ఇంద్రజాలం
ఇంద్రజాలం
నాతో ఒక్కసారి మా ఇంటికి రండి అందావిడ. సమయానికి చిల్లర డబ్బులు ఇచ్చి షాపులో నాకు సహాయం చేసింది. వయసు కూడా ముప్పై లోపే ఉన్నట్టుంది. చలాకీగా మాట్లాడుతూ మా ఇంటికి వెళ్ళే రూట్ లోనే తన ఇల్లు కూడా అని, నన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని అంది.
సరేనని నేను కొన్న సరుకులు ఆవిడ కారులో ఉంచి ఇద్దరం బయలుదేరాము. మా ఇల్లు సిటీ కి దూరమే. ఆ రోజు అమావాస్య కావడంతో అంతా చీకటిగా ఉంది.
వాళ్ళ ఇల్లు అని చెప్పి ఒక పాడుబడ్డ బంగ్లా చూపించింది. ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. నేను ఆమెనే వెతుక్కుంటూ నేనూ లోపలికి వెళ్ళాను.
లోపలంతా చీకటి. చీరతో చెమట తుడుచుకున్నాను. ఏదో చప్పుడు వినిపిస్తోంది. అటుగా వెళ్ళాను. మొబైల్ ఫోన్ లో సిగ్నల్ కూడా లేదు. తలుపు కాస్త తెరిచి ఉంటే తొంగి చూసాను.
నాకు మాట పడిపోయినట్లు అనిపించింది. నన్ను తీసుకొచ్చిన అమ్మాయి అక్కడ ఉంది. ఏవో లైట్లు వెలిగించి నా శరీరం చుట్టూ తిరుగుతోంది. ఆశ్చర్యం. అది నా శరీరమే. మరి నేనిక్కడెలా ఉన్నాను. నన్ను నేను తడిమి చూసుకున్నాను.
అంతా గడ్డకట్టినట్లు అనిపిస్తోంది. ఇదంతా ఏదో ఇంద్రజాలం లా ఉంది.
పద్మజ ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు.

