కరోనా కాలంలో..
కరోనా కాలంలో..
అలా భయపడకూడదు కృష్ణా. ధైర్యంగా ఉండాలి. విజయ ఒక్కో పదం సగం నమ్మకంతో సగం బాధతో చెబుతోంది.
వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న నమ్మకం. అంతవరకూ ఏమీ చేయలేని పరిస్థితికి బాధ.
కృష్ణ వయసు ఇంకా పదిహేను కూడా దాటలేదు. ఊపిరితిత్తుల వ్యాధితో హాస్పిటల్లో చేరిన అతనికి అంతలో COVID-19 లక్షణాలు కనిపించడంతో కరోనా వార్డులో ఉంచారు.
విజయ లాంటి ఎందరో పీజీ విద్యార్థులు ఆ ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఇలాంటి పేషెంట్లను చూస్తున్నారు. సీనియర్ డాక్టర్లు చాలా మంది హాస్పిటల్స్ కి రావట్లేదు. వాళ్ళకి మాత్రం సమస్యలు ఉండవా?
రాత్రి పూట వాళ్ళు ఒంటరితనంతో బయటకు వెళ్లిపోతాం అంటూ చేసే అరుపులు వింటూ వాళ్ళు సమయం గడుపుతున్నారు.
ఈరోజో రేపో వ్యాక్సిన్ వస్తుంది అనే నమ్మకంతో పేషెంట్లకు ధైర్యం చెబుతూ, వాళ్లకు వాళ్ళు సర్ది చెప్పుకుంటూ, చావుల్ని చూసి చలించలేక కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు.
(కరోనా వార్డుల్లో వారి వారి విధి నిర్వహణ చేసిన వారందరికీ అంకితం)
