కావ్య రాము

Drama

4.0  

కావ్య రాము

Drama

సరైననిర్ణయం సత్మార్గానికి దారి

సరైననిర్ణయం సత్మార్గానికి దారి

4 mins
330


సత్య, రమణి, మృదుల లు ఇంటర్ చదివేటప్పటినుండి ముగ్గురు మంచి స్నేహితులు.‌ ముగ్గురు మద్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళే. సత్య, రమణిల కుటుంబాలు ఒకే కాలనీలో ఎదురెదురుగా ఉండేవి. మృదుల కుటుంబం పక్క కాలనీలో ఉంటుంది. చదువులు పూర్తయ్యాయి. ఎవరి ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళు చేయటం మొదలెట్టారు.

              ********** 

*సత్య తనకున్న మెరిట్ తో ఒక మంచి కంపెనీలో చేరింది. మృదుల ఒక్కతే కూతురు అవడం చేత అమ్మనాన్నలే లోకం తనకి.

               *********  

సందీప్ ఒక మంచి ఉన్నతమైన బావాలున్న వ్యక్తి. ఆర్థిక పరిస్థితుల మూలంగా సందీప్ తన అమ్మమ్మ , తాతయ్యల దగ్గరే ఉండి చదువుకున్నాడు. అప్పుడప్పుడు అమ్మనాన్నలే వచ్చేవారు తన దగ్గరికి. చదువులో ఎంతో చురుకుగా ఉండే సందీప్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. 

అమ్మమ్మ వాళ్ళ , అమ్మనాన్నల ప్రేమకు దూరంగా ఉండటం భరించలేని సందీప్ వాళ్ళకి చెప్పకుండా తిరిగి ఇండియాకి వచ్చాడు. అక్కడ సంపాదించిన డబ్బుతో ఒక మంచి ఇంటిని కొనుకున్నాడు. ఉన్న ఊళ్ళోనే మంచి కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్కొన్నాడు. ఉద్యోగం వచ్చేంతవరకు ఇండియాకి వచ్చిన విషయం,ఇల్లు గురించి ఎవరికి చెప్పద్దని అన్ని సంతోషాలను ఉద్యోగం వచ్చాకే చెప్తా అని మాట తీస్కున్నాడు తన మిత్రుడైన రవి దగ్గర..... !!!

           ***********

*రమణి తన చదువుకు సంబందమైన శిక్షణ తీస్కొంటుంది. ఆ సమయంలో ఎదురైన వ్యక్తే సందీప్.

రమణి కోచింగ్ క్లాస్ లకు వెళ్తూ వస్తూన్న దారిలోనే సందీప్ ని గమనించింది.తన గురించి విని తనని ప్రేమించాలని నిర్ణయించుకుంది. అలా ప్రయత్నాలు చేస్తూ చివరికి సందీప్ ప్రేమని పొందింది. తన ప్రేమ విషయం తన స్నేహితురాళ్ళకు కూడా చెప్పింది. కొన్ని నెలలు గడిచాయి ఒకరికొకరు గాఢ ప్రేమలో మునిగిపోయారు.

*సందీప్ తన వాళ్ళకి ఇంకో సంతోషాన్ని కోడలి రూపంలో ఇస్తున్నానని ఆనందపడ్డాడు.

          **************

* మృదుల అమాయకురాలు, చంద్రబింబం లాంటి మోముతో ఉన్న అందమైన అమ్మాయి. ఎవరి వంక కన్నెత్తి చూడక , తన పనేదో తను చూస్కొనే అమ్మాయి.

*తను ఉద్యోగం చేస్తూన్న ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి ఎప్పుడూ మృదుల వెంట పడేవాడు తనని ప్రే‌మించమని ఒత్తిడి పెట్టేవాడు. తనకి ప్రేమ,పెళ్ళి ఇలాంటి వాటిపై ఆలోచనలు లేవని , ఒక్కతే కూతురు అవడం వల్ల అమ్మానాన్నలను చూస్కొనే బాద్యత తనదేనని చెప్పింది. అయినా ఆ వ్యక్తి తన మాటలు వినక ఒక నెల గడువు ఇచ్చి వెళ్ళిపోయాడు.

          ************

ఇంతలో రమణి వివాహం కుదిరింది. సత్య,మృదులలు రమణి వివాహా వార్తను విని సంతోషపడ్డారు.

"రమణి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు ప్రేమించిన వ్యక్తితోనే నీ పెళ్ళి కుదిరింది కదా" అలా వింటూనే ర‌మణి మౌనంగా ఉండిపోయింది........... సందీప్ తో కాదు పెద్దలు నిర్ణయించిన వ్యక్తితో పెళ్ళి జరుగుతుంది అని అసలు విషయం చెప్పింది రమణి.

"" సందీప్ మంచివాడు కాదని, అతని చేతిలో మోసపోయానని చెప్పింది "" .

సత్య,మృదులలు జరిగింది మర్చిపొమ్మని చెప్పి అంతా పెళ్ళి సంబరాల్లో మునిగిపోయారు. ఒక పేరున్న వ్యాపారవేత్తతో అంగరంగవైభవంగా, ఆటపాటల సందడితో రమణి పెళ్ళి తంతు పూర్తయింది.

ఒక నెల గడిచిపోయింది........

            ~~~~~•~~~~~

ఆ వ్యక్తి మళ్ళీ మృదులకు ఎదురుపడి నిలదీస్తూ ఇబ్బంది పెట్టాడు. కాని మృదుల "నాకు వృద్దుల ఆశ్రమాన్ని నెలకొల్పి నా జీవితం వాళ్ళకే అంకితం చేయాలని ఉందని చెప్పింది". 

* ఒక వేళ పెళ్ళి చేస్కోవాలని నిర్ణయించుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేస్కోను అని సమాధానమిచ్చింది.

ఆమె మాటలను ఏ మాత్రం వినని ఆ వ్యక్తి తన ప్రేమని నిరాకరించిందన్న ఆవేశంలో ఊగిపోతూ ‌తను ముందుగానే తెచ్చుకున్న తేజాబును తన మోహంపై చల్లి పారిపోయాడు.

మృదుల అక్కడికక్కడే కుప్పకూలిపోయి విలవిలలాడింది. వెంటనే ఆస్పత్రికి తీస్కెళ్ళారు. అప్పటికే తను జీవచ్ఛంలా అయింది. తన ఆశలు నీరుగారిపోయాయి. ఈ విషయం విని సత్య నిర్ఘాంతపోయింది.

              ***********

*మృదుల గురించి బాధలో ఉన్న సత్యకి మరో విశాదవార్త అందింది....

*సత్య వాళ్ళ అన్నయ్య ఆత్మహత్య చేస్కొని చనిపోయాడని......

        #####:::::#####


అంతా పూర్తయిన మరుసటి రోజు సత్య ఇంటికి ఒక కంపెనీ నుండి కాల్ లెటర్ వస్తుంది. అది వాళ్ళ అన్నయ్యది.

ఒక్కక్షణం షాక్ కు గురైంది సత్య...........!!!!

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన అన్నయ్య ఇండియాకి రావడమేంటి అని సంధిగ్ధంలో మునిగిపోయింది.......

ఆర్థికపరమైన కారణాలచేత అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండి చదువుకున్న సందీపే సత్య అన్నయ్య.....

వెంటనే తన అన్నయ్య చావుకు కారణం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. చివరికి తన మిత్రుడు రవి ద్వారా జరిగినదంతా విని కన్నీరుమున్నీరైంది.......

ఆ అమ్మాయి మోహం తప్ప తన గురించి వివరాలు తనకు అంతగా తెలీదని, కాని సందీప్ ని ప్రేమించిన అమ్మాయి సందీప్ ని మోసం చేయడం ,తన కన్నా డబ్బున్న వ్యక్తి దొరికేసరికి. "నువ్వు నాకు అక్కర్లేదు, నీకన్నా ధనవంతుడు నాకు దొరికాడు. ఇక నీ అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది" అని చెప్పాడు.

నాలుగైదు రోజులకు రమణి సత్యను కలవడానికి వచ్చి కొంత సమయం ఉండి తను వెళ్ళిపోయింది. అంతలోనే రవి సందీప్ ఫోటో ఫ్రేమ్ ను ఇవ్వడానికి వచ్చాడు. తన ఇంట్లోకి వెళ్ళిపోతున్న రమణిని గమనించి హడావిడిగా రవి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్తున్ళ రమణిని సత్యకి చూపించి సందీప్ ని ప్రేమించింది ఈ అమ్మాయే అని చెప్పాడు.

అంటే......... !!

ఆ రోజు రమణి తమకు అబద్ధం చెప్పిందని అర్థమై ఆవేశంతో, బాధతో రమణిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టి, లాక్కొచ్చి సందీప్ ఫోటో ముందర నిలబెట్టింది.

రమణి......సందీప్ మీ అన్నయ్యా........???? అంటూ.... అయ్యో.......!!!!!నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది అని బాధపడింది. 

రమణి అమ్మనాన్న కూడా తనని చాలా మాటలన్నారు. సందీప్ చాలా గుణవంతుడు. నీకి పెళ్ళిసంబంధం కుదరకపోతే మేం నీకు నిర్ణయించుకున్న వ్యక్తే ఈ సందీప్..!!!! ఎంత పాపానికి ఒడికట్టావు అని నానా మాటలంటూనే...... అందరు కన్నీరు మున్నీరైయ్యారు.

     ******@@@@@@*******

సత్య ఆలోచనలు సమాదానం లేని ప్రశ్నలైనాయి..

*****ఎవరికి ఎవరు బలవుతున్నారు?????*****

* అమాయకురాలైన అమ్మాయి పై అమానుషంగా ప్రవర్తించి అమ్మాయి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టిన ఆ మగాడిదా తప్పు??

* ఒక మంచి వ్యక్తి ఆశలను,ఆశయాలపై నీళ్ళు చల్లి ప్రేమ పేరుతో వంచించినందుకు మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు కారణమై ఆ కుటుంబం నడివీధిలో నిలబడడానికి కారణమైన ఆడదాని తప్పా??

నేటి యువత ఆలోచనా తీరు ఎటు పోతుంది??

* క్షణికావేశాలు , తొందరపాటు నిర్ణయాలు, ఏ చిన్న సమస్యనైనా తట్టుకొనే ధైర్యం లేక , ఆలోచన లేకుండా ఆవేశంతో తీస్కొనే నిర్ణయాల వల్ల ఎన్ని కుటుంబాలు బలి అవుతున్నాయో.......!!! నిత్యం మనం వింటూనే ఉంటాం,బాధపడుతూనే ఉంటాం.

* ఇందులో ఎవరు మంచి??? ఎవరు చెడు????అబ్బాయి చావుకు కారణమైన అమ్మాయిదా???అమ్మాయిని జీవచ్ఛవంలా మార్చిన అబ్బాయిదా????

            **********

 * కొన్ని నిర్ణయాల వల్ల కొందరి జీవితాల్లో ఏర్పడే విషాదఛాయలు........!!!!!! దీనికి సమాధానం తెలిపేది ఎవరు????

అలా...... వెతికినా దొరకని స‌మాదానాలకు మార్గన్వేషణ చేస్తూనే..........తన అమ్మనాన్నలకి , మృదుల కుటుంబానికి ఆసరా అయింది.

* సందీప్,మృదుల ల ఆశయాన్ని ఒక వృద్దాశ్రమం రూపంలో నెలకొల్పి ఎంతో మంది వృద్ధులకు అండగా నిలబడింది సత్య.

★ ఈ కథ నిత్యం వినే సంఘటనలే కానీ మన దాకా వస్తే కానీ మనం ఆలోచించం. ఇది యువతలో పరిగేడుతున్న అస్తవ్యస్తమైన ఆలోచనలకు కళ్లెం కావాలి.  

★ అమ్మాయి అయిన, అబ్బాయి అయిన ఎవరు జీవితాలు నాశనం అయినా బాధను అనుభవించేది మాత్రం మీరు, మీ అమ్మనాన్నలు ,ఇంకా మొత్త ం కుటుంబం, ఇంకా సమాజం.

★ అందుకే మనం తీసుకునే నిర్ణయాలు మనకు, మన వల్ల ఇంకొకరి జీవితాలను బలి చేయకుండా ఉండాలి.


Rate this content
Log in

Similar telugu story from Drama