తొలి వలపు
తొలి వలపు


పెళ్ళిచూపులు అంతగా పరిచయం లేని మనస్తత్వాలు,మనుషులు.
ఓ శుభమూహుర్తాన పెద్దలందరి ఆశీర్వాదంతో జరిగిన పెళ్ళి.
కొత్త వ్యక్తులు,ఆచారాలు,పద్దతులు....
అమ్మ,నాన్నలు,నా స్వేచ్ఛా ప్రపంచం నుండి నేను దూరమై పోతున్న భావన కలగగానే ఏదో మూలన భయం వెంటాడుతూ ఆగకుండానే వస్తున్న కన్నీళ్ళను.... ఆపే ప్రయత్నం చేస్తూ నా వెన్ను తట్టుతూ నీకు నేనున్నా అంటూ కనుచూపుతో మా వారు నాకు ఇచ్చిన భరోస నేనెప్పటికి మర్చిపోలేను.
అదే తనపై చిగురించిన తొలిప్రేమ.
అనుకోని పరిస్థితులో నన్ను విడిచి దూరంగా వెళ్ళిన క్షణం ఆయన కళ్ళలో తిరిగిన కన్నీళ్ళని,తిరిగి వచ్చాక చూపిన ప్రేమను,అపారాధ బావనను చూస్తూ ఆయనపై ప్రేమ వంద రెట్లయింది.
అలా పిల్లలు,భాద్యతలు... ప్రతి క్షణం ప్రతి సంధర్భంలోను ఆయన నా పై చూపే ప్రేమను ఆస్వాదిస్తూ, ఆయనకి కొంత చికాకును తెప్పిస్తూ, కొంత బెట్టు చేస్తూన్నా ఓపికగా భరిస్తూ ఉండే ఆయన పై ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది.