Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఇంకేదో మారాలి

ఇంకేదో మారాలి

1 min
384


ప్రతి సంవత్సరం మొదలయ్యే సమయంలో కొత్త తీర్మానాలు తీసుకోవడం అలవాటే కదా.


కిందటేడాది అనుకున్నా సినిమాలు చూడ్డం తగ్గించుకోవాలని. అనుకున్నట్టే మొదటి మూడు నెలలు థియేటర్ కి వెళ్ళడం మానేసా.


అయితే పెద్ద చిక్కు అక్కడే వచ్చింది.. హాల్లో చూడకుండా OTT లో రోజూ ఒక కొత్త సినిమా చూడ్డం మొదలైంది. ఇంకేముంది తెలీకుండానే టైమ్ గడిచిపోయింది.


ఆ ముందు ఏడాది బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టకూడదు అని తీర్మానం చేసుకున్నాను..అక్కడే మరో చిక్కు మొదలైంది. ప్రతి వారం ఏదో ఒక హోటల్ వెతుక్కుని వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఆ రీల్స్ లో ఏదో ఒక వెరైటీ టేస్ట్ చూపించడం, దాని కోసం నేను తిరగడం. ఇలా జరిగిపోయింది.


ఈసారి నూతన సంవత్సరం కోసం ఏం రిజల్యూషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా టైమ్ కి పడుకోవాలి అనుకుంటే మంచిదేమో. ఈ మధ్య పడుకునే సరికి పన్నెండవుతోంది.


రోజూ పదకొండూ యాభై నిమిషాలకే పడుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. అంటే పది నిమిషాలు తగ్గిస్తూ ఈ సంవత్సరం అయ్యేసరికి పదింటి లోపు పడుకుంటాను కదా..

ఆనక మళ్లీ కొత్త సంవత్సరం.. కొత్త రిజల్యూషన్..


Rate this content
Log in

Similar telugu story from Abstract