కరోనా : కొత్త ఉద్యోగం
కరోనా : కొత్త ఉద్యోగం
ఓ వైపు లాక్ డౌన్. నేనేమో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. భయం భయంగా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్ళేవాణ్ణి. నేను జాయిన్ అయిన రెండు రోజులకే లాక్ డౌన్ రావడంతో ID కార్డ్ కూడా ఇవ్వలేదు.
ఎక్కడ పోలీసులు ఆపుతారో అని భయం. మధ్యాహ్నం సరిగ్గా భోజనం దొరికేది కాదు.
హోటల్స్ లేవు కదా. చేతిలో డబ్బులు ఉన్నా కావాల్సినవి కొనుక్కుని తినలేని పరిస్థితి.
ఆఫీసు మొత్తం మీద నలుగురం వచ్చే వాళ్ళం. ఎవరి ఫ్లోర్లో వాళ్ళు కూర్చుని ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.
రాత్రిళ్ళు లేట్ అయితే భోజనం అసలు దొరకదని మరో భయం. హాస్టల్లో పరిచయమైన ఇద్దరు నాకోసం అన్నం, కూర పక్కన పెట్టి ఉంచేవారు.
పొద్దుటే హాస్టల్ నుండి టిఫిన్ అందరికీ కలిపి నేనే తెచ్చే వాణ్ణి. వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ లేట్ గా లేచేవాళ్లు.
దూరం దూరంగా కూర్చుని మాట్లాడుకుంటూ తినేవాళ్ళం. ఆదివారం రోజు సూపర్ మార్కెట్ కి వెళ్లి చిప్స్, చాక్లెట్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇంకా లోకల్ మార్కెట్ తెరిచినప్పుడు ఊరగాయలు తెచ్చుకుని స్టాక్ పెట్టుకునే అలవాటు చేసుకున్నాం.
అలా గడిచింది కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్.
