Midathana Teja

Inspirational

4.2  

Midathana Teja

Inspirational

సోదరికి లేఖ

సోదరికి లేఖ

2 mins
59


నేను రాసిన అక్క చెక్కిన శిల్పం నేను పుస్తకం గురించి వివరిస్తూ లేఖ..

                        

              


 గౌరవనీయులైన మౌనిక అక్క గారికి,

 మీ సంస్కారానికి నా నమస్కారం..

    

  ప్రియాతి ప్రియమైన సోదరికి,

   రాయుచున్నది ఏమనగా!


   మౌనిక అక్క నీ ఆరోగ్యం క్షేమంగా ఉందని, ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.. అయితే ఇప్పుడు నీ గురించి రాసిన ఈ చిన్న పుస్తకం గురించి తెలపాలనుకుంటున్నాను.. సమాజంలో అక్క - తమ్ముడు మధ్య బంధం నీరుగారుతున్నప్పుడు కొంచెం అయినా మేల్కొలిపే సాహసం చేయాలనుకున్నాను..


వరుసుకు అక్క అవుతాదని తెలిసినా, అక్క తమ్ముడని పిలిచినా ఆగని అర్థరాత్రి అత్యాచారాలు, వరుసుకు చెల్లెలు భావన ఏర్పడినా కూడా బంధించి ఆపై భయపించి కామవాంఛ తీర్చుకుంటున్న మనిషి రూపంలో ఉన్న క్రూర మృగాల్ని చూసి హృదయం చలించిపోయింది. సూర్యుడిలా జ్వలించిపోయింది.. ఆ అగ్ని జ్వాలల్లోంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తకం మన మధ్యన నెలకొన్న అపూర్వ బంధానికి తార్కాణం!..


ప్రతిరోజు దినపత్రిక చదువుతున్నప్పుడు అమ్మాయిలపై అత్యాచారాలు అనే వార్త చూసి ఆవేశంతో రగిలిపోతాను. అంతకుమించి నేనేమీ చేయలేకపోతున్నానని నా మస్తిష్కాన్ని(మెదడు) మంట వేసి మరీ మరిగిస్తాను. విపరీతంగా మరిగితే ఆ తర్వాత వచ్చే ఆవిరే ఆలోచనై, ఆ ఆలోచనే అక్షరంగా మారుతుంది. అలా వచ్చిన అక్షరాలే ఈ పుస్తకంగా రూపాంతరం చెందింది.


ఈ పుస్తకం లో ఉన్న కవిత్వంలోకి వెళ్తే అక్కడ ఒక లైన్ రాశాను గమనించి ఉంటావు.

అక్క మనసే ఒక పుణ్యక్షేత్రం అని. పుస్తకం రాస్తున్న తొలి నాళ్లలో ఆ లైన్ చదివిన వెంటనే నాకు ఫోన్ చేసిన రమేష్ అన్నయ్య మాట విని ఎంతో ఆనందించాను. అది చదివినప్పుడల్లా వాళ్ల అక్క గారు గుర్తుకురాడమే గాక, రోమాలు నిక్క బొడుచుకుని నించుంటాయి అని ప్రతీసారి చెప్పుకొస్తాడు. ఇంతకీ ఆ రమేష్ అన్నయ్య గురించి నీకు ఒక మాట చెప్పాలి!. నన్ను ఎప్పుడూ ఆయన గురూజీ అంటుంటాడు. ఆయనకు ఆయనే అలా ప్రకటించుకున్నాడు తప్ప, దాన్ని ఆమోదించే అర్హత గానీ, అధికారం గానీ నాకైతే అసలు లేదు. ఎప్పటికీ అలాంటి ఆలోచనే రాదు. ఆయన నాకన్నా వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, ఆకారంలో పెద్ద, చదువులో మరీ మరీ పెద్ద!.. అలా ఎందుకు పిలుస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన వివరణ విని విస్తుపోయాను. ఆ అన్నయ్య ఎవరో కాదు ఈ పుస్తకం యొక్క అట్ట మీద మూడో రివ్యూ రాసిన వ్యక్తి..


ఇంక చివరగా ముగింపుకు వస్తాను. ఒక మనిషి గురించి పుస్తకం రాయడం చాలా సులువు ఏమో కానీ, ఆ మనిషి యొక్క ఆదర్శాలను, విలువల్ని పాటించడం అతి కష్టం అక్క. నేను నీ నుంచి అన్నీ కాకపోయినా కొన్ని లక్షణాలన్నా నోచుకోవాలని ప్రయత్నిస్తాను. ఇది నీకు ఎలా వివరించాలంటే: చందమామ అంత అందంగా ఉందని చూసి ఆనందించడమే తప్ప, ఆ అందం నాకు లేదు ఏంటి అనుకుంటే అది నా మూర్ఖత్వం. అదే చందమామ వెన్నెల కురిపించి రాత్రి సమయంలో ఎందరో బాటసారిలకి దారి చూపుతుంది. ఇక్కడ నేను దారి చూపే లక్షణాన్ని గ్రహించాలి తప్ప, సహజంగా దానికున్న అందాన్ని కాదు కదా!.. అలానే అక్షరానికి అందం లేకపోయినా పర్లేదు కానీ, అర్థం లేకపోతే అది వ్యర్థం అక్క..


నా గురించి నేను నిర్వచించుకోవాలంటే, విద్యాభ్యాసం ఏమో డిగ్రీ వరకు సాగింది.

 కానీ, అందులో 18 సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థిని. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మొద్దు బుర్ర బెకార్ ని..



My God, My Guide, My Philosopher, My Friend.. అన్నీ మా మౌనిక అక్క..


                          ఇట్లు

                     అక్క ఆరాధకుడు..,

                        TejaMalli




Rate this content
Log in

Similar telugu story from Inspirational