STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

పుడమి తల్లికి పచ్చ చీర

పుడమి తల్లికి పచ్చ చీర

2 mins
341


పుడమి తల్లికి పచ్చచీర.


భూమిపై పర్యావరణ సమతుల్యము లోపించడం వలన ఎన్నో ఉత్పాతములు పెరుగుతున్నాయి. ఒక చోట వరదలు, వానలు, మరియొకచోట కరువులు కాటకాలు. భూగోళములో వేడి పెరిగి పోవటము వలన కలిగే దుష్ప్రభావము ప్రపంచంమునే దెబ్బ తీస్తున్నది.

ఈ పరిస్థితి ఇలాగే కొన సాగితే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

పర్యావరణమును సంరక్షించే వాటిల్లో అమూల్యమైన పాత్ర అడవులదే.

నేడు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై నడుము కట్టాలి.

భారత దేశములో చిట్టడవులు సంఖ్య తగ్గుతూ వస్తున్నది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మైనింగ్, పారిశ్రామీకీకరణ మొదలైన కారణాల వలన వనములు తగ్గి పోతున్నాయి.


అడవులు లేకపోవటంతో

వన్యప్రాణుల పరిస్థితి దుర్భరమైనది. వన్య ప్రాణుల సంఖ్య తగ్గి పోవటము దాని వలన ప్రకృతిలో జీవ వైవిధ్యము దెబ్బ తింటున్నది.


ఒకప్పుడు మన దేశములో చిరుతపులుల సంఖ్య వేలల్లో ఉండేది. ఇప్పుడు అసలు లేక విదేశాలనుండి 'చీతా'లను దిగుమతి చేసుకున్నాము.

దేశములో అడవుల పెంపకం గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజలు, పర్యావరణ వేత్తలు నిట్టూర్పులు విడిస్తే ఏం లాభం. కొంత ప్రయత్నం ప్రజల వైపు నుండి కూడా ఉండాలి.

ప్రతి ఒక్కరూ కొద్ది పాటి చోటులోనైనా మొక్కలు పెంచే అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న టౌన్లలో కొద్దిగా చోటు వున్నా చెట్లు పెంచాలి.

అలాగే టెర్రస్ గార్డెన్ లు పెంచడం కూడా మంచి అలవాటు. మెల్లి మెల్లిగా పచ్చదనము వైపు ప్రజలు అడుగు వేస్తే మంచిది.

ఇప్పటికే భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నాము.

అడవుల నరికివేతను అడ్డుకొనడానికి ప్రజలు ఉద్యమం లాగా చెయ్యాలి. ప్రజలలో చైతన్యం వలన ప్రభుత్వానికి తెలిసి వస్తుంది.


భారత దేశము మన దేశము. మన శరీరమునకు అనారోగ్యము వస్తే తగ్గించుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తామో, బలము పట్ట డానికి విటమిన్లు, మినరల్స్ ఎలా వాడి బాగు చేసుకుంటామో, అలాగే మన దేశానికి బలము అవసరము. ఆ బలము అడవులు, స్వచ్ఛమైన నదులు, పర్వతాలు, పీఠభూములు మొదలైనవి. మన భూదేవిని మనము ఆరోగ్యముగా కాపాడుకోవటము మన విధి.


ఈ నాటి డిజిటల్

 మాధ్యమము ద్వారా ప్రజలలో సమాచారము చేర వేయటం తమ కర్తవ్యం అని ప్రతి ఒక్కరూ భావించి, మొక్కల పెంపకం గురించి అందరికీ తెలియ చెప్పినప్పుడు దేశము పచ్చదనముతో కళకళ లాడుతుంది. 'వృక్షో రక్షతి రక్షితః '

ఈ ఆర్యోక్తిని అందరమూ అమలు చేద్దాము. మొక్కలు పెంచి మన వంతు బాధ్యత నెరవేరుద్దాము.

మన పుడమి తల్లికి పచ్చని చీరను నేత నేసి బహుమతి గా మన మందరమూ ఇవ్వాలి.అప్పుడే తల్లి ఋణము తీర్చుకోగలము.

---------------------------


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Inspirational