Dinakar Reddy

Abstract Inspirational

3  

Dinakar Reddy

Abstract Inspirational

ఝాన్సీ నాది

ఝాన్సీ నాది

1 min
253


ఈ ఝాన్సీ నాది. దీనిని నేను ఎప్పటికీ ఆంగ్లేయుల పరం కానివ్వను. నా ప్రజల్ని బానిసలుగా ఉండనివ్వను.

రాణీలక్ష్మీబాయి పూర్తిగా గాయాలతో ఉంది. అయినా ఆమె మనసులో భారత దేశ స్వతంత్రం కోసం ఆరాటం.

హ్యూగ్రోజ్ ఆమె వైపే వస్తున్నాడు. అప్పటికే రాణి చేతిలో పలు మార్లు గాయపడిన అతను ఆమెను ఓడించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.

రాణీ లక్ష్మీబాయి తన శవం కూడా బ్రిటీష్ వారికి దక్కకూడదని నిర్ణయించుకుంది. హర హర మహాదేవ అంటూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ముందుకు సాగింది.

               ***

ఆమె ఎలా మరణించింది అని ఖచ్చితంగా చెప్పే శాసనాలు లేవు. 

తను క్రాంతిగా విప్లవ స్ఫూర్తిగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయింది.

बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,

खूब लड़ी मर्दानी वो तो झाँसी वाली रानी थी.

అని పాడే గొంతుల్లో ప్రాణం పోసుకుంటూ ఉంటుంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract