కావ్య రాము

Inspirational

4  

కావ్య రాము

Inspirational

అమ్మే అపురూపం

అమ్మే అపురూపం

3 mins
696


అమ్మ గురించి చెప్పేంత గొప్పదాన్ని కాదు ఎందుకంటే అమ్మ అంత అనుభవం లేనిదాన్ని అనుభవం లోకి వస్తే కానీ ఆమె గొప్పతనం గురించి అర్థం చేసుకోలేకపోయా. 


బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తన అందమైన రూపాన్ని పసిగుడ్డు కిచ్చి అమ్మతనాన్నే తన అందంగా మార్చుకుంటుంది.


ఒక అమ్మగా నా అడుగులు ఇప్పుడే మొదలయ్యాయి. అమ్మ అన్న పిలుపులోనే ఎదో రహస్యం దాగుందేమో అనిపిస్తుంది. ఆ విలువ ,ఆ మాధుర్యం ప్రతి క్షణం నేనిప్పుడు చవిచూస్తున్న.

             

   ***


నా చిన్నప్పుడు అనుకుంటా ఇప్పటికి గుర్తు. అమ్మమ్మ వాళ్ళింటి దగ్గర పక్క పక్కన ఇళ్లల్లో అందరూ చాలా కలివిడిగా బంధువుల కన్న ఆత్మీయంగా ఉండేవాళ్ళు.


ఒకరోజు పక్కన ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తే తను అన్ని తీసుకొచ్చి నా చేతి లో పెట్టింది.వాటన్నిటినీ పక్కన పెట్టేసి నాకేమి వద్దు అని మా అమ్మ దగ్గరికి వచ్చేసా.ఈ విషయం ఇప్పటికి ఆ అమ్మమ్మ ఇన్ని సంవత్సరాలైన గుర్తు చేస్తూ ఉంటుంది.


అమ్మ  తన కళ్ళతోనే సైగ చేసేది అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అందులోనే అర్థమైపోయేది. 


తప్పేంటి,ఓప్పేంటి అని తర్వాత అర్థమయ్యేలా చెప్పేది. ఎవరి దగ్గర కూడా ఏమి ఆశించకూడదు, మన కంటూ ఆ భగవంతుడు ప్రసాదించింది మాత్రమే మనది అని చెప్పకనే చెప్తుండేది.



 పుట్టినిల్లు,మెట్టినిల్లు ఎపుడు ఒకటి కాదు ,పెళ్లి చేసుకొని కొత్త వాతావరణానికి అలవాటు పడాలి అంటే మనకి మనం మానసికంగా సంసిద్ధం అవ్వాలి,అన్నింటిని ఓర్చుకునే గుణం ఉండాలి. 


అందరి మనస్తత్వాలను,భిన్న విభిన్న ఆలోచనలను అన్నింటిని చదవగలగాలి, అన్నింటిని సమతూకం చేయాలి.అప్పుడే మన మనుగడ నిలకడగా ఉంటుంది అని అమ్మ రుజువు చేసింది. 


నాకు సంవత్సరంన్నర వయసుకే నాయనమ్మ కాలం చేసింది.ఆ మధ్యలో అమ్మకి, తనకి మధ్య ఉన్న బంధం చాలా బలపడింది.కానీ అంతలోనే అమ్మకు ఆడతోడు లేకుండా చేసాడు దేవుడు.ఆ క్షణం అమ్మ భాద వర్ణనాతీతం. అయినా తన మానసిక బలం గొప్పది.


ఇంటింటికో పొయ్యి అన్నట్టుగా ప్రతి ఇంటికో సమస్య ఉండనే ఉంటది.


పుట్టింటిని,మెట్టినింటిని కాపాడుకునే క్రమంలో ఎన్నో సవాళ్ళను,యుద్దాలను,పరీక్షలను ఎదుర్కొన్నా కూడా అన్ని కోణాల్లో బలయ్యేది ఒక ఇంటి కోడలైన కూతురే ఇది జగమెరిగిన సత్యం.


 అంతటి యుద్దాలు,సంఘర్షణలు అమ్మ జీవితంలో ఎన్నో....అయినా అన్నింటిని భరించింది.. మా కోసం, మా కుటుంబం నిలవడం కోసం....


ఉదయం 4 గంటలకు లేచి అన్ని పనులు చకచకా చేసి నాన్నకి, మాకు టిఫిన్ బాక్స్ కట్టడం,ఏవి కావాలంటే అవి అన్ని క్షణాల్లో చేసి పెట్టేది. దాని వెనక అమ్మ పడ్డ కష్టం ,అలసట ఎంతో ఉండేది అవి గుర్తించక అది బాలేదు ఇది బాలేదు అనడం. 

అప్పుడు అమ్మ మనస్సు ఎంతగాయపడి ఉంటుందో..!!!


ఊహ తెలిసే సరికి చదువులు, కొత్త కొత్త స్నేహల వల్ల అందరి అమ్మల్లా మా అమ్మలేదేంటి అని భాదపడేదాన్ని.


అప్పుడప్పుడు మాతో కఠినంగా ,అన్ని కట్టుదిట్టం చేస్తూ ఉండేది. కొన్ని విషయాల్లో మొండిగా, ఇంకా కోపంతో వ్యవహరిస్తుంటే ప్రతి సారి ఇలా చేస్తావేంటి అంటూ నేను నిష్ఠురంగా మాట్లాడేదాన్ని అప్పుడు అమ్మ అర్థం అవలెదు.


ఆ క్షణం అమ్మ ఎప్పుడు మమ్మల్ని భయంలోనే ఉంచుకుంటుంది అనుకునేదాన్నీ కానీ అది సక్రమ నడవడిక కు తను ఎంచుకున్న మార్గం అని ఊహ తెలిసాక అర్థమైంది.


కుటుంబ పరిస్థితుల మూలాన ఒక్కో సారి బాధను,కోపాన్ని పిల్లలమైన మా పై చూపేది..అప్పుడు మా అమ్మ కి నేనంటే ఇష్టం లేదేమో అందుకే ఇలా ఎప్పుడు కోపంగా ఉంటుందేమో అనుకునేదాన్ని...


అప్పుడూ... అర్థం అవలేదు అమ్మకి మేమే తన లోకమని, తన సర్వ హక్కులం అని.

అమ్మాయిగా పెద్దవాళ్ళతో,పరాయివాళ్ళతో, ఎలా మెలగాలి , సమాజం చూపులు మన పై పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో అన్ని చెప్తు ఉండేది. ఆ మాటలే మాకు శ్రీరామ రక్ష.


పనులు చేసి చేసి అలసిపోయి పడుకుంటే కానీ అర్థం కాలేదు కుటుంబానికి అమ్మ అవసరం ఏంటో..!!!


ఒక కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం అమ్మ .  అంత గొప్పది ఆమె పాత్ర.


ఒక్కోసారి మనసులో ఎంత బాధ ఉన్న బయటికి చెప్పేది కాదు ఎందుకో అర్థం కాకపోయేది.మేము ఎన్ని అన్న మమ్మల్ని చిన్న మాట కూడా అనేది కాదు. అది ఆమె సున్నితమైన మనస్సుకు నిదర్శనం.


అమ్మ మెదిలిన తీరు,మమ్మల్ని ఒద్దికగా పెంచడం అవన్నీ గమనిస్తూ ఉంటే ఆ సర్దుకుపోయే గుణం,సహనం,ఓర్పు తెలీకుండానే నాలో ఇమిడిపోయాయి.    


అందుకే ఆమె తీసుకునే నిర్ణయాలు చాదస్తంలాగా అనిపించినా అందులో ఎదో అంతరార్థం ఉండే ఉంటుంది అని అనుకుంటా.


నాన్న ని గౌరవించాలి అని చెప్పిన అమ్మ తనను ప్రేమించాలి అని చెప్పదు ఎందుకంటే అది ప్రత్యేకం కాదు జన్మతః వస్తుంది అని.



కానీ మనం మాత్రం అమ్మనే అన్నింటికీ కారణం చేస్తాం విసిగిస్తాం,అలకపాన్పులెక్కుతాం ,కోపం చేస్తం అయినా ఎప్పుడు కూడా తన పెదాలపై చిరునవ్వుతో బిడ్డా....!! అనే పిలుపుతో మనల్ని అక్కున చేర్చుకుంటుంది. అందుకే అమ్మే అపురూపం.


అమ్మనాన్నల పెంపకం మాకు ఆదర్శనీయం. ఎన్ని ఆస్థులు, అంతస్తులు అయిన అమ్మనాన్నల ప్రేమ ముందు మాకు అన్ని తక్కువే.


అమ్మ ముందర ఇన్ని మాటలతో క్షమాపణలను, కృతజ్ఞతలను అడగాలంటే కొంచెం బెరుకు, మళ్ళీ అమ్మతో బెట్టుగా ఉంటానేమో అని నా పై నాకు నమ్మకం,అమ్మ కదా అంత సులభం కాదు.  


అందుకే ఈ వేదిక ను అవకాశంగా తీసుకొంటూ...

నీ ఊపిరిని నాకందించిన అమ్మకి కృతజ్ఞతలు చెప్పినా తక్కువే..  


మా కోసం పరితపిస్తున నిన్ను కొన్ని సార్లు బాధ పెట్టినందుకు క్షమాపణలు తెలుపుకుంటున్న . 

అమ్మ నీ మాటల ధైర్యమే మాకు బలం. నువ్వు నడిపించిన మార్గమే మాకు స్ఫూర్తి.


రచన

-కావ్యరాము


Rate this content
Log in

Similar telugu story from Inspirational