కావ్య రాము

Inspirational

3.9  

కావ్య రాము

Inspirational

అందమైన వ్యక్తిత్వం

అందమైన వ్యక్తిత్వం

4 mins
709


అచ్చరిత ఒక అందమైన అణకువ గల అమ్మాయి. అణకువకు తోడుగా అల్లరి చేస్తూ ఆటపట్టిస్తూ ఉండే తమ్ముడు ఆకాష్....!!


అచ్చరిత తన ప్రతిభ తో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. వృత్తిలో వివిధ మెళకువలు నేర్చుకుంటూ ఎదుగుతూ పై స్థాయి కి కూడా చేరింది.


అదే క్రమంలో తను వేరే ఊరికి బదిలీ అయింది.

అచ్చరితకి అన్ని సుగుణాలే అందులో ఒకటి అందరిని ప్రేమగా దగ్గరికి తీయడం,ఇంకా కొంచెం అమాయకత్వం తో కూడిన మంచితనం....


సరిగ్గా ఉద్యోగ బదిలీ అయినా 15రోజులకు తన సహఉద్యోగి గా రాకేష్ చేరాడు.....అతనికి కలుపుకుపోయేతత్వం కాదు కాదు.. చొచ్చుకపోయేతత్వం కొంచెం ఎక్కువ... 


కానీ మంచిగానే ఉండేవాడు అందరితో.....సహోద్యోగి అవడం చేత అన్ని వ్యవహారాల్లో ఇద్దరు కలిసి పని చేయడం ,అన్ని ప్రాజెక్టులు కలిసి పూర్తి చేయడం జరుగుతుండేది....


రాకేష్ కి అచ్చరిత అందం తో కూడిన అమాయకత్వం చూసి ముచ్చటేసేది... అలా ఆమెని ప్రేమించడం మొదలెట్టాడు.


తన మాటలతో తన ప్రేమని అర్ధం అయ్యే విదంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది అచ్చరితకి అర్థం అవుతుంది.

 

రాకేష్ పండుగలకి, ఇంట్లో జరిగే శుభకార్యాలకు తనని ప్రత్యేకంగా ఆహ్వానించడం అచ్చరితకి ఇబ్బందిగా అన్పించేది. తోటి ఉద్యోగి కనుక ఆఫీస్ లో ని వాళ్ళతో తను వెళ్లక తప్పకపోయేది.


రాకేష్ కి చనువు తీసుకోవడం ఎక్కువ కదా ఇంకా అచ్చరిత అనేసరికి హద్దులే కనబడకపోయేవి.తను ఎక్కడికి వెళ్లిన అక్కడే ఉండేవాడు.


చివరగా ఒక రోజున రాకేష్ ప్రేమను తనకి తెలియజేసాడు.తను మాత్రం తన తల్లిదండ్రుల అనుమతి కావాలి అని అంది.


రాకేష్ ఆస్తి ,అంతస్థూ,అందం ఇంకా దానితో పాటు నన్ను చేసుకోవడమే వచ్చే అమ్మాయి అదృష్టం అన్న ఒకింత గర్వం ఉన్న వ్యక్తి.


ఈ విషయం అచ్చరిత అమ్మానాన్న దాకా వెళ్ళింది.అబ్బాయి ఆస్తి పాస్థి, అతని చదువు , తెలివితేటలు అన్ని బాగున్నాయి కానీ వాళ్ళు పూర్తిగా సరే అనలేదు.


కానీ అచ్చరిత మెల్లమెల్లగా రాకేష్ ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించింది. దూరపు కొండలు నునుపు అన్నట్లు మనిషిని లోతుగా గమనిస్తే గాని అసలు అనేది తెలీదు.


ఆఫీస్ టీం అంతా ప్రాజెక్ట్ పని పై వేరే ఊరికి వెళ్ళడం ఇంకా రాకేష్ కి ఎక్కువ అవకాశం దొరికినట్టయింది.

అచ్చరిత అనుమతి లేకుండానే తనని అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అంటూ తెగ ఇబ్బంది పెడుతుండేవాడు. అలా వెళ్లడం తనకిష్టం లేదని చెప్పిన వినేవాడు కాదు. 


ప్రతిసారి రాకేష్ తనతో వేరే వేరే మాటలతో ,తన చేష్టలతో ఇబ్బందిపెట్టేవాడు.


 రాకేశ్ నుండి మొదటి రోజే ఒక మాట తీసుకుంది. మన రెండు కుటుంబాల నుండి ఎలాంటి అనుమతి పూర్తిగా రాలేదు. పెళ్లి అనే నిర్ణయం జరిగితేనే మన మధ్య ఏ బంధం అయినా మొదలవుతుంది. అప్పటి వరకు మనం మంచి స్నేహితులం మాత్రమే అని.....రాకేష్ కూడా సరేనన్నట్టు తలూపాడు.


కానీ ఇప్పుడు అతని ప్రవర్తన తీరు చాలా మారింది. నువ్వు అలా ఉండొద్దు,ఇలా ఉండాలి అంటూ ఏవేవో ఆంక్షలు పెట్టేవాడు.అవి ఆమెకి నచ్చట్లేదు.


తను ప్రాజెక్ట్ టైంలో తీసుకున్న ఫోటోలు అన్నింటిని ఒక ప్రూఫ్ లాగా ఉంచుకున్నాడు.


  ఒకరోజు తన గది లో ఒంటరిగా ఉన్న అచ్చరిత దగ్గరికి వచ్చి కోపంతో ఊగిపోతూ అతనికి దగ్గర అవడం లేదని ఆమెపై విచక్షణా రహితంగా ప్రవర్తించాడు రాకేష్. వెంటనే ఆమె గట్టిగా అరవడంతో ముందు గదిలో ఉన్న అరుణ్ కి వినిపించాయి..పరుగుపరుగున వెళ్లి ఆమెని కాపాడాడు. 


రాకేష్ పై పై అధికారులకు ఫిర్యాదు చేశారు.రాకేష్ ని ఉద్యోగం నుండి తీసేసారు.


 రాకేష్ అవమాన భారంతో కుంగిపోయాడు.అచ్చరిత పై చాలా కోపం పెంచుకున్నాడు. తనని ఇష్టం వచ్చినట్టు అనడం,తన వ్యక్తిత్వం గురించి తక్కువ చేసి మాట్లాడేవాడు..


రాకేష్ చేసిన పనికి రాకేష్ నాన్నగారు దండించకపోగా అచ్చరితనే నానా మాటలు అన్నారు. మాయమాటలతో నా కొడుకుని నీ వెంట తిప్పుకున్నావని తననే దూషించారు.


పంతంతో అచ్చరిత కన్నా బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కూడా అతని పగ తీరక అచ్చరితని మానసికంగా మాటలతో వేధించేవాడు .

ఆ క్షణంలో ను అరుణ్ ఆమెకి సాయంగా నిలిచాడు.

 అచ్చరిత వాళ్ళ అమ్మానాన్నలకు జరిగిన విషయమంతా చెప్పింది. తన మనసులో ఉన్న మాటను కూడా చెప్పింది. 

అరుణ్ ని పెళ్లిచేసుకుంటానని.....అమ్మానాన్నలు విస్తుపోయారు , మరోసారి ఆలోచించుకోమన్నారు.

               

    ~~~~


అచ్చరిత ఉంటున్న ఇల్లు అరుణ్ వాళ్ళు ఎంతో ప్రేమతో కట్టుకున్న అపురూప భవనం. కానీ అరుణ్ చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరగడం మూలాన అరుణ్,ఇంకా వాళ్ళ కుటుంబం తీవ్రగాయలపాలయ్యారు.అరుణ్ మొహం సగం కాలిపోయింది.


అదృష్టవశాత్తు వైద్యం సరైన కాలంలో అందడం వల్ల ప్రాణాలతో మిగిలాడు. ఇంకా వాళ్ళు దూరపు బందువులైనా అచ్చరిత కుటుంబానికి ఇల్లు అమ్మేసి వేరే ఊళ్ళో స్థిరపడ్డారు. గత పదేళ్లుగా నివాసం ఉంటున్నా ఈ విషయం తెలీదు అచ్చరితకి.


                  ***


అరుణ్ మంచి వ్యక్తి,తెలివితేటలు,ఉదార భావం కలవాడు,కానీ ఎక్కువగా ఎవరితో కలుపుగోలుగా ఉండేవాడు కాదు.

 

ఎవరైనా తనని హేళనగా గేలి చేస్తారేమో,దూరంగా చూస్తారేమో అని తనే మౌనంగా ఉండిపోయేవాడు.

ఇదంతా అచ్చరిత గమనిస్తూనే ఉంది.


అరుణ్ పై ప్రేమ,ఆరాధనా భావం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.


ఆ రోజు రానే వచ్చింది....


అరుణ్ కి తన మనసులో మాట చెప్పడానికి మనసులో ఒకింత సంతోషం,ఇంకోవైపు మనసులో అలజడి.....మొదలైంది.


అరుణ్ కి తన ప్రేమను చెప్పింది,అరుణ్ ఒప్పుకోలేదు, 


ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నావ్??

నేను అంత అందంగా లేను నా మొహం చూశావుగా....!!!

నా గురించి ఏం తెలుసని ఈ నిర్ణయనికొచ్చావ్...??? 

నువ్వు అందమైన అణకువగల అమ్మాయివి. నీకు నా కన్నా మంచి వ్యక్తి భర్తగా లభిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు.


ఆ మాటలు విన్న అచ్చరిత ఇంకా మనసులో దృడంగా నిర్ణయించుకుంది అరుణ్ మాత్రమే తన లోకమని....

               

★★★


ఆఫీసులో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో అందరూ పాల్గొన్నారు. దానికి ఈవెంట్ మేనేజర్ గా అరుణ్ ని నియమించారు.ఆ కార్యక్రమం అంతటా అందరిని ఆకట్టుకుంది.

 

ఇదే మంచి సమయం అని అచ్చరిత అదే స్టేజిపై తన ప్రేమను అరుణ్ కి అందరి ముందట తెలిపి తన అనుమతి కోసం ఎదురుచూసింది.


"అరుణ్ నేను నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్నాను,

నీ అందంతో నాకు అవసరం లేదు.


నీ మంచి మనసు,అందమైన వ్యక్తిత్వం ముందు నీ మోముపైన ఉన్న చేదు గురుతులు కూడా నా మనసుకు నిన్ను అందమైనవాడిగా పరిచయం చేసాయి.


ప్రేమించడానికి అందం ఒక్కటి ఉంటే సరిపోదు.అది వ్యక్తిత్వం లో మాత్రమే కనబడుతుంది.

అందుకే నేను నిన్ను మనసా వాచా కర్మణా ప్రేమిస్తున్నాను.... "

అని చెప్పగానే ఆ ప్రదేశమంత చప్పట్లతో మారుమోగింది. 


కొన్ని సంవత్సరాలుగా ప్రాణం లేని శిలలా మార్చుకున్న తన మనస్సు ఒక్కసారిగా జీవం వచ్చినట్టుగా కోటి కాంతులతో వెలిగిపోయింది.

అరుణ్ కి దగ్గరగా వచ్చిన అచ్చరితని ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని ఆనంద భాష్పాలతో తన ప్రేమను ఆమె నుదుటి పై పెదాలతో తెలపకనే తెలిపాడు.


 అచ్చరిత,అరుణ్ ల వివాహం పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా జరిగింది.

            💝💝☺️☺️💝💝

మనిషికి అందమే ముఖ్యమైతే తన దగ్గర అందం తప్ప ఏది ఉండదు.మంచి వ్యక్తిత్వం ఉంటే అందరూ ప్రేమతో దగ్గరౌతారు.


Rate this content
Log in

Similar telugu story from Inspirational