కళ్ళల్లో కొత్త నీరు
కళ్ళల్లో కొత్త నీరు
నీరజ ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకుంది. ఆ స్టేజీ మీద ఆమె కళ్ళల్లో నీళ్ళు. కన్నీరు కాదు. అదేదో కొత్త నీరు..
ఒక్కసారి నీరజ గతంలోకి వెళ్ళిపోయింది..
సంవత్సరం ముందు..
మాధవ్. ఒక్క సారి నా గురించి ఆలోచించావా. ఒక్కసారి..
నీరజ మాట్లాడుతుంటే కాల్ కట్ అయ్యింది.
స్కూటీ తీసుకుని వెంటనే మాధవ్ రూం వైపు వెళ్ళింది. అతను లగేజీ తీసుకుని క్యాబ్ ఎక్కుతున్నాడు. మాధవ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఏదైనా తప్పు ఉంటే చెప్పు.
నేను మార్చుకుంటా. నీకు నచ్చేట్లు మారతాను. నీరజ అతని చెయ్యిని పట్టుకుంది.
మాధవ్ క్యాబ్ డ్రైవర్ కి ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అని చెప్పి లగేజీ లోపల పెట్టి క్యాబ్ డోర్ వేశాడు.
ఒక్క నిమిషం నీరజా. నీకెన్ని సార్లు చెప్పినా అర్థం కాదు. మొదట్లో నువ్వు నాకు నచ్చావ్. ఇప్పుడు నచ్చట్లేదు. ఇట్ ఈజ్ సింపుల్ థింగ్ అన్నాడు.
నీరజ తల దించుకుంది. క్యాబ్ బయలుదేరిన శబ్దం ఆమెకు తెలుస్తోంది.
నీరజ కళ్ళల్లో నీరు. ఆ రోజంతా ఆమె ఏడుస్తూనే ఉంది. అలా కొన్ని వారాలు ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆమె వ్రాయడం ప్రారంభించింది. కన్నీటిని కదిలించే పదాలుగా మార్చింది.
ఇప్పుడు ఆమె కళ్ళల్లో కొత్త నీరు మెరుస్తోంది..
