ఇంటి సంతోషం ఇల్లాలితోనే....
ఇంటి సంతోషం ఇల్లాలితోనే....
ఏమోయ్....!! ఇటుగా వస్తుంది మన అమ్మాయి ఉషలా లేదు....??
ఉష లా అంటారు ఏంటి...?? మన అమ్మాయే...!!!
ఒక్కదానివే వస్తున్నావ్... అల్లుడుగారు , పిల్లలు ఎక్కడ....??🤔🤔
ఏంటి నాన్న నువ్వు...!! నేనొక్కదాన్ని రాకూడదా ఏంటి...??
అలా కాదే.... నాన్న ను తప్పుగా అనుకోకే కనీసం పిల్లల్ని కూడా వెంటబెట్టుకు రాలే..?? అది కబురు కాకరకాయ లేకుండా దిగావు.. అందుకే ఇన్ని ప్రశ్నలు...??
నాకు రావాలనిపించింది వచ్చాను....ఇక నేను వెళ్ళను...అంటూ సోఫాలో బాధగా కూర్చుండిపోయింది...
అదేంటమ్మా అలా అంటున్నావు అల్లుడుగారు ఏమన్నా అన్నారా...?? ఇంకా ఎవరైనా ఏమన్నా అన్నారా తల్లీ...!! అని అడుగుతున్న నాన్నతో..
అదొక్కటే తక్కువ అక్కడ...నా పాటికి నేను పనులు చేసుకుంటూనే పోవాలి.....ఒళ్ళు హూనం అయినా అక్కర్లేదు....
మంచివాడు అని , ఆర్ధికంగా ఉన్న వాళ్ళు అని నా చదువు మధ్యలోనే ఆపి పెళ్లి చేసి నన్ను మీ గుండెల మీద కుంపటి అనుకొని దింపేసుకున్నారు..
మీకేం...!! నా అలసటని ఆరుస్తారా... తీరుస్తారా....!! అంటూ అమ్మ ఒళ్ళో ఏడుస్తూ అలాగే పడుకుండిపోయింది....
🌥️🌥️🌥️
పొద్దున అనగా వచ్చిన పిల్ల..... వదిన వాళ్ళు, అల్లుడుగారు ఎంత కంగారు పడుతున్నారో ఎంటో.... ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు.... అని అంటున్న మాటలకు మెలకువ వచ్చిన ఉష తేరుకొని గోడకున్న గడియారం చూసింది....
సాయంకాలం 4గంటలు కావస్తోంది....
అమ్మా.... ఇప్పటిదాకా నన్ను లేపనే లేదు..
కావాలనే ఉరుకున్నాం అమ్మ.. అయినా ఓ రెండ్రోజులు ఉండి వెల్దువు లేమ్మా...!! పిల్లలని అల్లుడుగారికి చెప్పి తీసుకురమ్మంటా....
వద్దమ్మ... !!! అసలే అత్తయ్య 4 రోజుల నుండి ఏమి తినకుండా జ్వరంతో బాధపడుతున్నారు, మామయ్యకి ఓపిక ఉండదు....సమయానికి ఏది అందకపోయినా చిరాకు పడతారు..
ఈ పాటికి పిల్లలు ఇంటికి వచ్చి నాకోసం వెతుకుతూ ఉంటారు....
మీ అల్లుడికి చెప్పను లేదు...పైగా కోపంతో వచ్చేసా.... అర్థగంట ప్రయాణం కాబట్టి రాగలిగాను, ఇంకా దూరం అయితే మీ దగ్గరకి రాలేకపోయేదాన్ని....
ఏదో అలసటలో, బాధలో ఏవేవో మాట్లాడాను... అంటూ అమ్మను హత్తుకుంది(కన్నీళ్లతో)...
పిచ్చిపిల్ల ఎందుకే ఏడుస్తావ్.....?? నువ్వు అలా చెప్పా పెట్టకుండా ఒక్కదానివే వచ్చేసరికి మా గుండెల్లో రైళ్లు పరిగెట్టినంత పనైంది....అయినా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండడం లోనే మా సంతోషం ఉంది...
ఉష.....!! అంత అలసినా నీ అవసరం,నీ ప్రేమ లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని బాధ పడుతున్నావ్ చూడు....
అందులోనే నీకోకటి అర్థం అవ్వాలి....నీతోనే ఆ ఇంట్లో సంతోషం మొదలవుతుంది అని....
అవును నాన్న..... నువ్వన్నది నిజమే అని ఇంటికి మరలింది......
🕔🕔🕔🕔🕔
ఉదయం 5గంటలు అలారం శబ్దంతో మెలకువ వచ్చిన ఉష ఒక్కసారిగా కళ్ళు తెరచి చూస్తే పక్కనే ఉన్న పిల్లలు, భర్త హాయిగా నిద్రపోవడం చూసి.....
&
nbsp; ఇదంతా నా ఆలాపన వల్ల వచ్చిన కలనా 💭💭 ...!!!! కల అయినా అందులో వాస్తవం ఉంది అనుకోని త్వరత్వరగా తెల్లవారుజామున చేసే పనులు చేయడం మొదలెట్టింది.....
ఉషా....!! అమ్మా ఉషా.....!! సంతోష్ అప్పటి నుండి పిలుస్తున్నట్టు ఉన్నాడు....ఒకసారి వెళ్లమ్మా...!!
ఈ పని హడావిడిలో వినలేదు అత్తయ్య... వెళ్తున్నా.. అంటూ సంతోష్ దగ్గరికి వెళ్ళింది....
ఉషా.....!! త్వరగా తయారవ్వు మనం ఒక చోటుకి వెళ్ళాలి....
ఎక్కడికండి ఇంత హడావిడిగా...???
అదంతా నీకెందుకు నే చెప్పింది చేయు.....అనగానే
అదంతా గమనిస్తున్న అత్తగారు...
వాడేదో అంటున్నాడు కదమ్మా....ఇక్కడి గురించి నే చూసుకుంటాలే. మీరు వెళ్ళండి.. అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది...
౯౯౯౯
కారులో మధురమైన పాటలతో.... సంగీతాన్ని ఆలకిస్తున్న ఉష కి ఏదో వెచ్చని గాలి, మనసు పొరల్లో గూడుకట్టుకొని పోయిన ఆ వాతావరణం తాలూకు పచ్చని పంట చేను , పంట పొలాల మాధుర్యం తన మనసుకు తాకింది.....వెంటనే కారు ఆగిపోయింది....
కళ్ళు తెరచి చూస్తే.....ఉష అమ్మానాన్న...!!! తను వచ్చింది తన పుట్టింటికి.....
అమ్మా...నాన్న...... ఎలా ఉన్నారు...!!! అంటూ చిన్న పిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రేమతో ఆలింగనం చేసుకుంది...
ఉషా... అల్లుడు గారు చెప్పలేదా....?? మీరు ఇక్కడికి వస్తున్నారని....
లేదు నాన్న......???
అంటే ఇది మీకు ముందే తెలుసా...??
ఇది ఎలా సాధ్యం నా కల గురించి ఏం చెప్పలేదే అంటూ అనుమానంగా , ప్రశ్నార్థకంగా మొహం పెట్టి సంతోష్ మొహం చూసింది....????
ఏమైంది ఉషా..... ??? అలా చూస్తున్నావ్ ...??
అది.. ఇంత హడావిడిగా తీసుకొచ్చింది ఇక్కడికా చెప్పనే లేదు...
నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అని... అమ్మ చెప్పింది.. ఉష ఈమధ్యలో ముభావంగా ఉంటుంది....నలత గా ఉన్న బయటపడదు... అలా ఉంటే మాకు బాధగా ఉంది దానితోనే ఇంట్లో సంతోషం అయినా, సరదా అయినా....!!!
దాన్ని ఒక వారం పాటు వాళ్ళ పుట్టింటికి పంపిస్తే తనకి ఈ పనుల నుండి కొంతైనా సాంత్వన దొరుకుతుంది... అని అంది... నాకు అదే అనిపించింది....అలా...!!
మరి పిల్లలైనా ఒక్క మాట కూడా చెప్పలేదు...!!
ఇదంతా పిల్లలు, నేను వేసుకున్న ప్లాన్.....ఎలా చెప్తారు వాళ్ళు.....(నవ్వడం పిల్లల వంతైంది). సరే ఇప్పటికైనా లోనికి అనుమతి ఉందా లేదా...శ్రీమతి గారు??
అనుమతిస్తారా...?? లేక....!!!
సంతూ......!! అంటూ సిగ్గుపడుతూ... ఉష తన భర్త చేతి పట్టుకొని ప్రేమతో, మనసులో ఉన్న భారాన్ని తేలిక చేసుకొని లోపలికి సంతోషం(సంతూ +ఉష) తో అడుగులు వేసింది...
"ఎలాంటి పరిస్థితిలోనైనా ఇంటిల్లిపాదిని సంతోషంగా ఉంచడం నా భాధ్యతే....ఆ సంతోషానికి మూలాధారం నేనే కదా...!! అప్పుడే ఇల్లు స్వర్గసీమ అవుతుంది కదా.." అనుకుంటూ తన మనసును అర్థం చేసుకున్న అత్తయ్యకి లోలోనే కృతజ్ఞతలు చెప్పుకుంది....