రామంగారు ఇకలేరా?
రామంగారు ఇకలేరా?


లెక్కలు సరిగా చేయలేదనిరామం మేష్టారు శివ చెంపలు వాయించారు
ఆరోజు రాత్రి శివకు104 డిగ్రీల జ్వరం
’నేను బడికి వెళ్లనంటూ కలవరించాడు
మూడు రోజులైనా జ్వరం తగ్గ లేదు
ఆసాయంకాలం రామంగారు హాస్పిటల్ లో శివనుకలిశాడు
దిగాలుగా చూస్తూ శివ చేతిలో యాపిల్ పండు వుంచాడు
మర్నాడు శివ క్రమంగా కోలుకొన్నాడు
5వతరగతి పరీక్షలు పూర్తి చేశాడు
రామంగారే పట్టణం లో హైస్కూల్లో చేర్చి వచ్చారు
పిల్లలు లేని రామానికి శివ సర్వం అయ్యాడు
””””””””””””””””””””””
అమెరికాలో ఉద్యోగం
రావడం సినిమా కథలా నడిచింది
రామంగారు రిటైరయిన రోజు శివ అమెరికానుండి వచ్చి గజమాలవేసి ఉద్వేగంతో మాట్లాడాడు
’ఆ రోజు మేష్టారు వాయించిన చెంప సభకు చూపించాడు
రోజులు దొర్లిపోయాయి
ఓ రాత్రి శివకు ఫోను వచ్చింది
రామం గారునిద్రలోనే చనిపోయారు
శవదహనం చేయడానికి ఎవరూముందుకు రాలేదన్న వార్త విని శివ మర్నాడే ఊళ్ళో వాలిపోయాడు
తానే చితికి నిప్పు పెట్టి భోరున ఏడుస్తూ చెంప నివురుకొని ‘మీరు ఆరోజు చెంప వాయించకపోతే నేనింత వాడిని కాకపోదును’ అంటూ రామంగారి ఫోటోకి పూలమాల వేశాడు