Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కొత్త సంవత్సరంలో కొత్తగా..

కొత్త సంవత్సరంలో కొత్తగా..

1 min
383


ఇక లాభం లేదు. కొత్త సంవత్సరంలో నేనూ పాడ్ కాస్ట్ మొదలెట్టాల్సిందే.


ఇంతకూ మైక్ ఎక్కడ కొనాలి అని అన్ని యూట్యూబ్ ఛానెళ్లు చూసి ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నాకు తెలిసిన పరిజ్ఞానం అంతా ఉపయోగించి రికార్డ్ చేసాను.


బానే ఉంది. నా గొంతు మరీ అంత గొప్పగా లేకపోయినా వినేట్టుగానే ఉంది. 


అవి అప్లోడ్ చేసాను. ఎవరైనా వింటేగా.. బ్రో ఇదిగోండి ఇది వినండి అని ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే వెంటనే వచ్చే సమాధానం.. 


నా యూట్యూబ్ ఛానెల్ కి సబ్స్క్రయిబ్ చేయండి అని. సరే. చేసాను. ఇంకొకరు వాళ్ళ పాడ్ కాస్ట్ విని సమీక్ష చేయమంటారు.


ఓపిగ్గా అవన్నీ చేసాక, ఇప్పుడైనా నా పాడ్ కాస్ట్ విని అభిప్రాయం చెబుతారని ఎదురు చూడ్డం. అది జరక్కపోగా మళ్లీ అందరినీ అడగడం.


ఇంకిలా కాదు. ఇక నేను ఆగకుండా పాడ్ కాస్ట్ ఎపిసోడ్లు అప్లోడ్ చేస్తాను. సమీక్షలు వచ్చినప్పుడు వస్తాయి.


సంవత్సరం గడిచాక కూడా సమీక్షలు రాలేదు. పెద్దగా ఎవ్వరూ వినలేదు.


అయితేనేం.. వచ్చే ఏడాది నేనూ ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టేద్దాం అనుకుంటున్నాం. కొత్త సంవత్సరం. కొత్త ప్రారంభం మరి..


Rate this content
Log in

Similar telugu story from Abstract