కావ్య రాము

Inspirational

3.4  

కావ్య రాము

Inspirational

***పాయిదా***

***పాయిదా***

2 mins
35K



బాలు: ఏంటో ఈ ఊరు ఎటు పోతుందో.....!!


నీలు: ఏంటి బాలు ఊరు ఎటు పోతది నీకు పిచ్చిగాని పట్టిందా ఏంది...??


బాలు: ఇగో పిచ్చి గిచ్చి అన్నావనుకో నీకు శాపం పెడుతా ఏదైనా రోగం రావాలని జాగ్రత్త...


నీలు: ఇదేందిరో అయిన నువ్వు అంటే మాత్రం అస్తదా ఏంది...!!


బాలు: హ్మ్ అసలే నా నోట్ల మచ్చలు ఉన్నాయి మళ్ళా....


నీలు: అచ్చినా మన కాడ పైసలకు కొదవలేదు..అసలే ఆ అంటురోగానికి మన ఊరి పెద్ద అడ్డుపడతాళ్ళు....అదేందో విరాళాలు ఇచ్చుకుంటా.... మన వీది చివర గుళ్ళో అయ్యోరు చెప్పిండ్రు...


బాలు: హ...హ...హ...


నీలు:హ నువ్వు నవ్వుతాన్నవ్ ఏంది....!!


బాలు:మరి నవ్వక ఏమి చేసిండు ఏంది ఊరి పెద్ద....రోగమొచ్చినకాడ అందరిని ఊరి బయట గుడిసెల్ల పండబెట్టిండు....మనల్ని యాడ సుత్తండు....??


నీలు: ఈ యాల పొద్దుగాల ఏదో మందు మా గూడెం ముందట అంతా ఏదో చీమల మందు చల్లిల్లు మీ కాడ చేయలేదా ఏంది.....!!


బాలు: హ్మ్ అప్పటిమందం చల్లారబెట్టినట్లున్నారు. అట్ల లేకపోతే మీ గుడేపోల్లు ఊకుంటారా ఏంది....??


నీలు: అయ్యో మీ కాడ ఎవ్వరు అడగలేకపోయారా.....!!!


బాలు:మా కాడ అడిగే దిక్కులేదు....నేనా ఎర్రోన్ని అని మా అయ్య నా నోరు మూయించిల్లు.....నానోరు మూస్తే నా పానాలు మిగులుతాయని మా అయ్య ఆస......?


నీలు: మరి ఆ కొత్తలన్ని ఏం జేస్తారంటవ్....!!


బాలు: ఆ ఏం జేస్తరు.. ఐసుముక్కలాగా నాకేసి పుల్ల ఆ పాకలో ఉన్నోళ్లకు పడేస్తరు.....తెల్లారేసరికి ఎక్కడిగొంగలి అక్కడే ఉంటది.....!! బాగా ఉన్నోళ్లు గొడ్ల చావిడి లో ఉన్న వాటికి దాణా కొని ఇంకా మేపుతరు...


నీలు: ఏమో బాలు ఏదో బాగా తెలిసినోని తీరు మాట్లాడుతున్నవ్ నాకైతే సమజ్ అయితలే....

అయినా ఇంత తెలివి నీకెక్కడిది బాలు....!!


బాలు: ఎర్రోడు ఎర్రోడు అంటే ఎంత ఎర్రోన్నో సుద్దామని ఊరంతా చుట్టొచ్చి ఈ సంగతి అంత కనుక్కున్నా....కానీ ఏం పాయిదా.నా నోరు మెదపనిస్తాడా మా అయ్య.... మల్ల నా నోరు నోక్కేస్తడు....


నీలు: పోన్లే బాలు ఏ మాయరోగం మనఎంట రాకుండా సూసుకొంటే సాలు కదా....ఆ బురద మనకెందుకు....!!ఇగో మాయమ్మ నీకిమ్మని ఈ రాగి సంకటి ఇచ్చింది ఆ మాటే యాది మరిచిన....


బాలు: అబ్బా....అత్త కు నేనంటే ఎంత పానం నాకిట్టమని పంపినాదా.....!!


నీలు:అడిగి తెచ్చింది నేనే.....!!


బాలు:నీ కడుపు చల్లగుండా నీకేం రోగం రాదులే నా శాపం తుపాల్....

పోయెస్తా ఇగ మరి......!!మళ్ళా కలుద్దాం....



Rate this content
Log in

Similar telugu story from Inspirational