STORYMIRROR

jagadish baikadi

Drama Inspirational Others

4  

jagadish baikadi

Drama Inspirational Others

మా నాన్న కులం రైతు కులం

మా నాన్న కులం రైతు కులం

3 mins
372

ఒకరు అడిగారు నాతో ఇలా

మీ నాన్న ఏం చేస్తారు అని?

మరి ఒకరుఅడిగారు నాతో ఇలా

మీ నాన్న ఏం పని చేస్తారు అని?

ఇంకొకరు అడిగారు నాతో ఇలా

మీ నాన్న వృత్తి ఏంటి అని?

ఇంకా ఎవరో ఒకరు అడిగారు నాతో ఇలా

మీ నాన్న ఏ కులానికి చెందినవాడు అని?

అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను ఇలా

మా నాన్న ఒక రైతు...

తను ఆకలి తో ఉంటూ నలుగురి ఆకలిని తీర్చే వాడు మా నాన్న...


కాదు కాదు మా నాన్న ఒక ఒక ఇంజనీర్

తను వ్యవసాయం చేస్తున్నప్పుడు తన వ్యవసాయ భూమిలో తను విత్తనాలు వేసే ముందు తన వ్యవసాయ భూమి ఎంత ఉంది అని కొలుచుకుని దానికి సరిపడా విత్తనాలు వేసే వాడు మ నాన్న కాబట్టి మా నాన్న ఒక ఇంజనీర్.


 అయ్యో అయ్యో ఇంజనీర్ కాదు కాదు మా నాన్న

 మా నాన్న ఒక డాక్టర్ అదేంటి వీడు పిచ్చోడు అనుకుంటున్నారు కదా పర్లేదు లేండి అయినా మా నాన్న ఒక డాక్టర్ అంటాను ఎందుకంటారా చెప్తాను వినండి మా నాన్న వ్యవసాయం చేస్తునపుడు పంటలకు సోకే వ్యాధులకు ఇక డాక్టర్ ల వైద్యం చేసి వ్యవసాయ పంటలను కాపాడుకుంటడు ఒక వైద్యుడిల కాబట్టి మా నాన్న డాక్టర్.

  

కాదు కాదు మా నాన్న ఒక సైనికుడు అదేంటి ఇప్పుడే డాక్టర్ అన్నావు కదా అంటారా అవును మా నాన్న సైనికుడు ఎలా అంటారా అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడం కోసం మా నాన్న మా అందరిని ఇంట్లో వదిలి అర్ధరాత్రి పొలంకు వెళ్ళి ఒక సైనికుడిల పంటను కాపాడి యావత్ మానవాళికి అన్నం పెడుతూ మన ప్రాణాలను కాపాడుతున్నాడు అంటే సైనికుడిల తుపాకీ పట్టకున్న హలంతో పొలని దున్ని పంట పండించింది అందరి ఆకలి తీర్చి అందరి ప్రాణాలు కాపాడుతున్నాడు అంటే మా నాన్న ఒక సైనికుడే కదా....జై జవాన్ జై కిసాన్.


మా నాన్న ఒక రాజు విన్నది నిజమే మా నాన్న ఒక రాజు తన వ్యవసాయ సామ్రాజ్యానికి తను వ్యవసాయం చేస్తూ మా అందరికీ ఏ లోటు లేకుండా ఒక చక్కటి పరిపాలన చేసే రాజు తను ఆకలితో ఉంటు మా అందరి కడుపు నింపే గొప్ప మనసున్న మారాజు మా నాన్న.

తను చేసే వ్యవసాయం తన కడుపు నింపకున్న

తన తోటి ఉన్న నలుగురికి ఆకలి తీర్చడానికి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు మా నాన్న.


కాదు కాదు అంటుంటే ఎన్ని కాదులు బాబు నిజం చెప్పరా బాబు అని అనిపిస్తుంది కదూ మీకు ఒకే చెప్తా మా నాన్న ఒక ఉపాధ్యాయుడు అది ఎలా అంటారా తెలియని విషయం తెలుసుకోవడమే విద్య కదా విద్యను బోధించు వాడు ఉపాధ్యాయుడు కదా అంటే వ్యవసాయం చేయడం నాకు తెలియదు నాకు తెలియదు వ్యవసాయం గురించి నాకు నేర్పుతూ మా నాన్న నాకు ఒక ఉపాధ్యాయుడిగా మారాడు.


అయ్యో అయ్యో కాదు కాదు మా నాన్న డ్రైవర్ ఎందుకంటారా నాన్న పండించిన పంటను అమ్మడానికి వ్యవసాయ మార్కెట్ కి పండించిన పంటను ఒక ఎడ్లబండిలో తీసుకు వెళ్తాడు అంటే ఏ వాహనం నడిపిన వారు డ్రైవర్ లే కదా కాబట్టి మా నాన్న ఒక డ్రైవర్. 


కోపం వస్తుంది కదూ నేను సరైన సమాధానం చెప్పడం లేదని సరే సరే మా నాన్న ఒక్క జూదగాడు అవును మన అన్న ఒక జూదగాడు అదేంటి అంత మాట అన్నాను అని అనుకుంటున్నారు కదా అవును మా నాన్న ప్రకృతితో జూదం ఆడుతూ వ్యవసాయం చేస్తున్నాడు జూదం కూడా ఆడే వాడి చేతిలో కాకుండా అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది కదా అలాగే మా నాన్న చేసే వ్యవసాయం కూడా నాన్న పడే కష్టం మీద కాకుండా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ప్రకృతి కరుణిస్తే వ్యవసాయం బాగా పండుతుంది లేదా మాకు తినడానికి తిండి కూడా దొరకదు జూదం ఆడేటప్పుడు ఓడిపోతే ఎలా అయితే ఓడిపోయిన వ్యక్తికి ఏమి దొరకకుండా తన కుటుంబం ఆకలితో అలమటిస్తున్న దో మా కుటుంబం కూడా అలాగే ఉంటుంది. 


మా నాన్న ఒక హిందువు గుడిలో దేవుడిని పూజించే పూజారి ఆకలి తీర్చే ఒక హిందు రైతు మా నాన్న

మా నాన్న ఒక ముస్లిం ఇంటికి వచ్చే పకీరు ఆకలి తీర్చే ఒక ముస్లిం రైతు మా నాన్న

మా నాన్న ఒక క్రిస్టియన్ చర్చిలోని ఫాదర్ ఆకలి తీర్చే ఒక క్రిస్టియన్ రైతు మా నాన్న

మా నాన్న ఒక సిక్కు హే గురు అని గురునానక్ను పూజలు చేసే వ్యక్తి యొక్క ఆకలి తీర్చే ఒక సిక్కు రైతు మా నాన్న.. నా మతం నీ మతం నా కులం నీ కులం అని తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే ఒక గొప్ప రైతు నాన్న...


మా నాన్న ఒక పూజారి మా పొలంలో వేసిన పంట బాగా పండాలని ప్రతిక్షణం పూజించే పూజారి మా నాన్న.


కాదండి మా నాన్న ఒక వైశ్యుడు ఎలా అంటారా మా నాన్న పండించిన పంట అమ్మేటప్పుడు ఒక వైశ్యుడి లా బేరమాడి అమ్ముతాడు వ్యవసాయ మార్కెట్లో అంటే ఒక వైశ్యుడే కదా వ్యాపారం చేసేది కాబట్టి మా నాన్న ఒక వైశ్యుడు.


మా నాన్న తన వ్యవసాయ భూమి లో ఉన్న పంటను పక్షుల నుంచి కాపాడుకోవడానికి డప్పు వాయిద్యాలను మ్రోగించే ఒక దళితుడు గా అవుతాడు.


వ్యవసాయనికి సహాయ పడే జంతువులను పెంచే ఒక గిరిజనుడిగా అవుతాడు.


మా నాన్న తన జీవిత కాలంలో వావ్యసాయం చేసే రోజుల్లో ఒక రోజు కమ్మరి గా, ఒక రోజు కుమ్మరి గా, ఒక రోజు రజకుడిలా, వ్యవసాయ పనిమట్లు తనకు తాను గా చేసుకునే వడ్రంగిలా ఇలా ఎది అది అనికాకుండ ప్రతి పని చేసే గొప్ప రైతు మా నాన్న.....


Rate this content
Log in

Similar telugu story from Drama