STORYMIRROR

కావ్య రాము

Drama

3  

కావ్య రాము

Drama

ఆనందభైరవి

ఆనందభైరవి

5 mins
355


రామ...రామ....!!! చెవులకు మంచి సంగీతం వింటూ... కాస్త విరామం తీసుకుందాం అంటే కుదరదు పైగా ఈ రణగొన ధ్వనులకు నా కపాలం పగిలిపోయేలా ఉంది అని తనలో తను గునుక్కుంటూ ఇంటిదాకా చేరుకున్నాడు సుందరం...


 (షాప్ కి , ఇంటికీ 20నిమిషాలు.....


అనుకుంటే... కారులో కూడా రావచ్చు కానీ నడక ఆరోగ్యానికి మంచిది అన్న తన మిత్రుడు ఆనందం సలహా మేరకు...నడవడం అలవాటు చేసుకున్నాడు....)  

అబ్బా....!! ఇంటికి చేరగానే ప్రాణం నిలకడ అయింది అనుకోని.. ఏ.సి. ని ఆన్ చేసి సేదతీరాడు.....ఓ పావుగంటకి కానీ మనిషి మనిషి కాలేకపోయాడు...

వంటగదిలో నుండి వేడివేడి పకోడీలు చేసుకొని, చల్లని నీటిని సుందరం ముందున్న టేబుల్ పై పెట్టింది...అవి చూడగానే ఎక్కడాలేని ఆకలి కడుపుకి గుర్తొచ్చి క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేసేసాడు.....


ఏమోయ్ నువ్వు తిన్నావా లేదా అని తీరిగ్గా అడిగాడు భార్య సుగుణ ని....అడక్కుండానే తిని చివరికి మిగిల్చిన ఖాళీ ప్లేట్ ని, సుందరంని గుర్రుగా చూసి మొహం తిప్పుకొని లోనికి వెళ్ళిపోయింది.


               

ఆనందం పేరుకు తగ్గట్టే అందరికి ఆనందాన్ని పంచుతూ అందరి నోట్లో నాలుకల మెదిలే వ్యక్తి, సుందరం కి ప్రాణస్నేహితుడు కూడా.....

 ఆనందం ఉండేది......వరంగల్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు అయిన శ్రీరాములపల్లె...

 

సుందరం సొంత ఊరు కూడా అదే అయినప్పటికీ వ్యాపారనిమిత్తం....వరంగల్ లో స్థిరపడ్డాడు..... 

ఆనందం తన పొలాలను చూసుకుంటూ, తనకిష్టమైన కవితలను,కథలను రాస్తూ ఆ ఊళ్ళోనే ఉన్న బడి పిల్లల దగ్గరికి వెళ్లి తను రాసే బాల కథలు, స్ఫూర్తినిచ్చే కథలను వినిపించేవాడు....

పొలం మీద వచ్చే పైసలు ,పిల్లలు పంపే డబ్బులు అలా సంపాదన బాగానే ఉన్నా తన వేష ,భాష మార్చుకునేవాడు కాదు....

చాలా సార్లు సుందరం చెప్పడానికి ప్రయత్నం చేసాడు కానీ ప్రయోజనము లేకపోయింది......

 

(ప్రస్తుతం....)

ఇంట్లోకి అడుగుపెడుతూనే....హడావిడి చేస్తూ చెల్లెమ్మా....చెల్లెమ్మా....అంటూ వచ్చాడు ఆనందం....

ఇదేనా అన్నయ్య రావడం.....!! ఊళ్ళో వదిన అందరూ కులాసానా అని అడగగానే అంతా బానే చెల్లెమ్మా....అంటూ లోనికి వెళ్లి అలా సోఫాలో కూర్చున్నాడు...

స్నేహితుని రాక తెలుసుకున్న సుందరం ఆనందానికి అవధులు లేవు...  

ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తాడు అదీ.... కార్తీకమాసం లో  జరిగే లక్మిపూజలకు కావాల్సిన పొలంలో పండిన ధాన్యం, ఫలాలు, పూలు ఇతరత్రా సామగ్రి తనే తీసుకొస్తాడు.... 

వద్దన్నా..... చిరునవ్వుతో ఒప్పిస్తాడు....

పరుగు పరుగున వచ్చిన సుందరం.... ఆనందం ని చూసి తనకి అలసట తాలూకు ఛాయలు కూడా మాయమైపోయి గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు.....

కుశల ప్రశ్నల తర్వాత.....

సుందరం ఆనందం ని ఎన్నాళ్ళ నుండో అడగాలి అనుకుంటున్న ప్రశ్నని ఆనందం ని అడిగాడు....

ఎన్నాళ్ళు నువ్వు ఇలా నిరాడంబరంగా ఉంటావు....??

నీ జ్ఞానాన్ని పది మందికి పంచుతావు కానీ నీ ఉనికిని బయటపెట్టవు... నిన్ను నువ్వు సమాజానికి పరిచయం చేసుకోవు.... ఇలా అయితే నిన్ను గుర్తించే వాళ్లేవరు....??

 

సుందరం...!!! నేను నా సంతృప్తి కోసం ,కాలక్షేపం కోసం చేస్తున్న పనులు . అంతే కానీ ఏదో గొప్పలు కోసం కాదు కదా....

 

అయినా నాకేం తక్కువ....?? 

ప్రాణం లా చూసుకునే మిత్రుడివి నువ్వు ఉన్నావ్....

తల్లి లాంటి ఊరు ఉంది....

పిల్లలు ఎవరికి వారు బాగానే బతుకుతున్నారు....

ఇక మీ చెల్లెలు భైరవికి నేను.... నాకు తను....!! 

ఇంతకంటే గొప్ప సంపద కావాలా జీవితానికి.....!!!

 

నేను కాదనను......!!! కానీ నువ్వు రాసే ప్రతి రచన సమాజాన్ని మేల్కొల్పేలా చేస్తుంది. కవితలు జాగృతి పరుస్తాయి.ఆ పదాల పదును ఈ తరానికి కూడా నిత్యనూతనంగా ఉంటుంది.

ఇంకా.... నీ ఆలోచనలు కొత్త పుంతలు తొక్కాలి....

కాలంతో పాటు మనము మారాలి .....

భావాలు పాతవైనా వాటికి కొత్త రంగులు పులిమి 

నవతరాన్ని మేల్కొల్పాలి......

నీ ఆశయం ఈ-తరం వరదల్లో ఎక్కడో కొట్టుకుపోకుండా పరవళ్లు తొక్కుతూ ఎప్పుడు ఎగసిపడే అలలా ఉండాలి....

అని చెప్తున్న సుందరం మాటలు వింటున్న ఆనందం కి ఒక్కసారిగా ఒళ్ళు పులకరించినట్లనిపించింది...

నా గురించి ఇంత ఆలోచించావా......🤔🤔

అని అడగగానే....

అదేంటిరా అలా అంటావు నేనే దగ్గరుండి మరీ నీ కథలు, కవితలని ఒక పుస్తకంగా అచ్చువేయిద్దాం అనుకున్నాను కానీ నీ అనుమతి లేకుండా బాగోదు అని ఊరుకున్నా.......

అయినా ఇప్పుడు ఎందుకు రా....!!! చూద్దాం...అని ఆ విషయాన్ని పక్కకు పెట్టాడు ఆనందం...

సాయంకాలం సమయాన ఇద్దరు కలిసి ఇంటికి దగ్గరలో ఉన్న ఉద్యానవనం లో నడక ఆరంభించారు.

సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు, సాధకబాధకాలు చెప్పుకొని వాళ్ల బాల్యం గుర్తుకుతెచ్చుకునేవాళ్ళు...

ఆ ఉద్యానవనంకి   వయసు అనే తేడా లేకుండా అందరూ వచ్చేవాళ్ళు ఉంటారు...

అలా అందరూ వెళ్తున్న దారిలోనే అస్తవ్యస్తంగా చెత్తచెదారం పడేయడం, లోకం మరిచి ఎన్నో జంటలు అల్లరి చేస్తూ విచ్చలవిడితనంగా ప్రవర్తించడం చూసిన ఆనందం కి ఒల్లుమండింది.......

సుందరం ఎప్పుడూ కూర్చునే చోటికి వెళ్లి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దామని అనేసరికి అక్కడికి వెళ్లి కూర్చున్నారు.

కానీ ఆనందం ఊరికే కూర్చొని అంతా చూస్తూ ఉన్నాడు.

అంతలో కొందరు వ్యక్తులు చుట్టూ పక్కల జనాలు ఉన్నారు అని కూడా చూడకుండా కనీస బాధ్యత కూడా లేకుండా గ్రౌండ్ లో ఆడాల్సిన ఆటలను ఉద్యానవనంలో ఆడుతున్నారు.... వెంటనే బంతి ఒక చిన్న పిల్లవాడి తలకి తాకబోతుంటే ఆనందమే త

ప్పించాడు........ మాటలతో బుద్ధి చెప్దామని బయల్దేరాడు...ఆనందం.

గాంభీర్యం కలిగిన గొంతుతో గద్దిస్తూ మాట్లాడుతుంటే ఉన్న వాళ్ళ లో ఒకడు అయ్యా మీరు ఎవరు.....?? అని భయం నటిస్తూ అడిగాడు.

 

నేను సాటి మనిషిని అని చెప్పాడు ఆనందం..

పో పోవయ్య....!! నువ్వేమన్న వేదాంతివా ...?? 

నీ మాటలు మేమెందుకు వినాలి...??అంటూ హేళన చేయసాగారు... 

నా వయస్సు అంత అనుభవం లేని వాళ్లు నన్ను అంటున్నారా అని కోపంతో అక్కడున్న ఒక అబ్బాయి చెంప చెల్లుమనిపించాను...అందరూ మీదికి దూకినంత పని చేశారు...కానీ దెబ్బ తిన్నవాడు ఆపడంతో ఆగిపోయారు....

ఈ పాటికి తన ఊళ్ళో అయితే మారు మాట్లాడక నా మాటకు విలువనిచ్చేవారు అని బాధపడుతూ ఏంచేయలేక వెనక్కి మళ్లాడు....

అప్పటికే ధ్యానం నుండి బయటకు వచ్చి గమనిస్తున్న సుందరం......ఏమిట్రా అక్కడ ఎదో జరిగినట్టుంది అనగానే జరిగిన విషయం అంతా వివరించాడు....

చెప్పానా నేను అప్పుడే...... 

మనకంటూ ఒక విలువ, గుర్తింపు ఉంటేనే మన మాటకి విలువ...


"గెలిచినోడి మాటే లోకం వింటుంది....నీ మాటలకు పదును ఉంది నీ కలాన్ని ఆయుధం చేసి సమాజపు తీరును మార్చేలా సిరాను కదిలించు...."


అప్పుడు నీకంటూ సమాజంపై ఒక హక్కు వస్తుంది.... 

నీ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అప్పుడు ఈ సమాజం ఎందుకు వినదో చూద్దాం....!!అని మాటల తూటాలను వదిలాడు సుందరం....

కానీ అదెలా సాధ్యం.....??అని అడుగుతున్న ఆనందంతో...

తరం మారుతున్న కొద్దీ.... పునాదులు మరచి వాటిని కనుమరుగు చేసి జీవం కనబడని కొత్త వాటికి ప్రాణం పోసి నవతరం పాత పద్ధతులను తక్కువ చేస్తుంది ..... అలా జరక్కూడదు...


అందుకే కాలం మారుతున్న కొద్దీ మనము మారాలి అప్పుడే పునాది రాళ్లలా మరుగున పడి ఉన్న మన మాటలు ఎదుటి వానికి ఇంపుగా ఉంటాయి....


అంటే కొత్త వింత పాత రోత అన్నట్టుగానా సుందరం....


అంతే కదరా....!! మన మనవళ్ళు,మనవరాళ్లకి అయినా ఇప్పటి కాలానికి ,వ్యవస్థకు అనుగుణంగా మార్చి మనం చెప్పాల్సిన విషయాలను, అనాదిగా వస్తున్న పద్ధతులను జోడించి కథలుగా చెప్తేనే వింటారు కానీ మన దారిన మనం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తే వింటారా....??



అందుకే నీ రచనలకు,భావాలకు ఇప్పటి వ్యవస్థను జోడించు, మార్పుని చూపించు....కాలానికి అనుగుణంగా మనలో,అందరిలో మార్పు రావాలి అది మంచికోసం అయి ఉండాలి...


నీ భావాలు,ఆలోచనలు ఆ ఊరికే పరిమితం కాకూడదు....బయటి ప్రపంచం నిన్ను గుర్తించేలా నేను నీకు తోడుంటాను..


సరే....నువ్వు ఇంత చెప్పాక కాదంటానా...అని తలుపాడు ఆనందం...

ఆనందం పత్రికల్లో ప్రచురణకు, సుందరం కూడా తన వంతుగా ప్రయత్నాలు మొదలెట్టాడు.....

చివరికి ఒక పత్రిక వాళ్ళు అంగీకరించారు...

అప్పుడు మొదలైన తన పయనం ఎక్కడా ఆగలేదు...

"ఆనందభైరవి" అనే కలం పేరుతో రచనలు చేస్తూ యువతరానికి,సామాజిక వ్యవస్థకి ,అన్ని అంశాల పట్ల అవగాహనను కల్పిస్తూ.....

చిన్న పిల్లల కథలు ,అన్ని వర్గాల వారికి నచ్చేలా రాయటం, చెప్పడం మొదలెట్టాడు.. 

అలా అతి తక్కువ కాలంలోనే ప్రముఖ రచయితగా,వక్తగా వార్తలలో నిలిచాడు.....

                 

             

                

ఒకరోజు ఉదయం ఆనందం ఇంటి ముందర లెటర్ బాక్స్ లో 10 ఉత్తరాలు ఉన్నాయి...కానీ ఒక ఉత్తరం మాత్రం అతని  మనసును తడిపింది...

"" అయ్యా...!! నమస్కారం, నేనెవరో మీకు తెలిసి ఉండదు ఎందుకంటే నేను మాములు వ్యక్తిని,


ఒక రోజు బాధ్యతారహితంగా మేము చేస్తున్న పనిని వద్దని వారిస్తుంటే మేము మిమ్మల్ని గేలిచేసాము..

 ఆ రోజు మేము చేసింది తప్పు....మిమ్మల్ని వెతికి మా తప్పును ఒప్పుకుందాం అనుకున్నాం.. అవకాశం లేకపోయింది...

 

మీ రచనలు,మీరు చెప్పే ప్రతి విషయాలు మమ్మల్ని ప్రతిక్షణం మమ్మల్ని జాగరుకులను చేస్తాయి... మీ మాటలు మమ్మల్ని చాలా ప్రభావితం చేసాయి...మీకు తోడుగా మేము మీ బాటలో నడుస్తున్నాము...

ఆ రోజు అలా తక్కువ చేసి మాట్లాడినందుకు మా క్షమాపణలు..."" అని రాసి ఉంది.

అది చదివిన ఆనందానికి ఆనందంతో కళ్ళు చెమర్చాయి...

ఏమిటండీ ఏదో పరధ్యానంలో ఉన్నారు అని అంటున్న 

భైరవితో...... ఏమీ లేదోయ్ ఒకప్పుడు ఇలా జరిగింది అని గతంలో జరిగిన సంఘటనని భార్యకి చెప్పాడు ఆనందం...

తన మాటలు విన్న భైరవి....సంతోషంతో ఇంత మార్పు మీలోనే అని అనుకుంతుంటే... అందరిలోనూ చూపిస్తున్నారుగా అంటూ మురిసిపోతూ... ..

ఇంకేం....!! సుందరం అన్నయ్యకి చెప్పక పోయారా అనగానే

  

 వెంటనే కాల్ చేసి చెప్పాడు....ఇదంతా విన్న సుందరం ......

 ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందిగా...మార్పు కనబడినట్టుంది....అంటూ వేస్తున్న ప్రశ్నకి అవునంటూ ఊ కొట్టాడు ఆనందం....

 

మొన్న జరిగిన సామాజిక కార్యక్రమంలో,ఇంకా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తీసిన చిత్రాలు నీకు పంపిస్తా అంటూ పంపాడు..ఆనందం..

అదంతా కుర్చీ వెనకాలే నిల్చొని వింటున్న సుగుణ.....ఆ చిత్రాలను చూసి... ఆనందం అన్నయ్య లో చాలానే మార్పు కనబడుతుంది......అని ఆశ్చర్యపోతూ ఉంటే....

అది చూసిన సుందరం గర్వంతో కూడిన సంతోషం మది నిండా నింపుకొని....

అవునోయ్ .......!! 

ఈ మార్పు మంచికేనోయ్....!! అంటూ మిత్రున్ని అలా పొగుడుతూ ఆనందంలో మునిగిపోయాడు సుందరం.....


Rate this content
Log in

Similar telugu story from Drama