లోకం తీరే ఇంత...
లోకం తీరే ఇంత...


లోకులు పలు కాకులు అన్న మాట ఊరికే రాలేదండి బాబూ......
మన ఇంటి వ్యవహరాలు ఎలా ఉన్న పక్కింట్లో మాత్రం వేలు పెట్టేస్తారు......
కొంచెం అందలమెక్కిస్తే నెత్తిమీద కూర్చున్నట్టు మనల్నే అణగదొక్కాలనుకుంటారు
పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్టు పక్కింటి విషయాలపైనే మక్కువ ఎక్కువ చూపుతారు.
తమకెన్ని భోగబాగ్యాలున్న బ్రతకడమే కష్టం అన్నట్టుగా ఎదుటివారి నుండి జాలిని ఆశిస్తారు
అదేం విడ్డూరమో!!! లోకానికి చేప్పే నీతులు ఆ ఇంటికి పనికి రావు...మరి...
ఏంటో ఈ సమాజం......!!!
ఉన్నవాన్ని ఉన్నవాడుగానే చూస్తారు.లేని వాణ్ణి మరీ హీనంగా చూస్తారు.
మనిషిలా మాత్రం గుర్తించరు....
.
.
.
.
మారాలి......
మార్పు రావాలి...
మనుషుల ఆలోచనా తీరులో... !!!