Midathana Teja

Abstract Fantasy Inspirational

4.7  

Midathana Teja

Abstract Fantasy Inspirational

అక్క చెక్కిన శిల్పం నేను

అక్క చెక్కిన శిల్పం నేను

5 mins
79


మా మౌనికా అక్కతో నా పరిచయం హేమంత్ అన్న ద్వారానే ఏర్పడిందని

చెప్పాలి!. 

ముందుగా ఆ అన్నయ్యకి నా ప్రత్యేక కృతజ్ఞతలు.హేమంత్ అన్న మా కుటుంబ సభ్యుడు కావడం, చిన్నప్పుడు ఇద్దరం ఒకే బడిలో

చదువుకోవడం నా జీవితంలోనే పదిలంగా నిలిచిపోయే ఘట్టం. ఇద్దరికీ వ్యత్యాసం వయసులో తప్ప! ఒకరినొకరు స్నేహంగా చూసుకోవడంలో కాదు. దీనికో చిన్న ఉదాహరణ ఉట్టంకిస్తాను, మేము ఉండే తరగతి గదులు వేరైనా కూర్చునే చోటు మాత్రం ఒకటే. మాకు నృత్యం నేర్పించే డాన్స్ టీచర్ సౌజన్య మేడం గారు తరచూ మా ఇద్దరి కలయికను, కదలికలను చూసి మీ బాండింగ్ బ్లడ్ ఫ్రెండ్స్(ప్రాణ స్నేహితులు) రీతిలో ఉంది అనేవారు..

ఆ మేడం గారు చేత ఆ మాట అనిపించుకున్నామంటే, నాకు అన్నయ్య ఇచ్చిన చనువు అలాంటిదని చెప్పకనే చెప్పాలి!.

ఇంక మా అక్క విషయానికి వస్తే :

 అక్క ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూంటుంది! “నాలో నీకు ఏమి ఇష్టం, నేనంటే నీకు ఎందుకంత అనంతమైన ప్రేమ మరియు హద్దులేని అభిమానం అని”. మనం సరస్వతి దేవిని ఆరాధిస్తాం అంటే ఎందుకని చెప్పాలి!. ఇదే సందేహం నా మనసులో మెదులుతుంది.


ఇక్కడ ఓ సందర్భాన్ని వివరిస్తాను:

 నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం(2nd year)లో ఉండగా, నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అందులో చాలా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. మధ్యాహ్నం కావస్తుంది నేను భోజనం చేసే సమయం అప్పుడు, చూసుకోండి మరి అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు సమేతంగా ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నట్టుగా నా చుట్టూ చుట్టుముట్టేశారు..


 ఆ చర్చ బావగారితో మొదలైంది. అక్కడ నుంచి అరుపులు, ఆరోపణలు, ఆవేశాలు, ఇలా ఎన్నో మాటలతో తుఫాను ఉప్పెన బీభత్సం చేసినట్టు చేశారు. అయితే ఇక్కడో విషయం, తల్లిదండ్రుల మాటలు ఎప్పుడూ బిడ్డల ఎదుగుదల కోసమే అని అనుకున్నాను. మిగతా వాళ్ళ మాటలు మాత్రం“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే తీరులో ఉన్నాయి”. ఆ దెబ్బకి ఆకలి కూడా ఆవిరైపోయింది.

  వెంటనే నా గదిలోకి వచ్చేశాను. అక్కకు మెసేజ్ చేసి జరిగిందంతా అక్క చెవిలో ఊదేశాను. దాదాపు అర్థగంట పైమాటే నాతో ఫోన్ లో సంభాషించింది. అప్పటికే నా శరీరం అంతా సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి. కంటిలో కన్నీళ్లు అలల అలజడిలా పొంగుతున్నాయి.  

ఎవరు చెప్పినా వినే స్థితిలో లేను. మృత్యువుని ముద్దాడుతేనేమో అనుకుంటున్నప్పుడు ఫోన్ లో అక్క మాటలు నన్ను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయి.

ఆ క్షణం నాకు ఒక చంటిపిల్లాడిని స్నానం చేయిస్తున్నట్టుగా అనిపించింది. ఆ చంటి పిల్లాడిని నేనే అయినప్పుడు సమస్యల్ని సబ్బుతో కడిగేసి, మంచి మాటల్ని గోరుముద్దలుగా మలిచేసి, నేను నీకు అక్కను కాదా! నీకోసం నేను ఇదిగో వస్తున్నాను అంటూ నా ఎదురుగా కదలాడుతున్నట్టు కనబడింది. ఆ రోజుతో అక్కతో బంధం మరింతగా బిగిసింది.

కొన్నిసార్లు ఎంతో ఆగ్రహంగా ఉండే నేను అక్క అనుగ్రహంతో అహంకారం వీడి అందరిని ఆదరించే అలవాటు నేర్చుకున్నాను.

 ఒక పక్క ఉద్యోగం మరొక పక్క చదువు రెండిటిని తూకంలో బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా మహిళామూర్తి.

ముఖ్యంగా నేటి అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తి!


ఈ మధ్యన అక్క జన్మదినోత్సవ సందర్భంగా విశాఖ లో ఒక కళాశాలలో ఉంటున్న అక్క దగ్గరికి నేరుగా వెళ్లి, చిరుకానుక బహుమతిగా బహుకరించాను. అలా కూర్చోని కొంతసేపు మాట్లాడుకున్నాం. అప్పటికే రాత్రంతా ఉద్యోగం చేసి అలిసిపోయి ఉంటుంది. ఉదయం పక్కాగా పడుకోవలసిన సమయం అది. నిద్ర లేనప్పటికీ అక్క కళ్ళు సూర్యకాంతిలా ప్రతిబింబించాయి..

ఎంతోసేపు బ్రతిమాలాను అక్క పాదాలు పట్టుకునే భాగ్యాన్ని కలిగించమని. అక్క ఏమో అయిష్టంగా తల ఊపుతుంది. అయినా నేను అకస్మాత్తుగా రెండు పాదాల్ని తాకేశాను. ఒక్కసారిగా సాక్షాత్తు సరస్వతీ దేవి ప్రత్యక్షమై నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది.


అక్కలో మరో కోణం: 

     ఎవరికైనా కోపం రావడం సర్వసాధారణం. ఆ కోపంలో నోటికి వచ్చిన తిట్లుతో ఇతరుల మీద విరుచుకుపడతాం. అదే అక్క అయితే ఆ ఉధృతమైన కోపాన్ని చిత్రలేఖనంపై చూపించి ఒక అందమైన చిత్రాన్ని గీసి తన నైపుణ్యాన్ని చాటుతుంది. తద్వారా అందరి మన్ననలు అందుకుంటుంది. ఆనందాలకు పొంగిపోదు, కోరికలకు లొంగిపోదు.  

                                          సమస్యలు ఎన్ని ఎదురైనా తన భుజస్కంధాలపై మోసుకుంటూ, తన లోపాల్ని తానే చూసుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది. నేను బాధల్లో ఉన్నప్పుడల్లా చరవాణిలో అక్కని సంప్రదించేవాడిని. అక్క నోటి నుంచి వెలువడే మాట నాకు మాత్ర(మెడిసిన్)గా పనిచేసేది.


 అక్క ఓపిక గురించి చెప్పుకోవాలి! కాలేజీ రోజుల్లో తన ఇంటికి, కాలేజీకి సుదూర ప్రయాణం. సాయంత్రం వరకు కాలేజీలో క్లాసులు, తర్వాత బస్సులో సమస్యని సృష్టించే ఆకతాయిల ఆగడాలు మధ్య తన సంయమనం నిజంగా మెచ్చుకోవాలి. 

నమ్మిన స్నేహితులు ఉన్నట్టుండి మాట్లాడకపోతే అక్క పడే తపన అంతా ఇంతా కాదు. తనది తప్పు లేకపోయినా కారణం ఏదైనా వాళ్లతో కలిసుండాలనే తాపత్రయం ఎక్కువ. తన వాక్ పటిమను ఉపయోగించి ఏ ఒక్కరిని గాని, ముఖ్యంగా శత్రువుల్ని గాని పరుష పదజాలంతో ఏనాడూ నిందించడం ఎరుగని సంస్కారి. తనని విభేదించే వారిని సైతం బాధించకుండా బాధ్యతగా అక్కున చేర్చుకోవడం అక్క నైజం.

మా ఇద్దరికీ నిరంతర సంఘర్షణ జరిగేది ఒకే ఒక అంశం దగ్గర అదే రాజకీయం. ఒక నాయకురాలికి ఉండవలసిన నాయకత్వ లక్షణాలన్నీ కలగలిపి సంపూర్ణంగా ఉన్నప్పటికీ, రాజకీయం అంటే ఎందుకు అంత అసహ్యమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఎప్పుడూ అంటుండేవాడిని నీలాంటి మహిళ రాజకీయాల్లోకి వస్తే ఆ వృత్తికి, ప్రజలకి మేలు జరుగుతుందని. ఒకవేళ నేను అన్నదే జరిగితే అక్క దగ్గర ముఖ్య సలహాదారుగా ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ చేస్తూ అక్క చెంతనే ఉండిపోదామని నా ఆశ నాది అనుకోండి.   


ఈ విషయంపై పలుమార్లు అక్కతో భీకర యుద్ధం చేసి చివరకు ఓడిపోయాను. తన చెప్పిన వివరణకే వత్తాసు పలకవలసి వచ్చింది.


అక్క ఎంచుకున్న ఏ రంగమైనా, అందులో త్రికరణశుద్ధిగా చెయ్యగలిగే ధీశాలి, అంత దయాశీలి. “గర్వం లేని ముఖవర్చస్సు చూపరులను ముగ్ధులను చేసే దివ్య తేజస్సు”. అందుకే రాజకీయం విషయంలో అక్క గురించి ఘంటాపథంగా చెప్పగలిగాను..


ఈ సరస్వతీ పుత్రికని నాకు అక్కగా ఇచ్చిన ఆ మాతృమూర్తి పాదాలు తాకే అవకాశం ఎదురయితే ఈ జన్మకి ఇది చాలు అనుకుంటూ. వచ్చే జన్మంటూ ఉంటే ఇద్దరం(అక్క,నేను) ఆ మాతృమూర్తి కడుపునే పుట్టాలని మనసారా కోరుకుంటున్నాను. అక్క నిండు నూరేళ్లు ఆరోగ్యంగా,అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను.


నేను నా ఇంటి ముందు “పల్లె వనం”(పూలతోట ) ఏర్పాటు చేసే విధంగా తన సలహాల్ని, సూచల్ని ఆలోచనల్ని, నాతో పంచుకొని నాలో చిరు మార్పును తెప్పించిన మరో శక్తి మా మౌనిక అక్క. ఆ అక్కకి నా ధన్యవాదాలు శతకోటి దండాలు..


మా మౌనికా అక్క గురించి నా మాటల్లో:


ఓర్పుగా అందర్నీ ఓదార్చుతుంది,

నేర్పుగా అందరికీ జీవిత పాఠాలు నేర్పుతుంది,

చేర్పుగా అందర్నీ దగ్గరికి చేర్చుకుంటుంది,

చివరికి అందరికీ మౌనం తో సమాధానం చెప్తుంది.


30-07-2022 ఆరోజు మా “మౌనికా అక్కని” మర్యాదపూర్వకంగా కలిశాను. బాగున్నావా అక్కా.. అంటూ ప్రీతిగా పలకరించాను. అక్క నా ద్విచక్ర వాహనాన్ని చాకచక్యంగా నడుపుతున్నప్పుడు ఇంధనం కరిగింది, వాహనం అందం తరిగింది, అక్క ఆనందం పెరిగింది. అక్కతో పరిచయం లేని చంటిపాప కూడా అక్క దగ్గరికి వచ్చేసి ఆడుకుంటూ ఒడిలో పడుకుంది.

అక్క మాటలు - ఆ చంటి పాపకు పాటలు అన్నట్టుగా గాఢ నిద్రలోకి జారుకుంది.



అక్కపై నా లోతైన అధ్యయనం కవితా రూపంలో:


M= మార్గదర్శకమైన మహిళవి,

O= ఓపికని ఊపిరిగా అనుకోని,

U= ఉదయించే సూర్యుడిలా,

N= నీ నడవడికలో నాకు నడక నేర్పుతూ,

I = ఐక్యమత్యం ఉండాలని చాటి చెప్తావు,

K= కోపంలో పెన్ను పడతావు,

    అదిరిపోయే చిత్రాన్ని గీసి మా ముందు                 పెడతావు,                        

A= ఆదర్శమైన అక్కవి - ఈ తమ్ముడికి దిక్కువి.



అక్క ఏకగ్రతతో చేస్తుంది మెడిటేషన్.,

బాధ ఎంతైనా తీసుకోదు మెడిసిన్,

తన మౌనమే తనకి మోటివేషన్,

సమస్య ఏదైనా పడదు టెన్షన్.

              

 ఉద్యోగ వృత్తిలో నిరంతరాయంగా శ్రమిస్తావు,

ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తావు, 

 స్నేహితులకు నీ మాటే మంత్రంలా వినిపిస్తావు,

శత్రువుని సైతం స్నేహంగా చూస్తావు,

 ఆపై మంచి మార్గంలో నడిపిస్తావు.


చదువులో అందరితో పోటీ పడతావు,

పరీక్షలో అగ్రశ్రేణిగా మార్కులు కొడతావు, 

విమర్శల్ని పక్కన పెడతావు,

వినయాన్ని చూపెడతావు.


అక్క వ్యక్తిత్వం - అంకితం నా ఈ కవిత్వం


అక్క అనునిత్యం పనిచేసే యంత్రం,

గాయాన్ని సైతం నయం చేసే గాత్రం,

క్రమశిక్షణ చూపే అక్క నేత్రం,

అక్క మనసే ఒక పుణ్యక్షేత్రం.


సుగుణాలు కలిగిన అక్క ఆకారం,

నా ఆనందానికి ఒక ఆధారం, 

మక్కువతో కూడిన మమకారం, 

పసి పాదాల సుకుమారం,

అక్క నవ్వు ఒక సుందరం, 

అందుకే అభిమానులం అందరం.


అక్క అందని అరుదైన అరుణతార,

సౌందర్యంలో సరిరారు ఏ సినీ తార,

కుటుంబంలో ముఖ్యమైన పాత్ర,

ఎంత బరువునైనా మోసే భూమిపుత్ర,

అక్క దర్శనమే నాకు తీర్థయాత్ర.


 కోపానికి కలంతో రూపం ఇచ్చిన శిల్పి,

 మదిని మీటే మాటలతో మేలుకొలిపి,

 శత్రువుల్ని కూడా మిత్రులుగా జతకలిపి, 

పొగడ్తల్ని, పదవుల్ని పక్కకు జరిపి,

తప్పుడు కూతలు కూసే వాళ్ళపై జాలిచూపి,    

 ఆపై ధనం కాదు గుణం అనే పాఠాన్ని నేర్పి!                        


అరుణతార= అరుదుగా‌ కనిపించే ఎర్రని నక్షత్రం.. (సూర్యుడు)..

సుకుమారం= మృదుస్వభావం 


(అక్క పాదాలు తాకినప్పుడు నాకు అనిపించింది, ఒక చంటిపిల్ల పాదాలకు ఉండే మృదత్వం కనిపించింది).

సౌందర్యం=1)బాహ్య సౌందర్యం అంటే శారీరక రూపం..(శరీరం, ,కళ్ళు మొదలైనవి).

2)అంతర్గత సౌందర్యం (దయ, కరుణ, సానుభూతి, సహాయం ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన మానవులు).

“ఓ సరస్వతి పుత్రిక - మా మౌనిక అక్క”.

“అరుదైన జాతి మొక్క - మా మౌనిక అక్క”.


Rate this content
Log in

Similar telugu story from Abstract