంక్స్ అమ్మా! అని ఒక మాట కూడా అనలేదే అని మనసులో మౌనంగా బాధ పడింది.
హా!కావేరి! ఈ రోజు అతిముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేశాను.అది బాగా అందరికీ నచ్చింది.నాకు ప్రమోషన్ వచ్చింది.నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా కొలీగ్ రవి వల్లనే అన్నాడు.
ఆరోజు నేను నా నగలు అమ్మి ఆయన చదువుకు సహకరించబట్టే కదా!నేడు ఆయన ఈ స్థాయికి వచ్చాడు.మరి ఈరోజు రవి అంటున్నారే! కనీసం నేను చేసిన పనికి థాంక్స్ అని కూడా చెప్పలేదే అని మౌనంగా మనసులో బాధ పడింది కావేరి.
అత్తయ్యకు వేళకి భోజనం,మందులు ఇస్తూ,ఆమె ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నా కూడా ఎప్పుడూ ఏదో ఒక వంకలు,చీదరింపులు చేస్తూనే వుంటారు.ఆమె ఏది అడిగితే అది చేసి పెడుతోందే అని ఒక్కసారైనా అనరే.పైగా తాను తన కన్నా అత్తగారిని ఎంత బాగా చూసుకుందో చెబుతూ ఉంటుంది.అప్పుడు మనసులో ఈమెను నేను మెప్పించలేకపోతున్నానే మౌనంగా బాధ పడింది మనసులోనే.
తన పెద్ద కొడుకు మంచి ఉద్యోగం రాగానే, ఎన్నో సంబంధాలు వెతికి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తే అమ్మా మంచి అమ్మాయిని భార్య గా తెచ్చావు థాంక్స్ అమ్మా అని ఒక్క మాట కూడా అనలేదే బాధ పడింది మౌనంగా మనసులోనే.
కూతురు కన్నా బాగా చూసుకుంటున్న కోడలు కూడా ఒక్కసారి కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు థాంక్స్ అత్తయ్యా!అని ఒక్కసారి కూడా అనలేదే అని మౌనంగా మనసులోనే బాధపడింది.
డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఆనందంగా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే,ఆ ఆనందం దృశ్యాన్ని చూస్తూ.....
వీరందరూ ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నేను అని వీళ్ళందరి అంతరాత్మకు తెలుసు.ఏదో ఒకనాడు వాళ్ళకే తెలుస్తుందిలే.
నా కుటుంబం ఆనందం గా ఉండటానికి నా ఓర్పు,సహనమే.నా శ్రమ,నా కృషే. కాబట్టి నాకు నేనే కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకోవాలి.
ఏమంటారు మిత్రులూ!ఔనంటారా ! కాదంటారా! నాకు నేనే కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకోవాలి కదండీ.

