ఇది యాదృచ్ఛికం(?)
ఇది యాదృచ్ఛికం(?)
తరుణ్ ముందు సీట్లో ఉన్న అతని ముఖం చూశాడు. అచ్చం ఒకప్పటి తనలాగే ఉన్నాడు. పాతికేళ్లు ఉంటాయ్. మాసిన గెడ్డం, చేతిలో ఖరీదైన మొబైల్ ఫోన్. ఈ ప్రపంచంతో తనకేం లేదన్నట్లు శూన్యంలోకి చూస్తున్న చూపులు.
విశాఖపట్నం వెళుతున్నారా? అని అడిగాడు తరుణ్. అవునన్నట్టు తల ఊపాడు.
నా పేరు తరుణ్ అండీ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఎదురుగా కూర్చున్న అతను ఇబ్బందిగా కదిలాడు.
ఏదో బాధలో ఉన్నట్లున్నారు అన్నాడు తరుణ్. కొన్ని బాధలు చెప్పుకోలేం సార్ అన్నాడు అతను.
రైలు ఏమీ పట్టనట్లు వెళ్ళిపోతోంది. తరుణ్ కంటే పదేళ్లు చిన్నగా కనిపిస్తున్నాడు అతను.
గిరి అండీ నా పేరు అని పరిచయం చేసుకున్నాడు. నాలుగేళ్లు నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను మరచిపొమ్మంది సార్. కనీసం కారణం కూడా చెప్పట్లేదు. గిరి గొంతు బొంగురుపోయింది.
అదేంటో ఏ సంబంధం లేని వాళ్ళకి మన బాధలు చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఒక్కోసారి అంతే. ఎందుకంటే మళ్లీ వాళ్ళు మరుసటి రోజు నుంచీ పక్కనే ఉండి మనల్ని జడ్జ్ చెయ్యలేరు కదా. అందుకే చాలా మంది ప్రయాణాల్లో కలిసే వాళ్ళకి తమ ఆత్మకథ చెప్పేస్తూ ఉంటారు.
పదేళ్ల క్రితం తను పడిన బాధ. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత కావేరి తనను మరచిపొమ్మని వ్రాసిన ఉత్తరం, అది పట్టుకుని తను పిచ్చివాడిలా రైల్లో ఊరూరూ తిరగడం. తరువాత ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకోవడం.
బహుశా గిరి ఫోన్లో నూ బ్రేకప్ మెసేజ్ ఉండి ఉంటుంది.
ఇవన్నీ గిరి జీవితంలోనూ జరుగుతున్నాయా? ఇదంతా యాదృచ్ఛికం అనుకోవాలా? ఏమో. ఇలా అయితే తొంబై శాతం ప్రేమలు ఇంతే అనుకోవాలా?
తరుణ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
సార్. మీరెందుకు ఏడుస్తున్నారు. గిరి అడిగాడు.
ఏమీ లేదు అంటూ తరుణ్ తన భార్యకు ఫోన్ చేశాడు
